Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
అలర్ట్ : ‘‘కంటి చూపు’’ మెరుగ్గా ఉంచే 8 హెల్తీ సూపర్ ఫుడ్స్ ..!!
వయస్సైన తర్వాత కంటి సమస్యలు రావడం సహజం.కానీ, ఇలా చిన్నవయస్కుల్లో,మద్యవయస్సు వారిలో కంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటే మాత్రం ప్రారంభ దశలోనే తగిన జాగ్రత్తలు తీసుకుని కంటి చూపును మెరుగుపరుచుకోవడం మంచిది.
''ఐ''సైట్ ఈ మద్య కాలంలో పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య. కుటుంబంలో చిన్న పిల్లలున్నప్పుడు, వారు చిన్న వయస్సు నుండే కళ్ళ అద్దాలు పెట్టుకుంటే ఎలా ఉంటుంది.? చాలా బాధ గా అనిపిస్తుంది. ఈ వయస్సుకే కళ్ళ అద్దాల వాడటమా అని ప్రశ్న మనస్సులో వేదన కలిగిస్తుంది? ప్రస్తుత మోడ్రన్ ప్రపచంలో కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ ఇతర గాడ్జెట్స్ ను ఎక్కువగా వాడటం వల్ల కంటి సమస్యలను వెంటాడుతున్నాయి. నిద్రలేచినప్పటి నుండి తిరిగి రాత్రి పడుకొనే వరకు ఏదో ఒక రకంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కంటి చూపు దెబ్బతుంటుంది.
చిన్న పిల్లల్లోనే కాదు, పెద్దవారిలో కూడా ఐసైట్ పెరుగుతున్నది. ఫేస్ బుక్స్, ట్విట్టర్, బ్లాగ్స్, మొబైల్స్ ను లేట్ నైట్ వరకూ సోషియల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, గాడ్జెట్స్ ను ఎక్కువగా వాడటం వల్ల ఆలస్యంగా అయినా సరే కంటి చూపు మందగిస్తున్నాయి. కంటి సమస్యలను దూరం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. హెల్తీ ఐసైట్ పొందడానికి మీ డైలీ డైట్ లో వీటిని తప్పనిసరిగా చేర్చుకోవాలి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలను తగ్గించుకోవచ్చు .
వయస్సైన తర్వాత కంటి సమస్యలు రావడం సహజం. కానీ, ఇలా చిన్న వయస్కుల్లో మరియు మద్యవయస్సు వారిలో కంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటే మాత్రం ప్రారంభ దశలోనే తగిన జాగ్రత్తలు తీసుకుని కంటి చూపును మెరుగుపరుచుకోవడం చాలా అవసరం.

కళ్ళు మంటలు, కళ్ళలో దురద, చీకాకు , కళ్ళలో డ్రైనెస్ వంటి లక్షణాలన్నీ కళ్ళ సమస్యలకు సంబంధించిన ప్రారంభ లక్షణాలు. ఈ సమస్యలను నివారించుకోవడానికి ఐడ్రాప్స్, ఐ జెల్స్ ను అప్లై చేసుకుంటుంటాము. అయితే, వీటికంటే నేచురల్ రెమెడీస్ ను ఉపయోగించడం కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. కంటి చూపు ఆరోగ్యంగా ఉండాలంటే ఈక్రింది సూచించిన ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఉత్తమం...

కివి ఫ్రూట్స్ :
కివి ఫ్రూట్స్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటి లెవల్స్ ను పెంచుతుంది. అలాగే స్ట్రెస్ తో పోరాడుతుంది, ఐస్ట్రెయిన్ తగ్గిస్తుంది. ఐసైట్ ను మెరుగుపరుస్తుంది.

ఆరెంజెస్ :
ఆరెంజెస్ లో కూడా విటమిన్ సి ఎక్కువ, రెగ్యులర్ గా ఆరెంజెస్ తినడం వల్ల కంటి సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మంచి కంటి చూపును అందిస్తుంది.

క్యారెట్ జ్యూస్ :
క్యారెట్స్ లో విటమిన్ ఎ, కెరోటినాయిడ్ కంటెంట్ అధికంగా ఉంటుంది. హెల్తీ ఐసైట్ మెరుగుపరచడానికి ఇది బెస్ట్ జ్యూస్ .

పసుపు :
పురాతన కాలం నుండి వాడుకలో, ఆయుర్వేదంలో ఉండే ఔషధ దినుసు పసుపు, ఇందులో విటమిన్ ఎ, బి, మరియు ఇలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఇందులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి కాంటరాక్ట్స్ ను నివారిస్తుంది.

టమోటోలు:
టమోటోల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. టమోటో ఒక బెస్ట్ ఫుడ్ . ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది

ఆలివ్ ఆయిల్ :
ఆలివ్ ఆయిల్లో విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కంటి చూపును ఆరోగ్యంగా ఉంచడంలో ఆలివ్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది.

అవొకాడో :
కంటి ఆరోగ్యానికి తినాల్సిన ఫుడ్స్ లో అవొకాడో ఒకటి, అవొకాడో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి గొప్పగా సహాయపడుతుంది.

నట్స్ :
డ్రై నట్స్ లో ముఖ్యంగా బాదం, హాజల్ నట్స్, పీనట్స్, విటమిన్ ఇలు గ్రేట్ గా ఉన్నాయి. కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇది గ్రేట్ రెమెడీ. ఇవే కాకుండా కొన్ని కంటికి సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల కూడా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి .



Click it and Unblock the Notifications
