Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
పుచ్చకాయ జ్యూస్ కి, చిటికెడు పెప్పర్ కలిపి తీసుకుంటే.. సూపర్ బెన్ఫిట్స్
సమ్మర్ వచ్చేసింది.. ఇక హాట్ వెదర్ హీటెక్కిస్తుంది. మండే ఎండల్లో.. శరీరాన్ని కూల్ చేసే పండ్లు, ఫుడ్స్ తీసుకుంటే.. కాస్త చల్లగా ఉంటుంది. చల్ల చల్లని పానీయాలు తీసుకుంటే.. శరీరానికి ఉత్సాహం, ఉపశమనం కలిగిస్తుంది.
పైనాపిల్స్, మస్క్ మిలాన్స్, వాటర్ మిలాన్స్, ఆరంజ్ వంటి ఫ్రూట్స్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ జ్యూసీ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల సమ్మర్ లో అనేక హెల్త్ బెన్ఫిట్స్ పొందవచ్చు. అలాగే ఫిట్ గా, యాక్టివ్ గా ఉంచుతుంది.
సమ్మర్ లో రోజుకి రెండు గ్లాసుల వాటర్ మిలాన్ జ్యూస్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే పోషకాలు క్యాలరీలు కరిగించి.. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉదయాన్నే పరగడపున పుచ్చకాయ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపి.. బ్లాడర్ ని శుభ్రం చేస్తుంది.
ఒక కప్పు ఫ్రెష్ వాటర్ మిలాన్ జ్యూస్ కి చిటికెడు బ్లాక్ పెప్పర్, సాల్ట్ కలుపుకుని తీసుకుంటే.. క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, జింక్, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే విటమిన్ సి, విటమిన్స్ బి5, బి1, బి2, బి3, బి6 కూడా లభిస్తాయి. అంతేకాదు.. ఈ వాటర్ మిలాన్ జ్యూస్ లో కాస్త పెప్పర్ కలిపి తీసుకోవడం వల్ల పొందే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

బరువు తగ్గడానికి
బరువు తగ్గాలని ప్రయత్నించే వాళ్లకు ఇదో చక్కటి జ్యూస్. ఈ జ్యూస్ లోకి చిటికెడు పెప్పర్ కలుపుకుని తాగడం వల్ల క్యాలరీలు చాలా ఫాస్ట్ గా కరిగిపోతాయి.

కొలెస్ట్రాల్
హై కొలెస్ట్రాల్ తో బాధపడుతుంటే.. పెప్పర్, వాటర్ మిలాన్ జ్యూస్ తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెంచి, చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.

వ్యాధులకు దూరంగా
ర్యాషెస్ వంటి సమస్యలతో బాధపడుతుంటే.. వాటర్ మిలాన్ జ్యూస్ పర్ఫెక్ట్ మెడిసిన్. సమ్మర్ లో ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల దురద వంటి అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేసి, హెల్తీగా ఉంచుతుంది.

క్యాన్సర్
వాటర్ మిలాన్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అయిన లైకోపిన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ సెల్స్ ని అరికడుతుంది. కాబట్టి సమ్మర్ లో వాటర్ మిలాన్ జ్యూస్ కి పెప్పర్ కలిపి తీసుకోండి.. ప్రొస్ట్రేట్ గ్లాండ్ ని ఆరోగ్యంగా ఉంచుకోండి.

హార్ట్ ఎటాక్
వాటర్ మిలాన్ లో ఫోలేట్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది శరీరానికి చాలా మంచిది. ఫోలేట్ బ్లడ్ సర్క్యులేషన్ సజావుగా సాగడానికి సహాయపడి.. హార్ట్ ఎటాక్ రిస్క్ ని తగ్గిస్తుంది.

ఫ్లూయిడ్స్
పుచ్చకాయ చాలా పవర్ ఫుల్ ఫ్రూట్. ఇందులో ఉండే డ్యూరెటిక్ యాక్షన్ వల్ల శరీరంలో అదనంగా ఉండే ఫ్లూయిడ్స్ ని తొలగిస్తుంది. మహిళలు.. వాళ్ల రుతుక్రమ సమయంలో ఈ జ్యూస్ తాగడం చాలా అవసరం.

పొట్ట సమస్యలు
ముగ్గురిలో ఇద్దరికి కాన్స్టిపేషన్ సమస్య ఉంటుంది. కాబట్టి వాటర్ మిలాన్ జ్యూస్ లో పెప్పర్ కలుపుకుని తీసుకోవడం వల్ల.. పొట్టలోని మలినాలను తొలగిస్తుంది. అలాగే సమ్మర్ ఎక్కువ మోతాదులో నీళ్లు తీసుకోవాలి.

ఆస్తమా
పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల.. శరీరంలో టాక్సిన్స్ ఏర్పడకుండా నివారిస్తుంది. అలాగే ఆస్తమాని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications