మహిళలు తప్పనిసరిగి తెలుసుకోవల్సిన వైజినల్ ప్రాబ్లెమ్స్ ..!!

ఇక్కడ మహిళలను ఎప్పుడైనా ప్రభావితం చేసే సాధారణ యోని సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటి మీద ఒక లుక్ వేద్దామా?

By Lekhaka

నిజానికి మహిళలకు అనేక యోని సమస్యలు ఉంటాయి. స్త్రీలు తమ కుటుంబం పనులతో చాలా బిజీగా ఉంటారు. ఇంటి పనిలో పడి తమ పట్ల శ్రద్ద వహించటం కూడా మర్చిపోతారు. రోజువారీ కార్యక్రమాల బిజీ కారణంగా ఆరోగ్యంనకు ప్రాధాన్యత తగ్గిపోతుంది.

వారు నిశ్శబ్దంగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వాటిలో యోని సమస్య ప్రధానమైనది కావచ్చు. కాబట్టి యోని ఇన్ఫెక్షన్ చిహ్నాలు ఏమిటి ? యోని చుట్టూ గడ్డ ఉంటే ఏమి చేస్తారు?

కనుక ఈ రోజు ఈ వ్యాసంలో మేము మహిళలు ఎదుర్కొనే యోని సమస్యల గురించి చర్చిస్తున్నాం. ముందస్తు చర్యలు చేపట్టడానికి వీలుగా చిహ్నాలు మరియు లక్షణాలను తెలుసుకోవటం చాలా ముఖ్యం.

యోని సంబంధిత ఆరోగ్య సమస్యలు పునరుత్పత్తి వయసు మహిళల్లో చాలా సాధారణం. ఆ సమయంలో లక్షణాలు ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రమైన యోని సమస్యలకు దారితీస్తుంది. అంతేకాక వంధ్యత్వానికి కూడా కారణం కావచ్చు.

ఇక్కడ మహిళలను ఎప్పుడైనా ప్రభావితం చేసే సాధారణ యోని సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటి మీద ఒక లుక్ వేద్దామా?

1. యోని చుట్టూ గడ్డలు :

1. యోని చుట్టూ గడ్డలు :

మీరు జననాంగం మరియు యోని ప్రాంతం చుట్టూ కొన్ని గడ్డలు ఉంటే చింతించవలసిన అవసరం లేదు. ఇది సాధారణం. కానీ అడ్డుపడే గ్రంధి కాదు.దీనిని వేడి నీటి ద్వారా నయం చేయవచ్చు. అయితే విపరీతమైన నొప్పులు ఉంటాయి. ఒక వైద్యుని సంప్రదించటం అవసరం.

2. స్కిన్ క్యాన్సర్:

2. స్కిన్ క్యాన్సర్:

ఇది వింత అనిపించవచ్చు. కానీ యోని చుట్టూ చర్మంలో క్యాన్సర్ కణాలను కనుగొనవచ్చు. ఈ చర్మ వ్యాధికి యోని కూడా ప్రభావితం అవుతుంది. వెంటనే తనిఖీ చేయాల్సిన అవసరముంది.

3. ఉబ్బిన సిర :

3. ఉబ్బిన సిర :

కొంత మంది మహిళల జననాంగం చుట్టూ అనారోగ్య సిరలు అభివృద్ధి చెందుతాయి. ఇది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మరియు ఎక్కువగా నిలబడి ఉండే వారిలో కనపడుతుంది. పీరియడ్స్ సమయంలో కూడా ఇది కనపడుతుంది.

4. అడ్డుపడే జుట్టు గ్రీవము :

4. అడ్డుపడే జుట్టు గ్రీవము :

మహిళలు యోని చుట్టూ జుట్టు గ్రీవాలు అవరోధం కలిగించవచ్చు. దీని కారణంగా ఎర్రదనం మరియు మచ్చలు వస్తాయి. ఇది షేవింగ్ లేదా అసౌకర్యంగా బట్టల కారణంగా రావచ్చు. ఈ పరిస్థితికి వేడి నీటి కాపడం బాగా పనిచేస్తుంది. అయితే ఈ సమస్య దీర్ఘ కాలం ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించాలి.

5. యోని పొడిగా ఉండటం :

5. యోని పొడిగా ఉండటం :

కొంత మంది స్త్రీల యోని పొడిగా ఉంటుంది. ఈ సమస్య తరచుగా ఉంటుంది. ఇది హార్మోన్ల అసమతుల్యత, కొన్ని మందులు,ఒత్తిడి కారణంగా వస్తుంది. జీవనశైలిలో మార్పులు తెచ్చుకుంటే ఈ సమస్య నుండి సులభంగా బయట పడవచ్చు.

6. వైట్ డిశ్చార్జ్ కావటం :

6. వైట్ డిశ్చార్జ్ కావటం :

యోని లో ఒక బాక్టీరియా వృద్ధి ఉన్నప్పుడు ఫౌల్ వాసనతో వైట్ డిశ్చార్జ్ కావటం ప్రారంభం అవుతుంది. ఇది శరీరంలో pH స్థాయి అసమతుల్యత ఉన్నప్పుడు కలుగుతుంది. ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.

7. పీరియడ్స్ కానీ సమయంలో బ్లడ్ డిశ్చార్జ్ :

7. పీరియడ్స్ కానీ సమయంలో బ్లడ్ డిశ్చార్జ్ :

పీరియడ్స్ కానీ సమయంలో బ్లడ్ డిశ్చార్జ్ ని గమనిస్తే జాగ్రత్తగా ఉండాలి. ఓవెలేషన్ ఉన్నప్పుడు కొంత మంది మహిళలకు ఇది సాధారణమే. కానీ ఇది సంభోగం తర్వాత ఉంటే కనుక ఇన్ఫెక్షన్ అని అర్ధం చేసుకోవాలి. అలాగే గర్భాశయ క్యాన్సర్ లక్షణం కూడా కావచ్చు. కాబట్టి వెంటనే తనిఖీ చేయాలి.

8. యోని చుట్టూ ఏర్పడిన పుండ్లు :

8. యోని చుట్టూ ఏర్పడిన పుండ్లు :

మీరు మీ యోని ప్రాంతం చుట్టూ బొబ్బలు ఉన్నాయని భావిస్తే, అప్పుడు దానిని తీవ్రంగా పరిగణించాలి. వైరస్ వలన HPV నివసించటం వలన కలుగుతుంది.

9. యోని దురద :

9. యోని దురద :

ఫంగల్ మరియు ఈస్ట్ ఇన్ఫెక్షన్ల కారణంగా యోని దురద ఏర్పడుతుంది. యాంటీబయాటిక్స్ వాడకం కారణముగా శరీరంలో pH సంతులనంనకు ఆటంకం ఏర్పడినప్పుడు వస్తుంది. మధుమేహం మరియు తడిగా ఉన్న లోదుస్తులు వేసుకున్నప్పుడు యోని దురద కలుగుతుంది.

10. యోని నొప్పి :

10. యోని నొప్పి :

తీవ్రమైన యోని నొప్పి, ముఖ్యంగా సంభోగం సమయంలో ప్రమాదకరముగా ఉంటుంది.ఇది ఎండోమెట్రియోసిస్ ఇన్ ఫెక్షన్ కి ఒక సంకేతం కావచ్చు.

ఈ నొప్పి దీర్ఘ కాలం కొనసాగితే, మరింత ఆలస్యం చేయకుండా వెంటనే తనిఖీ మరియు చికిత్స అవసరం.

Story first published: Friday, December 16, 2016, 21:00 [IST]
Desktop Bottom Promotion