Latest Updates
-
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన!
అరచేతిలో ప్రెజర్ పాయింట్స్ చెప్పె ఆరోగ్య రహస్యాలు...
ఎటువంటి మందుల్లేకుండా నిర్వహించే వైద్యవిధానాలు ఇటీవల కాలంలో మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. ఇటువంటి వాటిలో ఆక్యుప్రెషర్, రేకీలు నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ప్రత్యామ్నాయ వైద్యము లో రిఫ్లెక్సాలజీ అనేది ఒక ప్రాచీన రూపము . ఆక్యుప్రజర్ , ఆయుర్వేదిక్ మసాజ్ ల మాదిరిగా పోలిఉండే రిప్లెక్షాలజీ ని కొందరు పిలిచే ఆక్యుప్రెషర్ చికిత్స.. క్రీ.పూ. 5000 సంవత్సరాల కాలంలో మన దేశంలోనే ప్రారంభం కావడం విశేషం. ఆ కాలంలో రుషులు, మహామునులు ఈ వైద్యం ద్వారా రోగాలను నయం చేసినట్టు చారిత్రక ఆధారాలు కూడా ఉండడం విశేషం.
అరిచేతులు, అరికాళ్లలో శరీరంలోని వివిధ అవయవాలకు సంబంధించినటువంటి పాయింట్స్ ఉంటాయి. వీటిని యాక్టివేట్ చేయడం ద్వారారిప్లెక్షాలజీ లో చికిత్సలను నిర్వహిస్తారు. నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పులకు సంబంధించిన సమస్యలు ఈ వైద్యంతో పూర్తిగా నయమవుతాయని ఆక్యుప్రెషర్ /రిప్లెక్షాలజీ థెరపిస్ట్‌లు తెలుపుతున్నారు.
ఆక్యుప్రెషర్/రిప్లెక్షాలజీ ద్వారా గుండెజబ్బులు, ఆస్తమా, కిడ్నీ దెబ్బతినడం వంటి వ్యాధులకు చికిత్సలతో పాటు ఆడవారికి సంబంధించిన గైనిక్ సమస్యలను సైతం నయం చేయవచ్చు. నేడు ఈ వైద్య విధానం చైనా, జపాన్, థాయిలాండ్ తదితర దేశాల్లో విశేష ప్రాచర్యాన్ని పొందింది. మన శరీరంలోని ప్రతి అవయవమూ కండరాలు, నాడీ వ్యవస్థలతో పనిచేస్తుందనే సంగతి విదితమే. ఒక్కో శరీర భాగానికి సంబంధించి ఒక్కోచోట నాడులు మన చేతిలో కేంద్రీకృతమై వుంటాయి. వాటిపై ఒత్తిడి కలిగించినట్లయితే ఆయా భాగాల్లో ఏర్పడిన లోపాలు సవరించబడి సక్రమంగా పనిచేస్తాయి.
ఇదొకరకమైన మసాజ్ లాంటిది. పాదాలు, చేతులు లాంటి శరీర భాగాలను.. మర్దనతో పాటు ఆక్యుపంచర్‌ను జతకలుపుతారు. వేళ్ళతో నొక్కడంవల్ల రక్తప్రసరణ, నాడీ వ్యవస్థలను పునరుద్ధరిస్తారు. లేనిపక్షంలో శరీరంలోని కొన్ని కొన్ని ప్రాంతాల్లో కణాలు గూడుకట్టుకునికణుపుల్లా తయారౌతాయి. రిఫ్లెక్సాలజీ ప్రక్రియ ద్వారా అలాంటి భాగాలను బాగా మర్దన చేసి తొలగించగల్గుతారు. దాంతో మెదడులోని కండరాలు శక్తివంతంగా పనిచేస్తాయి.
చేతిలోని ప్రెజర్ పాయింట్స్ సహాయంతో ఒత్తిడి ప్రేరేపించినట్లవు తుంది. మొద్దబారిన భాగాలు తిరిగి చురుగ్గా పనిచేస్తాయి. చేతిలో మరియు వేళ్ళ వద్ద కొన్ని పాయింట్స్ లో సున్నితమైన మసాజ్ లేదా ప్రెజర్ కలిగించడం వల్ల శరీరంలో ఇతర బాగాల్లో కూడా నొప్పి తగ్గుతుంది. ప్రెజర్ పాయింట్స్ ఒత్తేటప్పుడు కనీసం 3 నుండి 5సెకండ్ల పాటు వేళ్ళతో నొక్కిపట్టించి ఉంచి, డీప్ గా, నిధానంగా బ్రీథింగ్ తీసుకుని వదలాలి . ఇలా చేయడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యల నుండి దూరమవ్వొచ్చు . మరి చేతిలో ఎటువంటి ప్రదేశంలో ప్రెజర్ కలిగిస్తే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చో తెలుసుకుందాం..

బొటన వేలు:
బొటవెలుకు వెన్నెముక మరియు పొట్టకు సంబంధించిన నాడులు అనుసందానించబడి ఉంటాయి. పొట్టకు, వెన్నెముకకు సంబంధించిన ప్రెజర్ పాయింట్ బొటన వేలు కాబట్టి, ఈ ప్రదేశంలో ఒత్తి పట్టడం వల్ల డిప్రెషన్, మరియు ఆందోళన వంటివి తగ్గించుకోవచ్చు. ఎమోషనల్ గా ఫీలవుతూ, పొట్టనొప్పికి, తలనొప్పికి లేదా చర్మం సమస్యలకు గురైనప్పుడు బొటవేళుకు తగిన ప్రెజర్ ను అందిస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

ఇండెక్స్ ఫింగర్:
బ్లాడర్ మరియు కిడ్నీ సమస్యలున్నప్పుడు ఈ ఇండెక్స్ ఫింగర్ మీద ప్రెజర్ ను ఇవ్వడం వల్ల ఈ అవయవాల సంబంధించిన సమస్యలు నివారించబడుతాయి . మరియు ఇండెక్స్ ఫింగర్ పాయింట్ లోప్రెజర్ కలిగించడం వల్ల డిస్ అప్పాయింట్, ఫియర్ మరియు కన్ఫ్యూజన్ తగ్గుతుంది.

మిడిల్ ఫింగర్ :
గాల్ బ్లాడర్ మరియు లివర్ ను సరిగా పనిచేయడాన్ని క్రమబద్దం చేస్తుంది. గాల్ బ్లాడర్ మరియు లివర్ సమస్యలను నివారించడంలో మిడిల్ ఫింగర్ పాయింట్ లో ప్రెజర్ ను కలిగిస్తే సమస్యలు నివారించబడుతాయి. అలాగే మూడు బాగోలేకున్నా, మిడిల్ ఫింగర్ ను ప్రెస్ చేయడం వల్ల మూడ్ మెరగవుతుంది. మరియు కంటి చూపు, బ్లడ్ సర్కులేషన్ మెరుగుపడుతుంది, మెనుష్ట్యులవల్ పెయిన్ మరియు మైగ్రేన్ తలనొప్పి తగ్గిస్తుంది.

రింగ్ ఫింగర్ :
రింగ్ ఫింగర్ కు ప్రెజర్ పాయింట్ కలిగించడం వల్ల కోలన్ మరియు లంగ్ (ఊపిరితిత్తుల)అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇది మనషిలో0 ఎమోషన్స్, నెగటివిటి, భయాన్ని తగ్గిస్తుంది . ఎవరికైతే జీర్ణ సమస్యలు, స్కిన్ సమస్యలు, రెస్పిరేటరీ సమస్యలుంటాయో వారిలో ఈ రింగ్ ఫింగర్ పాయింట్ లో ప్రెజర్ చేయడం వల్ల సమస్యలు తగ్గుతాయి.

పింకి ఫింగర్ :
ఈ పాయింట్ హార్ట్ మరియు చిన్న ప్రేగుల సమస్యలను నివారించడంలో, పనులను క్రమబద్దం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. భయాందోళనలను నివారిస్తుంది. నెర్వస్ ఫీలింగ్, అభద్రతాభావాన్ని తొలగిస్తుంది. ఈ ప్రదేశంలో ప్రెస్ చేయడం వల్ల బోన్స్, హార్ట్, గొంతునొప్పి, బ్లోటింగ్ సమస్యలను నివారిస్తుంది.

బొటన వేలు క్రింది బాగంలో :
బొటన వేలు క్రింది బాగంలో ప్రెస్ చేయడం వల్ల దగ్గ, శ్వాససంబంధిత సమస్యలు తగ్గిస్తుంది. మరియు ఈ పాయింట్ లోడీఫ్ ప్రెస్ చేయడం వల్ల థైరాయిడ్ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవుతుంది.

అరచేతిలో :
అరచేతి పాయింట్ లో ఫింగర్స్ తో ప్రెస్ చేయడం వల్ల ఆబ్డామినల్ (పొట్టఉదరంలో) నొప్పి లేదా జీర్ణ సమస్యలను నివారిస్తుంది.

చేతి ఫ్లష్ పార్ట్ :
చేతిలోని ఫ్లష్ పార్ట్ లో ప్రెజర్ పాయింట్ లో ప్రెజెర్ ఇవ్వడం వల్ల హార్ట్ మరియు ఎండోక్రైన్ సమస్యలను నివారిస్తుంది. ఈ పాయింట్స్ లో ప్రెజర్ ఇవ్వడం వల్ల హార్ట్ సమస్యలను క్రమబద్దం చేస్తుంది మరియు హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది.

పాల్మ్ ఎక్స్ టీరియర్ :
ఈ బాగంలో ప్రెజెర్ కల్పిస్తే అపెండిక్సి సమస్య తగ్గుతుంది . మరియు బాడీలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతుంది.



Click it and Unblock the Notifications











