రెగ్యులర్ గా గార్లిక్ తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు

వెల్లుల్లి, మన ఇండియన్ మసాలా దినుసుల్లో అత్యంత ముఖ్యమైనది. మన ఇండియన్ వంటకాల్లో దీన్ని తప్పనిసరిగా వాడుతుంటారు. ప్రతి ఒక్కరికీ తెలిసినటువంటి మసాలా దినుసు వెల్లుల్లి . ఇది వంటలు మంచి ఫ్లేవర్ ను అందిస్తుంది . అంతే కాదు, ఇందులో అనేక ఔషధగుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లి ఐయోడిన్, సల్ఫర్, క్యాల్షియం, మరియు ఐరన్ కంటెంట్ అధికంగా ఉన్నాయి.

వెల్లుల్లిలో ఉండే వివిధ రకాల పదార్థాల వల్ల అనేక అనారోగ్య సమస్యలను చాలా ఎఫెక్టివ్ గా చికిత్సనందిస్తుంది. ముఖ్యంగా గార్లిక్ లో ఉండే సల్ఫర్ ఇన్ఫెక్షన్స్ తో మరియు ఇతర చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో పోరాడే గుణాలను కలిగి ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది . అంతే కాదు ఒక ఘాటైన వాసన కలిగి ఉంటుంది.

వెల్లుల్లిని పరగడుపుతోనే ఎందుకు తినాలి? ఆరోగ్య రహస్యాలేంటి...

వెల్లుల్లిలో ఉండే అనేక ఔషధగుణాల వల్ల బ్యాక్టీరియా మరియు వైరల్ ఇన్ఫెక్షన్స్ ను దూరంగా ఉంచుతుంది . వెల్లుల్లిలో అల్లిసిన్ అనే కంటెంట్ ఉండటం వల్ల వెల్లుల్లి అంత ఘాటైన వాసన కలిగి ఉంటుంది. వెల్లుల్లిని మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. డయాబెటిస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది, శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. చెవి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. జలుబు మరియు ప్రేగు సమస్యలను నివారిస్తుంది.

అదే విధంగా ితర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది . కాబట్టి, వెల్లుల్లిని మీరు రెగ్యులర్ డైట్ లో ఎందుకు చేర్చుకోవాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి వెల్లుల్లిని రెగ్యులర్ వంటకాల్లో చేర్చడం వల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

ఆస్తమా:

ఆస్తమా:

వెల్లుల్లి రెబ్బలు ఆస్తమాను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ప్రతి రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను తింటుంటే ఆస్తమా రాదు. వెల్లుల్లిలో ఉండే విటమిన్ సి ఫ్రీరాడికల్స్ ను తగ్గిస్తుంది. మరియు వెల్లుల్లిలోని ఘాటు శ్వాసనాళాన్ని ఫ్రీగా మార్చుతుంది. మరియు శరీరంలో హిస్టమైన్ ఉత్పత్తి కాకుండా నివారిస్తుంది.

బోన్ హెల్త్ మెరుగుపరుస్తుంది:

బోన్ హెల్త్ మెరుగుపరుస్తుంది:

గార్లిక్ ను రెగ్యులర్ గా తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. మరియు మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ లెవల్స్ పెరుగుతాయి . రీసెంట్ రీసెర్చ్ ప్రకారం వయస్సు పెరిగేకొద్ది శరీరంలో వచ్చే గౌట్ పెయిన్, బోన్ డెన్సిటిని, ఆథెరోస్కెలరోసిస్ ను నివారిస్తుంది.

హార్ట్ హెల్త్:

హార్ట్ హెల్త్:

గుండె పోటుట మరియు ఎథెరోస్ట్కెరోటిస్ వంటి గుండె సంబంధిత సమస్యలను వ్యతిరేకంగా వెల్లుల్లి పోరాడి, గుండెను రక్షిస్తుంది. ఈ కార్డియో ప్రొటక్టివ్ లక్షణాలు వివిధ అంశాలను మీద ఆపాదించబడేలా చేస్తుంది. ఉదా: వయస్సుతోపాటు శరీరంలోని థమనులు వ్యాకోచించబడి వాటి సామర్థ్యాన్ని కోల్పోవడం జరగుతుంది. వెల్లుల్లి ఈ సమస్యను తగ్గించడానికి, గుండెను ఫ్రీఆక్సిజన్ రాడికల్స్ నుండి డ్యామేజ్ కాకుండా కాపాడటానికి సహాపడుతుంది. వెల్లుల్లిలోని సల్ఫర్ తో నిండిన సమ్మేళనాలు కూడా రక్తం రక్తనాళాల్లోని రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడానికి మరియు ఎథెరోస్ట్కేరోసిస్ (ధమనులు గట్టిపడేలా)అభివృద్ధిని తగ్గిస్తుంది.

బరువును తగ్గిస్తుంది

బరువును తగ్గిస్తుంది

: అనేక పరిశోధకులు స్థూలకాయం దీర్ఘకాల తక్కువ స్థాయిలో వచ్చే ఇన్ఫ్లమేషన్ అని నమ్ముతారు . ఇటీవలి పరిశోధన ప్రకారం, వెల్లుల్లి మన శరీరంలోని కొవ్వు కణాలు ఏర్పడటం నియంత్రించేందుకు సహాయపడుతుందని కనుగొన్నారు. ఇన్ఫ్లమేటరీ సిస్టమ్ యాక్టివిటీ ద్వారా ప్రి అడిపోసైట్స్ , ఫ్యాట్ సెల్స్ గా మార్చబడతాయి .ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు 1, 2డిటి(1,2vinyldithiin)ఈ మార్పిడి నిరోధించడానికి సహాయపడవచ్చు. దాంతో బరువు పెరుగుట నిరోధించడానికి సహాయపడుతుంది.

జలుబు మరియు గొంతు నొప్పి:

జలుబు మరియు గొంతు నొప్పి:

రెగ్యులర్ గా గార్లిక్ తినడం వల్ల జలుబు మరియు ఇతర సమస్యలను కూడా నివారిస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది . మరియు ఇది రెస్పరేటరీ ట్రాక్ డిసీజ్ లను నివారిస్తుంది. మరియు క్రోనిక్ బ్రొకైటిస్ సమస్యలను అరికడతుంది.

అలర్జీలు:

అలర్జీలు:

గార్లిక్ లో యాంటీఇన్ఫ్లమేటర్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ లక్షణాలు వివిధ రకాల అలర్జీల బారీన పడకుండా మన శరీరాన్ని రక్షిస్తుంది. కీళ్ళవాపు నివారణా లక్షణాలున్నా వెల్ల్లుల్లిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది. వెల్లుల్లి అలర్జీ ఎయిర్వే మంట(అలెర్జిక్ రినిటిస్)మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. పచ్చివెల్లుల్లి రసం వెంటనే దద్దుర్లు మరియు కీటక కాటు వలన ఏర్పడిన దురదను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

 కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి:

కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి:

వెల్లుల్లి మన శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తుంది మరియు మొత్తం కొలెస్ట్రాల్ మరియు థమని ఫలకం ఏర్పడటం తగ్గించేందుకు సహాయపడుతుంది.

వ్యాధినిరోధక శక్తిని పెంపొదిస్తుంది:

వ్యాధినిరోధక శక్తిని పెంపొదిస్తుంది:

గ్రీన్ గార్లిక్ వల్ల ఇది ఒక అతి పెద్ద హెల్త్ బెనిఫిట్. ఇందులో అల్లిసిన్, సల్ఫర్ అధికంగా ఉండటం వల్లే వీటికి అంత ఘూటైన వాసన వస్తుంది . ఈ సల్ఫర్ గుణాలే మన శరీరానికి ఎటువంటి వ్యాధి సోకకుండా, ఇన్ఫెక్షన్లు సోకకుండా...వ్యాధినిరోధకతను పెంపొందిస్తుంది.

రక్తహీనత/ఐరన్ పుష్కలం:

రక్తహీనత/ఐరన్ పుష్కలం:

ఎవరికైతే బ్లడ్ కౌంట్ తక్కువగా ఉండి, రక్తహీనతతో బాధపడుతుంటారో వారి ఈ గ్రీన్ గార్లిక్ ను తినడం వల్ల ఐరన్ పుష్కలంగా ఉంటుంది . ఇంకా ఇందులో ప్రోటీనులు, ఫెర్రోప్రోటీనులు ఉండి ఐరన్ నిల్వ ఉండటానికి సహాయపడుతుంది. దాంతో శరీరంలో బ్లడ్ పెరగడానికి మరియు ఐరన్ లెవల్స్ పెంచడానికి గ్రీన్ గార్లిక్ బాగా సహాపడుతాయి.

కోరికలను పెంపొదిస్తుంది:

కోరికలను పెంపొదిస్తుంది:

వెల్లుల్లిలో అప్రోడిసియక్ లక్షణాలు సామర్థ్యంను మరియు ప్రసరణను పెంచుతుంది. వెల్లుల్లి మీద చేసిన అనేక అద్యయనాల వల్ల ఇందులో శృంగారాన్నిపెంపొందించి వీర్యవృద్ధిని కలిగిస్తుందని వెల్లడయింది. అంతే కాక శృంగారం పట్ల ఆసక్తిని పెంచేగుణం కూడా ఇందులో ఉందని ఈ అద్యయనాల వల్ల పరిశోధకులు వివరించడం జరిగింది.

Desktop Bottom Promotion