Latest Updates
-
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే
ఫ్యాటీ లివర్ సమస్యను నివారించే హెల్తీ డ్రింక్
ప్రస్తుత కాలంలో కాలుష్యం ఎక్కువగా పెరిగిపోతున్నది . వాతావరణ కాలుష్యం వల్ల పరిస్థితులు మరింత ప్రమాధకరంగా మారుతున్నాయి. స్ట్రెస్ లైఫ్ ను గడపాల్సి వస్తోంది. మొత్తం ఆరోగ్యంలో లివర్ మీద ఎక్కువ ప్రభావం చూపుతోంది.
లివర్ శరీరానికి ఒక ఇంజెన్ వంటిది, లివర్ సరిగా పనిచేయలేదంటే , శరీరంలో టాక్సిన్స్ బయటకు పంపలేదు , అయితే కాలేయం దానంతది నేచురల్ పద్దతిలో పనిచేయడం ప్రారంభిస్తే క్రమంగా శరీరంలోని టాక్సిన్స్ అన్నీ బయటకు నెట్టవేయబడుతాయి.
మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారా పానియాలు లివర్ ప్రొసెస్ చేస్తుంది .ప్రొసెస్ చేయగా ఆరోగ్యానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్ , విటమిన్స్ ను గ్రహించి , మలిగిన వ్యర్థాలను బయటకు పంపుతుంది.

కొన్ని సందర్భాల్లో తిన్న ఆహారం జీర్ణం కాకుండా , టాక్సిన్స్ గా లోపల నిల్వచేరుతుంది. అది ఫ్యాటీ లివర్ గా మార్పు చెందుతుంది. ఫ్యాటీ లివర్ ను నివారించడానికి ఒక సులభమైన హోం రెమెడీ ఉంది. ఇది లివర్ ను శుభ్రం చేస్తుంది మరియు కాలేయ సమస్యలను నివారిస్తుంది . మరి ఆ ప్రభావిత హోం రెమెడీ ఎంటో తెలుసుకుందాం..

నిమ్మకాయలు: 2
క్యాబేజ్: 100గ్రాములు
సెలరీ: 30గ్రాములు
పియర్స్: 200grm
నీళ్ళు: 500ml
అల్లం: చిన్న ముక్క
పుదీనా: 20grm

అల్లం, సెలరీ, క్యాబేజ్, మరియు పియర్స్ శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. వీటి నుండి రసాన్ని తీయ్యాలి. వీటిని బ్లెండర్ లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. దీనికి నిమ్మరసం, వాటర్ , పుదీనా మిక్స్ చేయాలి. ఈ డ్రింక్ ను ప్రతి రోజూ ఉదయం మరియు సాయంత్రం ఒక్కొక్క సారి తాగాలి.

ఈ డ్రింక్ రోజూ రెండు సార్లు తాగడం వల్ల లివర్ కు సంబంధించిన ఎలాంటి సమస్యైన చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . అలాగే దూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఈ డిటాక్స్ డ్రింక్ ను సెలవు రోజున తీసుకోవడం వల్ల కొద్దిగా విశ్రాంతి తీసుకోవడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

లివర్ సరిగా పనిచేయాలంటే ఒత్తిడి తగ్గించుకుని, విశ్రాంతి తీసుకోవాలి, నేచురల్ పదార్థాలతో మిక్స్ చేసిన ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
