Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
బెల్లంతో లివర్‌లోని విషపదార్థాలు ఔట్..!
పండగైనా, పెళ్లి అయినా, ఫంక్షనైనా, ఎలాంటి సెలబ్రేషనైనా ముందు ఇంపార్టెన్స్ ఇచ్చేది స్వీట్స్‌కి. తీపి పదార్థం లేకుండా.. ఏ శుభకార్యమూ జరగదంటూ అతిశయోక్తికాదు. కానీ చాలా మంది స్వీట్స్ అంటే లావు అయిపోతారని, డయాబెటిస్ ముప్పు అని దూరంగా ఉంటారు. కానీ.. చక్కెరతో ప్రమాదం పొంచి ఉంది కానీ.. బెల్లం తీసుకుంటే.. టేస్ట్‌తో పాటు.. ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

మన పూర్వీకులు ఎక్కువగా బెల్లమే ఉపయోగించేవాళ్లు. కానీ ఇటీవల అన్నీ స్వీట్స్ ఎక్కువగా చక్కెరతో తయారు చేస్తున్నారు. కానీ బెల్లం వాడితేనే ఎక్కువ ప్రయోజనాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ప్రతిసారి స్వీట్స్ తినే ఇష్టం లేనప్పుడు మధ్యహ్నం, రాత్రిపూట భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తించే జీర్ణశక్తి పెరగడమే కాదు.. మలబద్దకం సమస్యా తగ్గుతుంది.
శ్వాస సంబంధిత సమస్యలకు కూడా బెల్లం చెక్ పెడుతుందని తెలుసా. చాలా మంది జలుబు, దగ్గు ఉందంటే.. స్వీట్స్ తింటే ఎక్కువవుతుందని భావిస్తారు కానీ.. అది అపోహ మాత్రమే. బెల్లం తినడం వల్ల జలుబు, దగ్గు, గ్యాస్, తలనొప్పి నుంచి త్వరిత ఉపశమనం పొందవచ్చు. గోరువెచ్చని నీటిలో కొంచెం బెల్లం కలిపి టీలో చక్కెరకు బదులు బెల్లం కలిపి తీసుకుంటే మంచిది.

శరీరంలో పేరుకున్న మలినాలను బయటకు పంపి లివర్ ను శుద్ధి చేసే అద్భుతమైన గుణం బెల్లంలో ఉంది. అలాగే రక్తాన్ని కూడా శుద్ధి చేసే గుణాలు ఇందులో ఉంటాయి. అలాగే బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి.. మహిళలు తరచుగా బెల్లం తీసుకోవడం వల్ల రక్తహీనత నివారించవచ్చు. ఇన్ని సద్గుణాలున్న బెల్లంను రెగ్యులర్ డైట్ లో కాస్త చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
