Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
రోజూ అండర్‌వేర్‌ను మార్చకపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా..?
ఎవరు ఎలాంటి దుస్తులు ధరించినా ప్రతి ఒక్కరు కామన్‌గా వేసుకునేది మాత్రం ఒకటుంటుంది. అదే అండర్ వేర్. అంటే కొంత మంది దీన్ని వాడరు లెండి. అది వేరే విషయం. అలాంటి వారి సంగతి పక్కన పెడితే ....
ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంతో పాటు, హైజీనిక్ రూల్స్ ను తప్పనిసరిగా పాటించాలి. ఇల్లు మాత్రమే కాదు, ఒళ్ళు కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఆరోగ్యం విషయంలో మంచి ఆహారం తీసుకోవడం, రోజూ స్నానం చేయడం, ఉతికన బట్టలు వేసుకోవడం వంటి విషయాలల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటారు.

ఎవరు ఎలాంటి దుస్తులు ధరించినా ప్రతి ఒక్కరు కామన్‌గా వేసుకునేది మాత్రం ఒకటుంటుంది. అదే అండర్ వేర్. అంటే కొంత మంది దీన్ని వాడరు లెండి. అది వేరే విషయం. అలాంటి వారి సంగతి పక్కన పెడితే అండర్‌వేర్ వేసుకునే వారు మాత్రం నిత్యం దాన్ని మార్చాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
శుభ్రంగాలేని అండర్ వేర్ ధరించకపోవడం, లేదా పరిశుభ్రతను పాటించకపోవడం వల్ల ప్రైవేట్ పార్ట్స్ కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదని సూచిస్తున్నారు. ఒక రోజు వేసుకున్న అండర్‌వేర్‌ను మరొక రోజు ధరించకూడదు. కచ్చితంగా మార్చాలి. లేదంటే జననావయవాల దగ్గర ఉండే బాక్టీరియా శరీరంలోని ఇతర ప్రదేశాలకు వ్యాప్తి చెందుతుంది. దీంతో వేరే అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. రోజూ అండర్ వేర్ మార్చుకోకపోతే ఎలాంటి హెల్త్ ప్రాబ్లెమ్స్ ఎదుర్కుంటారో ఈ క్రింది విధంగా సూచించడం జరిగింది.

స్కిన్ ఇరిటేషన్ దురద:
రోజూ అండర్‌వేర్‌ను మార్చకపోతే చర్మం ఇర్రిటేషన్‌కు గురవుతుంది. దీంతో చర్మ సంబంధ సమస్యలు వస్తాయి. ప్రధానంగా చర్మానికి అల్సర్ సోకే అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియా ఫంగస్ కారణంగా చర్మం ఎక్కువ దురద పెడుతుంది. అండర్ వేర్స్ రెగ్యులర్ గా వాష్ చేయకపోవడం వల్ల పరిస్థితి మరింత ఎక్కువ అవుతుంది.

స్కిన్ రాషెస్ వస్తాయి:
శారీరక శ్రమ, వ్యాయామం ఎక్కువగా చేసే వారు ఆ పని చేశాక కచ్చితంగా అండర్ వేర్‌ను మార్చుకోవాలి. లేదంటే చెమట కారణంగా చర్మంపై రాషెస్ వస్తాయి. అంతేకాకుండా అక్కడ బాక్టీరియా కూడా ఎక్కువగా చేరుతుంది.

ఫంగస్ ఏర్పడుతుంది :
అండర్ వేర్లు సరిగా ఉతికి, ఎండలో ఆరబెట్టకపోతే ఫంగస్ వ్రుద్ది చెదుంతుంది. దాంతో జననాంగాల్లో మరింత అసౌకర్యానికి దారితీస్తుంది.

దుర్వాసన :
అండర్‌వేర్‌ను నిత్యం మార్చకపోతే స్నానం చేసినా పెద్ద ఫలితం ఉండదు. ఎందుకంటే బాక్టీరియా అలాగే ఉంటుంది. దీనికి తోడు ప్రైవేట్ పార్ట్స్ వద్ద దుర్వాసన వస్తుంది.

బ్యాక్టీరియా కారణంగా ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ :
కేవలం ప్యూర్ 100 శాతం కాటన్‌తో తయారు చేసిన అండర్‌వేర్‌లను మాత్రమే ఉపయోగించాలి. నైలాన్ వంటి పదార్థంతో చేసినవి వాడితే స్కిన్ ఇన్‌ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్:
నిత్యం అండర్‌వేర్‌ను మార్చకపోతే బాక్టీరియా పెరిగిపోతుందని చెప్పాం కదా. ఆ. అదే బాక్టీరియా యూరిన్ ఇన్‌ఫెక్షన్లను కూడా కలిగిస్తుందట. ఈ క్రమంలో మూత్రం పోసేటప్పుడు మంట, నొప్పి కలుగుతాయట. కాబట్టి రోజూ అండర్‌వేర్‌ను మార్చాల్సిందే.

ఒకటే అండర్‌వేర్‌ను రోజూ వేసుకుంటే
ఒకటే అండర్‌వేర్‌ను రోజూ వేసుకుంటే చర్మంపై దద్దుర్లు వచ్చి దురద పెడుతుంది. చర్మ వ్యాధులు సోకుతాయి. ఒక్కో సారి చర్మం వాపుకు కూడా గురవుతుంది.

అండర్‌వేర్‌ను నిత్యం మార్చకపోతే
అండర్‌వేర్‌ను నిత్యం మార్చకపోతే ఈస్ట్ ఇన్‌ఫెక్షన్ల బారిన పడతారు. ఇది చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. కాబట్టి నిత్యం పరిశుభ్రమైన అండర్‌వేర్‌ను వేసుకోవాలి. ఒక రోజు వేసుకున్న అండర్‌వేర్‌ను రెండో రోజు వాడకూడదు.



Click it and Unblock the Notifications











