Latest Updates
-
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ హై ప్రొటీన్ జొన్న గుగ్గిళ్లు తినాల్సిందే..ఈజీగా చేసుకోండిలా.. -
స్మోకింగ్ చేసినా కొందరికి క్యాన్సర్ ఎందుకు రాదు? సీక్రెట్ ఇదే! -
వీకెండ్ అయినా, గెస్ట్స్ వచ్చినా..ఎగ్ పులావ్ ఇలా చేస్తే కిచెన్ లోనే ఉండిపోతారు! -
ఆగస్టు నెల రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి తిరుగులేని విజయం..మీ రాశి ఉందో లేదో చూసుకోండి! -
ఎందుకు నాన్నలకు కూతుళ్లంటే అంత ప్రాణం? -
రీసెర్చ్ ప్రకారం ఒక పురుషుడు ఎంతసేపు శృంగారం చేయగలడు? శీఘ్రస్కలనం గురించి ముఖ్య నిజాలు.. -
ఇంట్లో ఈ ఒక్కటి వాడకపోతే ఇన్ని తిప్పలా.. అరికాళ్ల నొప్పులకి ప్రధాన కారణమిదే.! -
ఆ భయంతో భార్యను దూరం పెడుతున్నారా.. పురుషులను ఇబ్బందికి గురిచేసే శృంగార సందేహాలివే.! -
చపాతీ, అన్నంలోకి అదిరిపోయే రుచితో పెరుగు బెండకాయ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షం పడేటప్పుడు వేడివేడిగా హెల్తీగా తినాలంటే.. ఐదే నిమిషాల్లో లెమన్ గార్లిక్ సోయా చంక్స్ రెడీ.!
ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన హార్ట్ ఎటాక్, స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు..!!
హార్ట్ ఎటాక్, స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్ అనేవి ప్రస్తుతం కామన్ గా వస్తున్న సమస్యలు. ఇవన్నీ హఠాత్తుగా వచ్చి.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ప్రమాదంగా మారుతున్నాయి. అయితే ఈ మూడింటినీ.. ఒకటే అని చాలామంది భావిస్తారు. కానీ.. ఇది వాస్తవం కాదు.
ఈ సమస్యలన్నీ.. హార్ట్ కి సంబంధించిన సమస్యలే అయినప్పటికీ.. ఇవి వచ్చేది మాత్రం వేర్వేరు కారణాల వల్ల. ఈ మూడింటికీ.. వేర్వేరు లక్షణాలు, ప్రభావాలు శరీరంలో కనిపిస్తాయి. కాబట్టి.. ఏ సమస్య వచ్చినా.. స్ట్రోక్ అని, హార్ట్ ఎటాక్ అని భావించి భయపడకుండా.. అసలు కారణాలు, లక్షణాలు, ఏ సమస్య అనేది గుర్తించడం చాలా అవసరం.
హార్ట్ ఎటాక్, స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్.. వినడానికి అన్నీ ఒకేలా, అన్ని సమస్యలు.. ఒకే అవయవానికి వస్తాయి కాబట్టి.. తేలికగా తీసుకోకుండా.. ప్రతి ఒక్కరూ.. ఈ మూడింటి మధ్య వ్యత్యాసం, వేర్వేరుగా కనిపించే లక్షణాలు, ప్రభావాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే సమస్యను బట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం.

హార్ట్ ఎటాక్ - సర్క్యులేషన్ డిజార్డర్
ఆక్సిజన్ ఎక్కువగా ఉండే.. బ్లడ్ ఫ్లో బ్లాక్ అవడం, గుండెకి సంబంధించిన కండరానికి బ్లడ్ అందకపోవడం వల్ల ఆ కండరం చనిపోతుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్ వస్తుంది. ఇలా హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు.. ఆ వ్యక్తి గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది.

కార్డియాక్ అరెస్ట్ - ఎలెక్ట్రికల్ డిజార్డర్
హార్ట్ లో ఊహకందని, గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పుడు.. గుండె సరైన పద్ధతిలో కొట్టుకోదు. బ్లడ్ పంపింగ్ పద్ధతిలో కూడా తేడా వచ్చేస్తుంది. దీనివల్ల శరీరం అంతటికీ బ్లడ్ పంపింగ్ నిలిచిపోతుంది. ఇలాంటి పరిస్థితిని కార్డియాక్ అరెస్ట్ అంటారు. కార్డియాక్ అరెస్ట్ కలిగినప్పుడు.. హార్ట్ బీట్ ఆగిపోతుంది.

స్ట్రోక్ - బ్రెయిన్ డిజార్డర్
చాలా ఎక్కువగా వచ్చే స్ట్రోక్ సమస్యలో 3 రకాలున్నాయి.

ఇస్కీమిక్ స్ట్రోక్
ధమనులు బ్లాక్ అయినప్పుడు, ఆక్సిజన్ ని కలిగిన బ్లడ్ ని బ్రెయిన్ పంపడంలో ఫెయిల్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో వచ్చే స్ట్రోక్ ని ఇస్కీమిక్ స్ట్రోక్ అని పిలుస్తారు.

ట్రాన్సియంట్ ఇస్కీమిక్ ఎటాక్
దీన్ని మినీ స్ట్రోక్ అని పిలుస్తారు. బ్రెయిన్ సరఫరా చేయాలన్సిన బ్లడ్ ని బ్రెయిన్ అందించడంలో.. నాడీ వ్యవస్థ బ్లాక్ అవుతుంది. అలాంటి సందర్భంలో వచ్చే స్ట్రోక్ ఇది.

హెమోర్హోజిక్ స్ట్రోక్
బ్రెయిన్ లోపల నాడీ పగిలిపోయినప్పుడు ఈ స్ట్రోక్ వస్తుంది.

హార్ట్ ఎటాక్ లక్షణాలు
హార్ట్ ఎటాక్ రావడానికి కొన్ని రోజుల ముందు కానీ, కొంత కాలం ముందు కానీ.. ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి. చెస్ట్ పెయిన్ ప్రధానంగా కనిపించే లక్షణం. దీన్ని చాలామంది ఇన్ డైజెషన్ వల్ల వస్తుందని అయోమయానికి గురవుతారు. కొన్ని నిమిషాల్లోనే తగ్గిపోతూ.. మళ్లీ కనిపిస్తూ ఉంటుంది.

హార్ట్ ఎటాక్ లక్షణాలు
బ్యాక్ పెయిన్, అబ్డామిన్ పెయిన్, నెక్, భుజాల నొప్పులు.. ఇవన్నీ.. ఎడమ వైపుగా కనిపిస్తుంటే.. హార్ట్ ఎటాక్ లక్షణంగా గుర్తించి, డాక్టర్ ని సంప్రదించాలి. శ్వాస తక్కువగా ఆడటం, ఆందోళన పెరగడం, చల్లగా చెమట పట్టడం, దగ్గు, వికారం, అలసట వంటి లక్షణాలన్నీ.. హార్ట్ ఎటాక్ కి సంకేతాలు.

కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు
కార్డియాక్ అరెస్ట్ తో బాధపడేవాళ్లకు కనిపించే లక్షణాలు. చెస్ట్ పెయిన్, వీక్ నెస్, మూర్చ, గుండె దడ, బ్రీత్ నెమ్మదిగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే చాలా సందర్భాల్లో శ్వాస అందకపోవడం, పల్స్ పడిపోవడం, స్పందింకపోవడం, హఠాత్తుగా పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇలాంటి లక్షణాలు మరణానికి దారితీస్తాయి.

స్ట్రోక్ లక్షణాలు
మాటలు సరిగా రాకపోవడం, తలనొప్పి, వాంతులు, వికారం, బ్లర్ గా కనిపించడం, స్పర్శ కోల్పోవడం, ముఖంలో పక్షవాతం, ఎక్కువగా చెమట పట్టడం, మానసికంగా అయోమయం, నడవలేకపోవడం, అలసట వంటి లక్షణాలన్నీ.. స్ట్రోక్ లక్షణాలుగా గుర్తించాలి.



Click it and Unblock the Notifications