ఈ 10 నేచురల్ రెమెడీస్ తో నెలసరి నొప్పుల (పీరియడ్ పెయిన్స్) నుంచి తక్షణ ఉపశమనం

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

నెలసరి నొప్పులన్ని (పీరియడ్ పెయిన్స్ ని) మెన్స్ట్రువల్ క్రామ్ప్స్ అనంటారు. ప్రతి మహిళ తన జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్యతో సతమతమవుతూనే ఉంటారు. అయితే, కొంతమంది మహిళలలో ప్రతీసారి నెలసరి సమయంలో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది.

కొంత మంది మహిళలలో గర్భాశయ కండరాలు బిగించుకుపోవడం వలన నెలసరి నొప్పి వేధిస్తుంది. దానివలన, తీవ్రమైన అసౌకర్యంతో మహిళలు వేదనకు గురవుతారు.

10 natural remedies for period pain

నెలసరి నొప్పుల వలన కొంతమంది మహిళలకు నెలసరి అంటేనే భయం పట్టుకుంటుంది.

అయితే, ఇక మీదట ఈ నెలసరి నొప్పులకు భయపడనవసరం లేదు. నెలసరి నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి సహజసిద్ధమైన నేచురల్ రెమెడీలు ప్రయత్నించవచ్చు.

#1 వ్యాయామం

#1 వ్యాయామం

వ్యాయామం చేయడం వలన శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి. వ్యాయామం ద్వారా అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అయితే, నెలసరి సమయంలో హై ఇంటెన్సివ్ ఎక్సర్సైజెస్ ను ప్రయత్నించకూడదు. నెలసరి సమయంలో తేలికపాటి ఎక్సర్సైజులను ప్రయత్నించడం ద్వారా నెలసరి నొప్పుల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. డ్యాన్సింగ్ చేసినా, బ్రిస్క్ వాకింగ్ చేసినా శరీరంలోని రక్తసరఫరా సజావుగా సాగుతుంది. ఆ విధంగా ఎండార్ఫిన్స్ తగినంత ఉత్పత్తి అవుతాయి. తద్వారా, నెలసరి నొప్పి తగ్గుముఖం పడుతుంది.

#2 హీట్ థెరపీ

#2 హీట్ థెరపీ

గర్భాశయంలో కండరాలు బిగుసుకుపోవడం నెలసరి నొప్పులకు ప్రధాన కారణం. హీట్ థెరపీ ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. గర్భాశయంలో బిగుసుకున్న కండరాల సమస్యను తొలగించడానికి హీట్ థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది. మీ ఉదరంపై హీట్ ప్యాడ్ ని వాడి నెలసరి నొప్పినుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ హీటింగ్ బ్యాగ్ లేకపోతే ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకుని అందులోని వేడి నీళ్లను కలిపి హీట్ థెరపీని చేసుకోండి.

#3 చమోమైల్ టీని తీసుకోండి:

#3 చమోమైల్ టీని తీసుకోండి:

సువాసనలు వెదచల్లే ఈ అద్భుతమైన టీలోనున్న కెమికల్ కాంపౌండ్స్ అనేవి నెలసరి నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. ఈ టీలో యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపెర్టీలు పుష్కలంగా లభిస్తాయి. ఈ టీని తాగితే నెలసరి నొప్పులు తక్కుముఖం పడతాయి.

#4 విటమిన్ డీ తో ఉపశమనం పొందండి

#4 విటమిన్ డీ తో ఉపశమనం పొందండి

చికిత్స కంటే నివారణ మేలనే నానుడి మనందరికీ తెలిసినదే. నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే శరీరానికి తగినంత విటమిన్ డి అందాలి. అధ్యయనాల ప్రకారం విటమిన్ డి ఎక్కువగా కలిగిన వారిలో నెలసరి నొప్పుల సమస్య తక్కువగా ఉన్నట్టు విటమిన్ డి తక్కువగా కలిగిన వారిలో నెలసరి నొప్పుల సమస్య అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది.

#5 భావప్రాప్తి పొందాలి

#5 భావప్రాప్తి పొందాలి

అవును. భావప్రాప్తిని పొందడం వలన అనేకరకాలైన నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. భావప్రాప్తి కలగడానికి ముందువరకు గర్భాశయం విశ్రాంత వైఖరిలో ఉంటుంది. అయితే, క్లైమాక్స్ కి చేరే సమయంలో రక్తప్రసరణ పెరగడం వలన నెలసరి నొప్పులు తగ్గుతాయి. ఎండార్ఫిన్స్ ఉత్పత్తి కూడా పెంపొందడం వలన నెలసరి నొప్పి మాయమవుతుందని వైద్యులు చెబుతున్నారు.

#6 ఆక్యుపంక్చర్

#6 ఆక్యుపంక్చర్

ఆక్యుపంక్చర్ అనేది చైనీయుల సాంప్రదాయ వైద్య పద్దతి. ఈ పద్దతిలో భాగంగా శరీరాన్ని ఉత్తేజపరచడానికి చర్మంపై కొన్ని పాయింట్స్ లో చిన్న చిన్న సూదులతో గుచ్చుతారు. అధ్యయనాల ప్రకారం, కొన్ని ప్రత్యేకమైన పాయింట్స్ లో ఆక్యుపంక్చర్ టెక్నిక్ ని వాడటం ద్వారా నెలసరి నొప్పులు మటుమాయమవుతాయి. ఇది ప్లేసెబో నియంత్రణ కన్నా మెరుగైనది.

#7 తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించండి

#7 తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించండి

కొవ్వు పదార్థాలను తగ్గించి ఎక్కువ కూరగాయలను ఆహారంలో భాగంగా చేసుకుంటే నెలసరి నొప్పుల సమస్య తొలగిపోతుంది. లో ఫ్యాట్ డైట్ వలన కూడా శరీరంలోని ఇంఫ్లేమేషన్ సమస్యను తగ్గించుకోవచ్చు.

#8 ఫిష్ ఆయిల్ తో పాటు విటమిన్ బీ1

#8 ఫిష్ ఆయిల్ తో పాటు విటమిన్ బీ1

విటమిన్ బీ1 తో పాటు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ను తీసుకోవడం వలన నెలసరి నొప్పుల సమస్యను సహజసిద్ధంగా తగ్గించుకోవచ్చు. 100 మిల్లీగ్రాముల వరకు వీటిని తీసుకోవడం మంచిదేనని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక అధ్యయనంలో భాగంగా, కొంతమంది టీన్స్ ఈ సప్లిమెంట్స్ ని తమ ఆహారంలో భాగంగా చేసుకున్నారు. వారిని నెలసరి నొప్పుల సమస్య అతిగా వేధించలేదని తెలుస్తోంది. మరోవైపు, ఈ సప్లిమెంట్స్ ని తీసుకొని టీన్స్ నెలసరి నొప్పులతో సతమతమయ్యారని అధ్యయనం వెల్లడి చేస్తోంది.

#9 ఎసెన్షియల్ ఆయిల్స్ తో మసాజ్

#9 ఎసెన్షియల్ ఆయిల్స్ తో మసాజ్

సువాసనలు వెదజల్లే లావెండర్, సేజ్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ తో ఉదరంపై మసాజ్ చేయడం వలన నెలసరి నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఈ విషయాన్ని మహిళలపై జరిగిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది. అయితే, ఈ ఆయిల్స్ ని వాడే ముందు వాటిని కాస్త న్యూట్రల్ లోషన్ తో డైల్యూట్ చేసి వాడటం మంచిది.

#10 మెగ్నీషియంని ఆహారంలో భాగంగా చేసుకోండి

#10 మెగ్నీషియంని ఆహారంలో భాగంగా చేసుకోండి

మెగ్నీషియన్ని మీ ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే నెలసరి నొప్పుల సమస్య తగ్గిపోతుంది. చాలా ఆహారపదార్థాలలో మెగ్నీషియం విరివిగా లభిస్తుంది. మెగ్నీషియం, కండరాల మరియు నాడుల పనితీరుని క్రమబద్దీకరిస్తుంది. నెలసరి నొప్పుల తీవ్రతను బట్టి మెగ్నీషియంను తీసుకునే మోతాదుని నిర్ణయించవచ్చు. వైద్యుల సలహా తప్పనిసరి.

ఇలా, అనేక విధాలైన సురక్షితమైన సహజ నివారణ పద్దతుల ద్వారా నెలసరి నొప్పుల సమస్యను తొలగించుకోవచ్చు. ఇకపై నెలసరి అంటే భయం వీడండి. నెలసరి రోజుల్లో కూడా ఆనందంగా, ఉత్సాహంగా ఉండండి.

English summary

10 Natural Remedies For Period Pain

Menstrual cramps are dreaded by every woman. It is that time of the month when they feel very lethargic and dirty. Here are 10 simple natural remedies for period pain which can be done at home.