Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే రోజూ ఇలా చేయండి, వీటిని తింటే చెడు కొవ్వు తగ్గిపోతుంది
రెగ్యులర్ గా మీరు వెల్లుల్లి తీసుకుంటే బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. వెల్లుల్లిలో ఉండే కొన్ని ప్రత్యేక గుణాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించేస్తాయి. వీలైతే రోజూ కొన్ని పచ్చి వెల్లుల్లి
బాడీలో ప్రతి ఒక్కరికీ కొలెస్ట్రాల్ (కొవ్వు) ఉంటుంది. అది మోతాదులో ఉంటే ఏమీ కాదు. కానీ ఆ కొవ్వు పెరిగితేనే చాలా ఇబ్బంది. ఇక బాడీలో అంతా మంచి కొలెస్ట్రాల్ ఉండదు. చాలా మందికి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది.
అది ఎంత ఎక్కువ పెరిగితే అన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీలైనంత వరకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.

హార్ట్ రిలేటెడ్ డిసీజ్
రక్తనాళాల్లో కొందరికి కొలెస్ట్రాల్ ఎక్కువైతే హార్ట్ రిలేటెడ్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. మామాలు కొవ్వు ఉంటే అంత ప్రమాదం లేదుగానీ చెడు కొవ్వు ఉన్న ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులకు గురవుతుంటారు.

వెల్లుల్లి తీసుకోండి
రెగ్యులర్ గా మీరు వెల్లుల్లి తీసుకుంటే బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. వెల్లుల్లిలో ఉండే కొన్ని ప్రత్యేక గుణాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించేస్తాయి. వీలైతే రోజూ కొన్ని పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని తింటూ ఉండండి. అలాగే మీరు తినే ఆహార పదార్థాల్లోనూ వెల్లుల్లి ఉండేలా చూసుకోండి.

గ్రీన్ టీ తాగాలి
రోజూ గ్రీన్ టీ తాగితే కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గిపోతుంది. గుండె సంబంధిత వ్యాధులు కూడా రావు.

ధనియాలు తీసుకోండి
బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే రోజూ మీరు తినే ఆహారంలో ధనియాలు ఉండేలా చూసుకోండి. ధనియాలతో కషాయం తయారు చేసుకుని తాగుతూ ఉంటే చాలు ఈజీగా బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది.

మెంతులు
మెంతుల ద్వారా కూడా ఈజీగా బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. రోజూ ఉదయాన్నే మెంతులతో తయారు చేసిన కషాయాన్ని తాగితే త్వరగా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.

ఉసిరి తినండి
రోజూ ఉసిరి తినడం వల్ల కూడా మీ బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిపోతుంది. ముఖ్యంగా రక్తనాళాల్లో ఉండే కొవ్వు మొత్తం కూడా కరిగిపోవడానికి ఉసిరి చాలా ఉపయోగపడుతుంది. రోజూ ఉదయమే ఉసిరికాయ తినడమో లేదంటే ఉసిరి జ్యూస్ తాగడమో చేయండి. దీని వల్ల కూడా ఈజీగా బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిపోతుంది.

యాపిల్
రోజూ యాపిల్ తీసుకోవడం వల్ల కూడా బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. అందువల్ల రోజూ ఒక యాపిల్ తినేలా ప్లాన్ చేసుకోండి.

బీన్స్
బీన్స్ ను రెగ్యులర్ తీసుకుంటే శరీరంలోని చెడు కొవ్వు మొత్ం కరిపోతుంది. వీటిలో కాపర్ తో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

ద్రాక్ష
ద్రాక్షలో కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. రోజూ ద్రాక్షను తీసుకుంటే బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిపోతుంది.

జామ
జామ పండ్లను రోజూ తింటే చాలా మంచిది. వాటిలో ఉండే ప్రత్యేక గుణాలు కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించగలవు.

పుట్టగొడుగులు
పుట్టగొడుగులను రోజూ తింటే కూడా బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది.

ఓట్స్
ఓట్స్ తో తయారు చేసిన పదార్థాలను రోజూ తింటూ ఉండండి. దీని వల్ల బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. సబ్జా గింజల్ని తింటే కూడా చెడు కొలెస్ట్రాల్ అనేది ఉండదు.

పెసలు
పెసలను రెగ్యులర్ గా తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. వీటన్నింటినీ మీరూ తరుచుగా తీసుకుంటూ ఉండండి కచ్చితంగా మీ బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది.



Click it and Unblock the Notifications