పొట్ట చుట్టూ ఉండే కొవ్వు అంతటినీ పోగొట్టుకోవొచ్చు ఇలా

Written By:
Subscribe to Boldsky

పొట్ట దగ్గర అధికంగా పేరుకుపోయే కొవ్వుతో ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో అందరికీ తెలిసిందే. దీని వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఎవరైనా పొట్ట దగ్గర అధికంగా కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవాలి. అయితే కొవ్వు చేరకుండా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు కింద సూచించిన పలు పదార్థాలను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో చాలా త్వరగా కొవ్వు కరిగేందుకు అవకాశం ఉంటుంది.

ఆరోగ్యానికీ ఇబ్బందే

ఆరోగ్యానికీ ఇబ్బందే

పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటే అందానికే కాదు ఆరోగ్యానికీ ఇబ్బందే! ఇది హార్మోన్లనూ ప్రభావితం చేస్తుంది. అంతేకాదు దీని వల్ల గుండెజబ్బులూ, మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ కొవ్వును తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆహార పదార్థాల ఎంపికలో జాగ్రత్త వహించాలి.

అంతర్గత కొవ్వును అదుపులో ఉంచుకోవచ్చు

అంతర్గత కొవ్వును అదుపులో ఉంచుకోవచ్చు

ఒకరోజులో మనం తినే ఆహారంలో పది గ్రాముల పీచు పద్దార్ధం (ఫైబర్) ఉండేలా చూసుకొంటే అంతర్గత కొవ్వును అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకోసం బీన్స్, పప్పుధాన్యాలూ, పండ్లూ, కాయగూరలూ, ఓట్స్ (అటుకులు), పొ్టుతీయని తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటూ రోజూకు ఎనిమిది గ్లాసుల నీటిని తాగితే పీచు పదార్థాల కారణంగా ఏర్పడే గ్యాస్ వంటి ఇబ్బందులు ఎదురుకావు.

మాంసకృత్తుల మోతాదు తగినంతగా

మాంసకృత్తుల మోతాదు తగినంతగా

దీనితో పాటు ప్రొటన్స్ అంటే మాంసకృత్తుల మోతాదు తగినంతగా ఉండేలా చూసుకోవాలి. రోజులో కనీసం వంద కేలరీల పోషకాలు ప్రొటన్ల నుంచి అందేలా జాగ్రత్త పడాలి. ఇవి నిదానంగా జీర్ణమై ఆకలిని అదుపులో ఉంచి కొవ్వు పేరుకోకుండా చూస్తాయి. ఇందుకోసం మీగడ తీసిన పెరుగూ, పాలూ, చేపలూ, గుడ్లూ తింటే మెరుగైన మాంసకృత్తులు అందుతాయి.

వాటిలో ఎక్కువగా పీచు పదార్థాలుంటాయి

వాటిలో ఎక్కువగా పీచు పదార్థాలుంటాయి

అలాగే యాపిల్, పుచ్చకాయ, దోసకాయ, ముల్లంగి, టొమాటో, క్యాబేజీ, చిలగడదుంప లలో పీచు పదార్ధలు ఎక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండి, యాంటి ఆక్సిడెంట్ల ఎక్కువగా ఉంటయి. వీటిని తినడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది. ఓట్స్ (అటుకులు)తో చేసిన పదార్థాలు కూడా పొట్ట దగ్గర కొవ్వును తగ్గిస్తాయి.

సెంట్రల్‌ ఒబేసిటీ

సెంట్రల్‌ ఒబేసిటీ

బరువు తగ్గడానికి ఏ పద్ధతి పాటించినా, బరువు ఓవరాల్‌గా తగ్గుతుంది. కానీ భారతీయులకు పొట్ట భాగంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది. దీనినే ‘సెంట్రల్‌ ఒబేసిటీ' అంటారు. పొట్ట భాగం మామూలుగానే అధికంగా ఉండటం వల్ల, మొత్తం బాడీ తగ్గినా... ఇంకా పొట్ట భాగం తగ్గనట్టే ఉంటుంది. పొట్ట ఆకారం మనం చేసే పనిని బట్టి మారుతూ ఉంటుంది. ఎక్కువసేపు కూర్చొని ఉండేవారికి పొట్ట భాగం అధికంగా ఉంటుంది. అలాగే ప్రతి రోజూ మద్యం, చిరుతిళ్ళు తీసుకొని, ఆ తరవాత భోజనం చేసేవారికి కూడా ఎక్కువ పొట్ట తయారవుతుంది.

కరివేపాకు

కరివేపాకు

నిత్యం ఉదయాన్నే పరగడుపున కొన్ని కరివేపాకు ఆకులను నమిలి మింగాలి. లేదంటే ఆ ఆకుల పేస్ట్‌ను మజ్జిగలో కలుపుకుని తాగినా చాలు ఫలితం ఉంటుంది. అలా కూడా కాదనుకుంటే కరివేప ఆకులను ఎండబెట్టి పొడి చేసుకుని ఆ పొడిని కూరల్లో వేసుకుని తినాలి. అన్నం, చపాతీలతో పాటుగా కూడా తినవచ్చు. ఇలా కరివేప ఆకులను రోజూ తింటే పొట్ట దగ్గర అధికంగా పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.

త్రిఫల

త్రిఫల

ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ వీటినే త్రిఫలాలు అంటారు. వీటి పొడి మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. లేదంటే ఇవే కాయలు కూడా దొరుకుతాయి. వాటిని పొడి చేసి మిశ్రమంగా కలుపుకుని కూడా త్రిఫల చూర్ణాన్ని వాడుకోవచ్చు. రాత్రి పూట నిద్రించడానికి ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో త్రిఫల చూర్ణం కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది.

సోంపు

సోంపు

ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో సోంపు కలుపుకుని నీటితో సహా సోంపును తాగుతూ నమిలి మింగేయాలి. లేదంటే మూడు పూటలా భోజనం చేసిన తరువాత ఒక టీస్పూన్ వేయించిన సోంపును బాగా నమిలి మింగాలి. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.

మెంతులు

మెంతులు

ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ మెంతుల పొడిని కలుపుకుని నిత్యం ఉదయం, సాయంత్రం తాగాలి. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి వేయదు. కొవ్వు కూడా కరిగిపోతుంది. ప్రధానంగా కాలేయం చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుంది.

అవిసె గింజలు

అవిసె గింజలు

అవిసె గింజెలు కొవ్వును కరిగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వీటిల్లో ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. బరువును తగ్గిస్తాయి.

ఆముదం

ఆముదం

ఆముదం నూనెతో వంటలు చేసుకుని తినాలి. దీంతో కొవ్వు కరిగిపోతుంది. ఒంట్లో ఉన్న కొవ్వును కరిగించే శక్తి ఆముదం నూనెకు ఉంది.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క

ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి బాగా మరగబెట్టాలి. తరువాత ఆ నీటిని వడపోసుకుని తాగాలి. ఉదయం, సాయంత్రం ఇలా చేస్తే త్వరగా బరువు తగ్గుతారు. పొట్ట దగ్గర కొవ్వు త్వరగా కరిగిపోతుంది.

జీర్ణవ్యవస్థను శుభ్రంగా ఉంచాలి

జీర్ణవ్యవస్థను శుభ్రంగా ఉంచాలి

అలాగే పొట్ట భాగంలో కొవ్వు తగ్గడానికి మూడు సూత్రాలను తప్పక పాటించాలి. అందులో ఒకటి జీర్ణవ్యవస్థను శుభ్రంగా ఉంచాలి. అంటే మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ప్రతి రోజూ నిద్రకుపక్రమించే ముందు ఇసబ్‌గోల్‌, ఫైబర్‌ సోంపు, ఉసిరి కలిసిన మిశ్రమాన్ని నీటిలో కలుపుకొని తీసుకుంటే, జీర్ణకోశం శుభ్రంగా ఉంటుంది. పొట్ట తేలిక పడుతుంది.

మద్యం తాగడం తగ్గించాలి

మద్యం తాగడం తగ్గించాలి

మద్యం తాగడం, చిరుతిళ్ళు తినడం తగ్గించాలి. లేదంటే మానేయాలి. స్వీట్స్‌ ప్రతిరోజూ తినేవారు ఆ అలవాటు మార్చుకోవాలి. నెలకు ఒక్కసారి మాత్రమే స్వీట్స్‌ తీసుకోవాలి.

రాత్రి భోజనానికి బదులుగా తాజా కొబ్బరి సలాడ్‌ తినాలి

రాత్రి భోజనానికి బదులుగా తాజా కొబ్బరి సలాడ్‌ తినాలి

తాజా కొబ్బరి సలాడ్‌ తయారీ విధానం ఏమిటంటే...

ఒక కప్పు కొబ్బరి ముక్కలు, ఒక మిర్చి (సన్నగా తరిగింది), చిటికెడు మిరియాల పొడి, ఒక స్పూను నిమ్మరసం, చిటికెడు జీలకర్ర పొడి, ఒక వెల్లుల్లి (సన్నగా తరిగింది), ఒక టీ స్పూన్‌ కొబ్బరి నూనె, తగినంత ఉప్పు. వీటన్నిటినీ కలుపుకొని భోజనానికి బదులుగా తీసుకోండి.

English summary

15 quick natural tips to lose belly fat

15 quick natural tips to lose belly fat
Story first published: Monday, May 14, 2018, 15:00 [IST]