For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదేపనిగా గంటల తరబడి ఒకే చోట కూర్చుని పని చేస్తున్నారా? ఈ 15 దుష్ప్రభావాలు కాచుకుని ఉన్నాయి జాగ్రత్త.

అదేపనిగా గంటల తరబడి ఒకే చోట కూర్చుని పని చేస్తున్నారా? ఈ 15 దుష్ప్రభావాలు కాచుకుని ఉన్నాయి జాగ్రత్త.

|

ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం మీ జీవిత కాలాన్ని తగ్గిస్తుందని తెలుసా? దీర్ఘకాలం పాటు కూర్చుని పనులు చేసే వ్యక్తులు గుండెజబ్బుతో మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అనేక పరిశోధనలు ద్వారా తేలిన నిజం. నిరంతరం పనివద్ద కూర్చోవడం కూడా అనేక దుష్ప్రభావాలకు దారితీస్తుంది.

శారీరిక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తుంది. ఇటువంటి కుర్చీకి అంటుకుపోయే ఉద్యోగాల్లో చిక్కుకున్న వ్యక్తులు నిర్దిష్టరకానికి చెందిన పెద్దప్రేగు కాన్సర్ ప్రమాదాన్ని రెండింతలు ఎక్కువగా కలిగే అవకాశం ఉన్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Constant Sitting At Work Side Effects

ఒక్కసారి దుష్ప్రభావాలు తలెత్తి పరిస్థితి చేయిదాటితే, వ్యాయామాలు, ఆహార ప్రణాళికలలో మార్పులు కూడా వంటివి కూడా పెద్దగా సహాయపడకపోవచ్చు. నిరంతరం కుర్చీకి అతుక్కుపోయి పనిచేయడం వలన 24 దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.

వీటిలో ముఖ్యమైన 15 ఆరోగ్య సమస్యల గురించిన వివరాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి.

అధిక కొలెస్ట్రాల్ :

అధిక కొలెస్ట్రాల్ :

ఒక సంవత్సరం అదేపనిగా కూర్చుని పనిచేసే ఉద్యోగంలో ఉన్నారా? అయితే, మీరు నెమ్మదిగా అధిక కొలెస్ట్రాల్ సమస్యను అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ గంటలు కూర్చొని ఉన్న ఎడల శరీరంలోని కొలెస్ట్రాల్ హెచ్చుతగ్గులలో అసమతుల్యత ఏర్పడుతుంది. క్రమంగా శరీరంలోని జీవక్రియలు తగ్గుముఖం పట్టి, ప్లాస్మాట్రైగ్లిజరైడ్ స్థాయిలు అధికమవడం, అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ కొలెస్టరాల్ స్థాయిలు తగ్గిపోవడం, అదే సమయంలో ఇన్సులిన్ హెచ్చుతగ్గులలో అసమతౌల్యం వంటి సమస్యల వలన అనేక రుగ్మతల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.

ఊబకాయం:

ఊబకాయం:

పొగాకు వలె, ఎక్కువసేపు కూర్చొని పని చేయడం కూడా ఆరోగ్యానికి హానికరంగా పరిగణించబడుతుంది. పనిలో అదేపనిగా కుర్చీలకు అతుక్కుపోవడం వలన, కండరాలకు సరైన వ్యాయామం, కదలిక లేక మరియు పూర్తిగా ఉపయోగించబడని కారణంగా కాలరీ బర్నింగ్ తగ్గుదలకు గురవుతుంది. తద్వారా పొట్టచుట్టూ కొవ్వు చేరడమే కాకుండా, శరీరంలో అవాంచనీయ కొవ్వుల శాతం పెరుగుదల అధికమవుతుంది. తద్వారా శరీరం ఊబకాయానికి గురవుతుంది.

గుండెవ్యాధి:

గుండెవ్యాధి:

కండరాలు శరీరంలోని కొవ్వులో తక్కువ శాతాన్ని మాత్రమే దహించగలవు మరియు దీర్ఘకాలం కూర్చొని ఉండటం మూలాన రక్తప్రవాహం కూడా నెమ్మదిగా మందగిస్తుంది. ముఖ్యంగా ధమనులలో కొవ్వు పదార్ధాలు పేరుకుని పోవడం మూలంగా, రక్తప్రసరణలో అనిశ్చితి నెలకొంటుంది. క్రమంగా, నిశ్చల జీవనశైలి కలిగిన వ్యక్తులు గుండె వ్యాధులకు ఎక్కువగా గురవుతూ ఉంటారు.

క్యాన్సర్:

క్యాన్సర్:

తక్కువ శారీరక శ్రమ, నిద్రాణ స్థితుల కారణంగా, గుండె జబ్బు మరియు క్యాన్సర్ ముప్పు వాటిల్లే ప్రమాదం అధికంగా ఉంది. రోజంతా డెస్క్ వద్ద కూర్చొని చేసే పనుల కారణంగా, కార్పస్ యుటేరి(గర్భాశయ కాన్సర్), రొమ్ము కాన్సర్, అండాశయ క్యాన్సర్ వంటి అనేక కాన్సర్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని తేలింది.

మధుమేహం:

మధుమేహం:

డెస్క్ వద్ద నిరంతరంగా కూర్చుని చేసే పనుల కారణంగా జీవక్రియలు మందగించడం, క్రమంగా రక్తంలోని చక్కర స్థాయిల హెచ్చుతగ్గులలో అసమతుల్యత ఏర్పడడం మూలంగా మధుమేహం వస్తుంది. రక్తం నుండి చక్కెరలను కణజాలాలకి తీసుకుని వెళ్లేందుకు, ఎక్కువగా బాధ్యత వహించే హార్మోన్ ఇన్సులిన్. జీవక్రియలు మందగించడం వలన క్లోమగ్రందిపై ప్రభావం పడుతుంది. తద్వారా ఇన్సులిన్ స్థాయిలలో అసాధారణ మార్పులు చోటుచేసుకోవడం మూలంగా, రక్తంలోని గ్లూకోజ్ హెచ్చుతగ్గులను నియంత్రించలేని స్థితికి శరీరం వస్తుంది. ముఖ్యంగా టైప్-2 మధుమేహం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మెదడు పనితీరు మందగించుట:

మెదడు పనితీరు మందగించుట:

కండరాలు, తాజా రక్తం మరియు ప్రాణవాయువును మెదడు ద్వారా పంపుతూ అన్నిరకాల మానసిక స్థితులను మెరుగుపరచే సెరటోనిన్ వంటి హాపీహార్మోన్స్ విడుదలయ్యేందుకు సహాయపడుతుంది. ఒకవేళ నిష్క్రియాత్మక జీవనశైలిని కలిగి ఉన్న ఎడల, మీ మెదడుతో సహా ప్రతిదీ నెమ్మదినిస్తుంది.

జీవక్రియల మందగింపు:

జీవక్రియల మందగింపు:

జీవక్రియల మందగింపు, అనేక అనారోగ్యకర దుష్ప్రభావాలకు ప్రధాన కారణమని ఇటీవల జరిగిన పరిశోధనలలో తేలింది. దీర్ఘకాలంపాటు కూర్చొని చేసే పనుల కారణంగా జీవక్రియల రేటు అసాధారణంగా పడిపోవడం మూలంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు అధిక రక్తపోటు, రక్తంలో చక్కెరల స్థాయిలు పెరగడం, నడుము చుట్టూ కొవ్వు, ఊబకాయం, ఆకలి మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

వెన్నునొప్పి:

వెన్నునొప్పి:

సుదీర్ఘకాలం కూర్చొని ఉండే పనుల కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలలో వెన్నునొప్పి కూడా ఒకటి. దీర్ఘకాలం కూర్చొని ఉండడం వలన కటి భాగాన వెన్నెముకలో స్థిరత్వo లోపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్రమంగా వెన్నునొప్పి ప్రమాదానికి దారితీస్తుంది.

వెన్నెముక కదలికలలో లోపం:

వెన్నెముక కదలికలలో లోపం:

ఎటువంటి వెన్నెముక అయినా సరైన కదలిక లేనప్పుడు అది దెబ్బతినడానికి అవకాశం ఉంది. మనం ఏదేని శారీరిక కార్యకలాపాలు చేసినప్పుడు, వెన్నపూసకు సరైన వ్యాయామం తోడవడం మూలంగా, డిస్కుల మద్య సరైన జీవక్రియలు జరుగుతాయి, క్రమంగా రక్తప్రసరణ సజావుగా జరిగి, పోషకాలను సంగ్రహించడానికి వీలవుతుంది. కానీ, ఎక్కువ గంటలు అదేపనిగా కూర్చున్న కారణాన, డిస్కులు అసమానంగా కుదించబడుతాయి.

బోరింగ్ సోషల్ లైఫ్:

బోరింగ్ సోషల్ లైఫ్:

అదేపనిగా పనియందే గంటల తరబడి కూర్చోవడం మూలంగా సామాజిక పరిస్థితుల గురించిన అవగాహన లోపించడం, క్రమంగా మానసిక ఎదుగుదల లోపించడం కూడా పరిపాటి అవుతుంది.

 లెగ్ డిజార్డర్స్:

లెగ్ డిజార్డర్స్:

ఎక్కువకాలం అదేపనిగా కూర్చొని పనిచేయడం, శరీరంలోని అవయవాల మద్య రక్తప్రసరణ తగ్గుముఖం పట్టడానికి కారణమవుతుంది. ముఖ్యంగా కాళ్ళు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటాయి. చీలమండలో వాపు నుండి సిరలు అనరోగ్యకరంగా మారే వరకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

నరాల బలహీనత:

నరాల బలహీనత:

ఎక్కువకాలం సరైన పనికి నోచుకోని కారణంగా నరాలకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

నడుము ప్రాంతంలో తీవ్రమైన అసౌకర్యం:

నడుము ప్రాంతంలో తీవ్రమైన అసౌకర్యం:

మీరు ఎక్కువ గంటలు డెస్క్ వద్దనే సమయాన్ని గడిపే వారిగా ఉంటే, అది మీ నడుము మీద విపరీతమైన ఒత్తిడికి దారితీస్తుంది. మోకాలు మరియు వెన్నెముక కూడా అధిక ఒత్తిడికి లోనవుతాయి.

తిమ్మిరి:

తిమ్మిరి:

ఎక్కువకాలం ఒకే స్థానంలో కూర్చోవడం మూలంగా, మీ నరాలకు హాని కలుగుతుంది. క్రమంగా తిమ్మిర్లు వంటి అసౌకర్యానికి తరచూ గురికావొచ్చు.

డిప్రెషన్:

డిప్రెషన్:

మీరు రోజు మొత్తం డెస్క్ వద్ద కూర్చునే ఉద్యోగంలో ఉన్నవారైతే, మీరు సామాజికంగా, శారీరికంగా సమస్యలు ఎదుర్కోవడమే కాకుండా, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆరోగ్య సంబంధిత అంశాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి.

English summary

Constant Sitting At Work Side Effects | Health Hazards Of Constant Sitting Problems | Effects Of Sitting For Long Periods Of Time | Effects Of Sitting At Desk All Day | Effects Of Sitting All Day At Work | Effects Of Sitting In Front Of Computer

constant sitting at work side effects, health hazards of constant sitting problems, effects of sitting for long periods of time,
Desktop Bottom Promotion