For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుట్టగొడుగులను తింటే నిత్య యవ్వనంగా ఉండొచ్చు

ఆరోగ్య పరిరక్షణలో పుట్టగొడుగులు (మష్రూమ్స్‌) ఎంతగానో ఉపయోగపడతాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇవి వృద్ధాప్యాన్ని కూడా దూరం చేస్తాయన్న సంగతి మాత్రం మనలో చాలామందికి తెలియదు. పుట్టగొడుగులు.

|

ఆరోగ్య పరిరక్షణలో పుట్టగొడుగులు (మష్రూమ్స్‌) ఎంతగానో ఉపయోగపడతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే... ఇవి వృద్ధాప్యాన్ని కూడా దూరం చేస్తాయన్న సంగతి మాత్రం మనలో చాలామందికి తెలియదు. నిత్యం యవ్వనంగా ఉండాలంటే మీరు పుట్టగొడుగులు తినాలి. పుట్టగొడుగుల్లో అధికంగా ఉండే ఎర్గోథియోనిన్, గ్లుటాథియోన్ః అనే యాంటీ ఆక్సిడెంట్లు ఇందుకు ప్రధానం కారణం. ఇతర ఉడికించిన కూరగాయల మాదిరిగా పుట్టగొడుగులను ఉడికించినప్పటికీ... వాటిల్లోని యాంటీ ఆక్సీడెంట్ల శాతం ఏమాత్రం మారదు.

హానికారక ఫ్రీరాడికల్స్

హానికారక ఫ్రీరాడికల్స్

మనం తీసుకున్న ఆహారం ఆక్సీకరణకు గురైనప్పుడు హానికారక ఫ్రీరాడికల్స్ శరీరంలోకి విడుదలవుతాయి. ఇవి శరీర కణాలను దెబ్బతీస్తాయి. ఫలితంగా క్యాన్సర్, గుండె సంబంధ సమస్యలు, అల్జీమర్స్ వంటి వ్యాధులు సంభవిస్తాయి. చివరకు డీఎన్‌ఏపై కూడా ఇవి ప్రభావం చూపి, వృద్ధాప్యానికి కారణమవుతున్నాయి. అయితే పుట్టగొడుగుల్లో అధికంగా ఉండే ఎర్గోథియోనిన్, గ్లుటాథియోన్ యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఫ్రీరాడికల్స్ ఎక్కువ విడుదల కాకుండా చేస్తాయి.

ఆరోగ్యానికి ఎంతో మంచిది

ఆరోగ్యానికి ఎంతో మంచిది

వేసవికాలంలో పుట్టగొడుగులను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాదు వీటిని తినడం వల్ల చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. వీటిల్లో బలవర్థక విటమిన్లకు కొరతే లేదు. ఈ సీజన్లలో బాగా దొరికే పుట్టగొడుగుల వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అవేమిటంటే ...

మొటిమలు, ఎలర్జీలు దరి చేరవు

మొటిమలు, ఎలర్జీలు దరి చేరవు

పుట్టగొడుగుల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇందులో డి-విటమిన్‌ బాగా ఉండడం వల్ల చర్మంపై మొటిమలు, ఎలర్జీలు దరి చేరవు. ముఖానికి రాసుకునే సీరమ్స్‌లో పుట్టగొడుగుల నుంచి తీసిన పదార్థాలు ఉంటాయి.

యాంగ్జయిటీలను తగ్గిస్తుంది

యాంగ్జయిటీలను తగ్గిస్తుంది

బి1, బి2, బి3, బి5, బి9లు వీటిల్లో ఉన్నాయి. ఇందులోని విటమిన్‌-బి ప్రధానంగా ఒత్తిడి, యాంగ్జయిటీలను తగ్గిస్తుంది.

ఎలర్జీలు, ఆర్థరైటిస్‌ వంటి జబ్బుల నివారణలో శక్తివంతంగా పనిచేస్తాయి. ఇవి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌ గుణాన్ని కలిగివుంటాయి.

చర్మం ఎంతో మృదువుగా ఉంటుంది

చర్మం ఎంతో మృదువుగా ఉంటుంది

పుట్టగొడుగుల్లో చర్మానికి కావలసిన హైడ్రైటింగ్‌ గుణాలున్నాయి. అందువల్ల చర్మం ఎంతో మృదువుగా ఉంటుంది. పుట్టగొడుగులు తీసుకోవడంవల్ల వయసు కనపడదు. ముఖ్యంగా చర్మం కాంతి విహీనం కాదు. స్కిన్‌టోన్‌ దెబ్బతినదు. వయసు మీదపడ్డం వల్ల తలెత్తే మచ్చలను కూడా ఇవి నివారిస్తాయి. పుట్టగొడుగుల్లో విటమిన్‌-డితో పాటు యాంటి-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ

కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ

కాబట్టి వాతావరణ కాలుష్యం వల్ల చర్మంపై తలెత్తే ముడతలు, ఎగ్జిమా వంటి సమస్యలను తగ్గిస్తాయి. యాంటి-ఇన్‌ఫ్లమేటరీ, యాంటి-ఆక్సిడెంట్ల సుగుణాలు వీటిల్లో బాగా ఉన్నాయి. వీటిల్లో ఫ్యాట్‌, కొలెస్ట్రాల్‌, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ. వీటిల్లోని పీచుపదార్థాలు, ఎంజైములు కొలెస్ట్రాల్‌ ప్రమాణాన్ని తగ్గిస్తాయి. ఇవి రక్తహీనతను కూడా తగ్గిస్తాయి.

కాన్సర్లను అరికడతాయి

కాన్సర్లను అరికడతాయి

రొమ్ము, ప్రొస్టేట్‌ కాన్సర్లను అరికట్టడంలో శక్తివంతంగా పనిచేస్తాయి. మధుమేహవ్యాధిగ్రస్థులకు లైట్‌ డైట్‌ ఇవి. పుట్టగొడుగుల్లో కాల్షియం శాతం అధికం. అందుకే వీటిని తరచూ తినడం వల్ల ఆస్టియోపొరాసిస్‌ తలెత్తదు. రోగనిరోధక శక్తిని ఇవి పెంపొందిస్తాయి. పుట్టగొడుగుల్లో సహజసిద్ధమైన యాంటిబయోటిక్స్‌ ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.

పొటాషియం ఎక్కువ

పొటాషియం ఎక్కువ

పుట్టగొడుగుల్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఇది రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది. పొటాషియం మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తి వృద్ధిచెందుతుంది. ఐరన్‌ ప్రమాణాలు కూడా వీటిల్లో బాగా ఉన్నాయి. శరీర బరువును తగ్గించడంలో కూడా ఇవి బాగా పనిచేస్తాయి. గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి.

 పలు విధాలుగా వండుకోవొచ్చు

పలు విధాలుగా వండుకోవొచ్చు

పుట్టగొడుగుల్ని పలు విధాలుగా వండుకోవొచ్చు. వేడివేడిగా ఆవురావురుమంటూ మష్రుమ్స్‌ని తింటూ ఎంజాయ్ చెయ్యండి.

మష్రుమ్ సూప్

కావలసినవి: మష్రుమ్- 100 గ్రా (సన్నగా తరగాలి) కొత్తిమీర- ఒక కట్ట; ఉప్పు - తగినంత దాల్చిన చెక్క- చిన్న ముక్క మిరియాల పొడి - పావుటీ స్పూన్ వెన్న లేదా నూనె- ఒక టేబుల్ స్పూన్ మైదా- 50 గ్రా; వెల్లుల్లి రేకలు- నాలుగు

తయారీ ఇలా

తయారీ ఇలా

ఒక గిన్నెలో పావు లీటరు నీరు పోసి అందులో కొత్తిమీర (సగం), దాల్చిన చెక్క, మిరియాలపొడి, ఉప్పు వేసి ఉడికించాలి. పెనంలో వెన్న వేసి మష్రుమ్స్ ముక్కలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే పెనంలో వెల్లుల్లి రేకలు, మైదా వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని పోసి బాగా మరిగిన తర్వాత వడకట్టాలి. వడపోసిన మిశ్రమంలో మష్రుమ్ వేసి కొత్తిమీర, మిరియాల పొడి చల్లి సర్వ్ చేయాలి.

మష్రుమ్ ఖీర్

మష్రుమ్ ఖీర్

కావలసినవి: పుట్ట గొడుగుల తురుము- ఒక కప్పు సోంపు- ఒక టీ స్పూన్; పాలు- అర లీటరు సొంఠి పొడి- అర టీ స్పూన్.

పంచదార లేదా తేనె- తగినంత నెయ్యి- 50గ్రా; డ్రై ఫ్రూట్స్- 100 గ్రా

తయారీ

ఒక పెనంలో నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్‌ని వేయించి పక్కన పెట్టాలి. అదే పెనంలో పుట్టగొడుగుల తురుము వేసి సన్న మంట మీద మగ్గనివ్వాలి. తర్వాత పాలు పోసి దగ్గరయ్యే వరకు ఉడకనివ్వాలి. తర్వాత సోంపు, శొంఠిపొడి, తేనె వేసి కలపాలి. డ్రైఫూట్స్ వేసి వడ్డించాలి.

కబోలి - మష్రుమ్ పులావ్ కు కావలసినవి

కబోలి - మష్రుమ్ పులావ్ కు కావలసినవి

పుట్ట గొడుగులు - 50 గ్రా శనగలు - 50 గ్రా; ఉప్పు - తగినంత కొత్తిమీర - ఒక కట్ట (సన్నగా తరగాలి) పుదీన- ఒక కట్ట (ఆకులు ఒలిచి పెట్టుకోవాలి) ఉల్లిపాయ ముక్కలు- ఒక కప్పు పచ్చిమిర్చి ముక్కలు- ఒక టీ స్పూన్ (కారానికి తగినంత మార్చుకోవచ్చు) బియ్యం - 200 గ్రా; దాల్చిన చెక్క - 10 గ్రా అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక టీ స్పూన్ జీలకర్ర- టీ స్పూన్ కరివేపాకు- రెండు రెమ్మలు

కబోలి - మష్రుమ్ పులావ్ తయారీ

కబోలి - మష్రుమ్ పులావ్ తయారీ

బియ్యాన్ని కడిగి నానబెట్టాలి. ఒక గిన్నెలో నూనె వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేగిన తర్వాత దాల్చిన చెక్క, ఉప్పు, పుదీన, కొత్తిమీర , శనగలు, పుట్టగొడుగులు వేసి తగినంత నీటిని పోయాలి. ఈ మిశ్రమం వేడెక్కి ఉడకగం మొదలైన తర్వాత బియ్యం వేసి కలిపి ఉడకనివ్వాలి. బియ్యం ఒక మోస్తరుగా ఉడికిన తర్వాత మంట తగ్గించి సన్నమంట మీద పూర్తిగా నీరు ఆవిరయ్యే వరకు ఉంచి దించాలి.

మష్రుమ్ మిల్క్ షేక్ కు కావలసినవి

మష్రుమ్ మిల్క్ షేక్ కు కావలసినవి

పుట్ట గొడుగులు- 50 గ్రా పంచదార- ఒక కప్పు; పాలు- అర లీటరు వెనిలా ఎసెన్స్- రెండు చుక్కలు ఏలకులు- రెండు; కిస్‌మిస్ - పది బాదం- ఎనిమిది (నాలుగింటిని పొడి చేయాలి, నాలుగింటిని సన్నగా తరగాలి); నెయ్యి- ఒక టీ స్పూన్

మష్రుమ్ మిల్క్ షేక్ తయారీ

మష్రుమ్ మిల్క్ షేక్ తయారీ

ఏలకులు, బాదం, పంచదారను కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఆ పొడిని పాలలో వేసి మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టాలి. పుట్ట గొడుగులను నేతిలో దోరగా వేయించి చల్లారిన తరవాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. ఫ్రిజ్‌లో చల్లబడిన పాలలో ఈ మిశ్రమాన్ని, వెనిలా ఎసెన్స్ కలిపి కిస్‌మిస్, తరిగిన బాదం పలుకులు వేసి సర్వ్ చేయాలి.

చింత చిగురు పుట్టగొడుగుల వేపుడుకు కావలసినవి

చింత చిగురు పుట్టగొడుగుల వేపుడుకు కావలసినవి

పుట్ట గొడుగులు- 200 గ్రా చింత చిగురు- 100 గ్రా; ధనియాల పొడి- ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి- ఆరు; పసుపు- పావు టీ స్పూన్ ఉప్పు- తగినంత; నూనె- రెండు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయలు- రెండు (తరగాలి) జీలకర్ర- ఒక టీ స్పూన్ వెల్లుల్లి రేకలు- ఒక టీ స్పూన్

చింత చిగురు పుట్టగొడుగుల వేపుడు తయారీ

చింత చిగురు పుట్టగొడుగుల వేపుడు తయారీ

చింతచిగురు, ఉల్లిపాయ ముక్కలు సగం, జీలకర్ర సగం మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఒక పెనంలో నూనె వేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి రేకలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత పుట్టగొడుగులు, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు చింతచిగురు ముద్ద వేసి బాగా కలిపి కొంచెం మగ్గనిచ్చి దించాలి. వేడివేడిగా వడ్డించాలి. ఇది చపాతీల్లోకి, అన్నం లోకి కూడా బాగుంటుంది.

కోనసీమ మష్రుమ్ వేపుడు

కోనసీమ మష్రుమ్ వేపుడు

కావలసినవి: పుట్టగొడుగులు- 200 గ్రా ఉల్లిపాయల పేస్టు- కప్పు; ఉప్పు- తగినంత కారం- తగినంత; నూనె- రెండు టేబుల్ స్పూన్లు అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టీ స్పూన్ కరివేపాకు- రెండు రెమ్మలు; పసుపు- ఒక టీ స్పూన్ కొత్తిమీర- ఒక కట్ట (తరగాలి) గరం మసాలా పొడి- అర టీ స్పూన్ ధనియాల పొడి - ఒక టీ స్పూన్

తయారీ:

తయారీ:

పుట్ట గొడుగులను ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఒక పెనంలో నూనె వేసి అందులో అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్టు వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి మరికొంత సేపు వేగనివ్వాలి. ఇప్పుడు మష్రుమ్ ముక్కలు, గరం మసాలా పొడి, కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టాలి. దీనికి నీరు పోయాల్సిన అవసరం లేదు. ఆవిరి మీదనే మష్రుమ్ ఉడుకుతుంది. ఇది సూప్‌లోకి స్నాక్‌గా బాగుంటుంది.

మునగాకు మష్రుమ్ ఇగురు

మునగాకు మష్రుమ్ ఇగురు

కావలసినవి: పుట్ట గొడుగులు- 200 గ్రా మునగ ఆకు- ఒక కప్పు ఉల్లిపాయ - ఒకటి (తరగాలి) ధనియాల పొడి- ఒక టీ స్పూన్ కారం- ఒక టీ స్పూన్; ఉప్పు- తగినంత నూనె- రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు- రెండు రెమ్మలు; కొత్తిమీర- ఒక కట్ట పచ్చిమిర్చి- నాలుగు (నిలువుగా చీరాలి)

తయారీ:

తయారీ:

మునగ ఆకు, ఉల్లిపాయ, కొత్తిమీరలను కలిపి మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఒక పెనంలో నూనె వేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత మిక్సీలో వేసిన మిశ్రమాన్ని వేసి కలపాలి. కొంచెం వేగిన తర్వాత పుట్ట గొడుగు ముక్కలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా నీటిని వేసి బాగా కలిపి ఇగురుగా అయ్యాక దించాలి.

English summary

20 interesting mushroom benefits for health

20 interesting mushroom benefits for health
Story first published:Monday, May 14, 2018, 15:49 [IST]
Desktop Bottom Promotion