Latest Updates
-
స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఇంట్లోనే..ఎలాంటి సాస్ లు లేకుండానే అదిరిపోయే వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రైడ్ రైస్.. -
పెసరపప్పు వెజిటేబుల్ ఇడ్లీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కేవలం 15 నిమిషాల్లో రెడీ! -
ఎప్పుడూ అలసిపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ విటమిన్ తగ్గినట్లే..డాక్టర్ చెప్పిన సంచలన నిజం! -
కరకరలాడే కాకరకాయ కాజు ఫ్రై..ఒక్కసారి వండితే రుచి మర్చిపోలేరు..అన్నం, పప్పు, రసంలోకి కేక! -
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే..
ఎట్టి పరిస్థితిలో పచ్చిగా తినకూడని ఆహారాలు
కొన్నిరకాల ఆహార పదార్థాలను ఎట్టిపరిస్థితుల్లో పచ్చిగా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పచ్చిగా తింటే.. తర్వాత తర్వాత.. ఆరోగ్యానికి హాని చేస్తాయని సూచిస్తున్నారు.
కూరగాయలు, పండ్లను పచ్చిగా తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కొన్నింటిని వండితే వాటిలోని పోషకాలు ఆవిరైపోతాయి. కాబట్టి అలాంటి ఆహారాన్ని పచ్చిగా తింటేనే పోషకాలు లభిస్తాయి. అయితే అన్ని ఆహారాలను అలా పచ్చిగా తినకూడదు. కేవలం కొన్ని మాత్రమే ఆ జాబితాకు చెందుతాయి. మిగతా వాటిని కచ్చితంగా ఉడకబెట్టుకునే తినాలి. లేదంటే మన శరీర రోగ నిరోధక వ్యవస్థ బలహీననమై వివిధ రకాల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు కలుగుతాయట. నిపుణులు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.

కొన్నిరకాల ఆహార పదార్థాలను ఎట్టిపరిస్థితుల్లో పచ్చిగా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పచ్చిగా తింటే.. తర్వాత తర్వాత.. ఆరోగ్యానికి హాని చేస్తాయని సూచిస్తున్నారు. కొన్నింటిని పచ్చిగా తింటేనే టేస్టీగా ఉంటాయి. కానీ పచ్చిగా తినకూడని ఆహార పదార్థాలను గురించి తెలుసుకుందాం...

1. బంగాళదుంపలు
కీరదోసకాయ, టమోటో వంటి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు, పచ్చిగా కూడా తింటుంటారు కాదా? అయితే అన్ని రకాల వెజిటేబుల్స్ అలా తినడానికి లేదు. పచ్చిబంగాళదుంప బాగా పాపులర్ అయిన వెజిటేబుల్ అయితే వీటిని తినడం ద్వారా గ్యాస్, జీర్ణసమస్యలు, తలనొప్పి, వికారం వస్తాయి. పచ్చిబంగాళదుంపలో టాక్సిన్స్ సలోనిన్ వంటివి అధికంగా ఉంటాయి. వీటిని ఉడికించి, బేక్ చేసి తినడం ఉత్తమ మార్గం

2. రాజ్మ
రాజ్మాలో ప్రోటీన్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో లాక్టిన్ ఉంటుంది. ఇవి ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కానీ వీటిని పచ్చిగా తీసుకుంటే శరీరాన్ని విష తుల్యం చేస్తుంది. వికారం, వాంతులు, జీర్ణ సమస్యలు, డయోరియా, వంటి సమస్యలొస్తాయి. కనుక రాజ్మా గింజలను కూడా 5 గంటల పాటు నీటిలో నానబెట్టి అనంతరం ఉడకబెట్టి తినాలి.

3. తేనె
తేనె కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణంగా మనం స్టోర్స్ లో తెచ్చుకుని తింటుంటాం, దీన్ని పాయిశ్చరైజ్ చేసుంటారు. అయితే ఇది పచ్చిది కాదు, తినడానికి మంచిదే. అయితే కొంత మంది ఆర్గానికి వెరైటీ తేనెను కొనుగోలుచేస్తుంటారు, ఆర్గానిక్ తేనెలో చాలా రకాలున్నాయి. వీటిని పాయిశ్చరైజ్ చేసున్నా పచ్చిగానే ఉంటాయి. తేనెలో ఎంజైమ్స్ ఎక్కువ, గ్రాసిటాక్స్ ఎక్కువ. ఇవి ఫుడ్ పాయిజన్ కు , అజీర్తికి గురిస్తుంది.

4. పచ్చిపాలు:
పాలను పచ్చిగా తాగితే వాటిలో ఉండే బ్రసెల్లా లిస్టెరియా నేరుగా మన శరీరంలోకి వెళ్తుంది. ఇది డయేరియా, కడుపు నొప్పి, వాంతులు వంటి వ్యాధులను కలగజేస్తుంది. శరీరాన్ని విషతుల్యం చేస్తుంది. కాబట్టి పాలను మరిగించి మాత్రమే తాగాలి.

5. బ్రొకోలీ
గ్రీన్ వెజిటబుల్స్ గ్రీన్ వెజిటబుల్స్ లో ఆక్సిలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరం ఐరన్, క్యాల్షియంను గ్రహించకుండా అడ్డుకుంటుంది. కాబట్టి వీటిని కాస్త ఉడికించి తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. విటమిన్స్ పొందవచ్చు.

6. ఆలివ్స్:
ఆలివ్స్ కొద్దిగా గ్రీన్ లేదా బ్లాక్ లో ఉంటాయి. చాలా మంది వీటిని పుల్లని రుచిని ఇష్టపడుతుంటారు. ఆలివ్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇవి ప్రొసెస్ చేసినవి, పికెల్ రూపంలో ఉంటాయి. ఇవి పచ్చివి కావు, మరియు తినడానికి సురక్షితమైనవి. అయితే, ప్రొసెస్ చేయని ఆలివ్స్ నేరుగా చెట్టు నుండి తీసినవి తినడం వల్ల ఆరోగ్యానికి హాని చేస్తాయి. వీటిలో ఓలిరోపిన్, అనేవి ఫుడ్ పాయిజన్ కు గురిచేస్తాయి.

7. పుట్టగొడుగులు:
వీటిలో కార్సినోజెనిక్ సమ్మేళనాలు ఉంటాయి. పచ్చిగా తింటే అవన్నీ మన శరీరంలోకి చేరి శరీరాన్ని విషతుల్యం చేస్తాయి. వీటిని కూడా ఉడికించే తినాలి.

8. పోర్క్
చాలా మంది పోర్కో తినడానికి ఇష్టపడరు. లేదా ఎలాంటి మాంసాహారం అయినా పచ్చిగా తినడానికి ఇష్టపడరు. అయితే కొంత మంది మాత్రం కోల్డ్ డిషెస్, సలాడ్స్ లో పచ్చిమాంసంను తింటారు. ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా హానికరం. పోర్క్ లో టేప్ వార్మ్ అనే ప్యారాసైట్ ఉంటుంది. ఇది మనుష్యుల శరీరంలోకి సులభంగా ప్రవేశించి అనారోగ్యపాలు చేస్తుంది. కొన్ని సందర్బాల్లో ప్రాణాంతకం కూడా!

9. గుడ్లు
పచ్చికోడిగుడ్లు: పచ్చికోడిగుడ్లలో సాల్మొనెల్లా బాక్టీరియా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్‌ఫెక్షన్లను కలిగిస్తుంది. కాబట్టి గుడ్లను ఉడకబెట్టి లేదా ఆమ్లెట్ రూపంలో తినాలి.



Click it and Unblock the Notifications











