ఇయర్ ఫోన్స్ 7 సార్లు మీ చెవిలో బాక్టీరియాను పెంచుతుంది, పక్కవారికిస్తే విపత్తులు జరిగే అవకాశం

Posted By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

ఇయర్ ఫోన్స్ 7 సార్లు మీ చెవిలో బాక్టీరియాను పెంచుతుంది, దీన్ని పక్కవారికి ఇస్తే విపత్తులు జరిగే అవకాశం ఉంది. మీరు ఎప్పుడూ ఇతరులకు ఇవ్వకూడని వస్తువుల గురించి నిపుణులు చెప్పారు.

ఇది మీరు పంచుకో కూడని వస్తువుల జాబితా, షేరింగ్ ఈజ్ కేరింగ్ అనేది మీతల్లిదండ్రులు ఎంత చెప్పారన్నది విషయం కాదు. మీ ఆరోగ్య రక్షణ కోసమే, దయచేసి ఈ వస్తువులను తీసుకోవద్దు, ఇవ్వొద్దు. మీకోసమే చెప్పేది ఈ లైను దాటకండి. వాటిని తెలుసుకోవడానికి చదవండి....

మీరు ఎప్పుడూ ఇతరులకు ఇవ్వకూడని వస్తువుల గురించి:

ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్

ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్

సంగీతాన్ని ఇష్టపడేవారు, ఎక్కువసేపు ఇయర్ ఫోన్లు చెవిలో పెట్టుకునేవారు వారి చెవి ఉపరితలం నుండి ఇయర్ ఫోన్స్ లోకి ఎంత బాక్టీరియా వస్తుందో అరుదుగా గుర్తిస్తారు. ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ వాడకం ద్వారా చెవిలో బాక్టీరియా 7 సార్లు పెరుగుతుందని నిరూపించబడింది. కాబట్టి ఇతరుల క్రిములు మనకు అంటే అవకాశం కూడా ఉంది.

స్పష్టంగా ఇంకా తెలియని – లోదుస్తులు లేదా సాక్స్ లు

స్పష్టంగా ఇంకా తెలియని – లోదుస్తులు లేదా సాక్స్ లు

మీ బట్టలు, లోదుస్తులు, సాక్స్ లు పెద్ద సంఖ్యలో పంచుకోవడ౦ సరైనది అయినప్పటికీ, మనసరీరంలోని కొన్ని భాగాలూ మిగిలిన వాటి కంటే వేరుగా ఉంటాయి. జననేంద్రియ బాక్టీరియాలు అంటుకొని ఉండడం వల్ల లోదుస్తులు పంచుకుంటే యూనిరారీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ (UTI) సంభవించవచ్చు. సాక్స్ లకు సంబంధించినంత వరకు, వీటి వల్ల పాదాలకు ఫంగస్, దురదలు, దద్దుర్లు, చెడు వాసన కలగవచ్చు.

ఫ్లాస్, టూత్ పిక్ లు లేదా టూత్ బ్రష్ లు

ఫ్లాస్, టూత్ పిక్ లు లేదా టూత్ బ్రష్ లు

టూత్ బ్రష్ ను మించి వ్యక్తిగత వస్తువు మరోటి ఉండదు, "అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం" టూత్ బ్రష్ ని ఇతరులతో పంచుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.

ఒక సాధారణ టూత్ బ్రష్ (మీరు మూడునెలలు ఉపయోగించే) E కోలి, స్టేఫిలోకోకస్ ఆరియస్, నోటి హెర్పెస్ బాక్టీరియా, ఆహార అవశేషాలు వంటి బాక్టీరియాను కలిగి ఉండవచ్చు.

అత్యవసరమైనపుడు పళ్ళు శుభ్రపరచు కోవడానికి శుభ్రమైన బట్టను వాడండి, ఇతరుల టూత్ బ్రష్ ని ఎప్పుడూ తీసుకోవద్దని దంతవైద్యుల సూచన.

కాప్స్, హాట్స్

కాప్స్, హాట్స్

సాధారణంగా దిండు కవర్లు, జుట్టు బ్రష్ లతోసహా మీ తలను కవర్ చేసేవి లేదా తాకేవి ఏవైనా కావొచ్చు.

కాబట్టి ఈసారి మీరు సూర్యుని నుండి మీ తలను రక్షించడం అవసరం, మీరు ధరించిన టోపీ మీదే ఉండాలని నిర్ధారించుకోండి.

క్రీమ్

క్రీమ్

జార్ లో ఏదున్నా అది మీ వ్యక్తిగత వస్తువు, అందులో మీ వెళ్ళు పెట్టొచ్చు, అందులో క్రిములు విస్తరించే ప్రమాదం ఉంది దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్, ఎగ్జిమా, సోరియాసిస్, అనేక ఇతర చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

మీ చర్మాని రక్షించుకోవడానికి ఒకేఒక మార్గం ఏమిటంటే మీరు కొన్న వస్తువుని ఒక గాలిబారని బాటిల్ లో ఉంచుకుంటే, అది బాక్టీరియా పెరుగుదలను అరికడుతుంది.

షేవింగ్ రేజర్ లు

షేవింగ్ రేజర్ లు

డాక్టర్ ఫీన్ బెర్గ్ ప్రకారం, "మీ రేజర్ ని ఎప్పుడూ ఎవరితో పంచుకోవద్దు, ఎందుకంటే ఈ మార్గంలో హెపటైటిస్, ఇతర ఇన్ఫెక్షన్లు విస్తరించే ప్రమాదం ఉంది, అదేవిధంగా HIV కూడా. మీ రేజర్ లో ఉండే అనేక బాక్టీరియాలు, చివరికి ఫంగై వల్ల అనేక చర్మ సమస్యలకు దారితీస్తుంది."

ప్రతిసారీ మీరు రేజర్ ని మార్చడం మర్చిపోకండి, ఇతరులకు ఎప్పటికీ పంచకండి.

ప్యూమిక్ స్టోన్

ప్యూమిక్ స్టోన్

మీరు ఇదొక రాయితో మీ పాదంపై ఉన్న డెడ్ స్కిన్ సేల్స్ ని రుద్దాలి అనుకుంటున్నారా. ఇలా చేయడం వల్ల మీ పాదాలలో పులిపిర్లు, ఫంగై పొందే సంభావ్యత పెరుగుతుంది. ఈ ఇన్ఫెక్షన్లు చాలా ప్రమాదకరం, వీటిని నివారించడం చాలా కష్టం.

మీరు మీ స్నేహితుల వద్ద ఉన్నపుడు మీరు స్నానానికి వెళ్ళేటపుడు మీ ప్యూమిక్ స్టోన్ ని ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంచుకోండి, దాన్ని ఎవరికీ ఇవ్వకండి.

English summary

Earphones Increase The Bacteria In Your Ear By 7 Times And Sharing Them Can Lead To Disasters.

Earphones Increase The Bacteria In Your Ear By 7 Times And Sharing Them Can Lead To Disasters. !This is a list of things that you should not share no matter how much your parents told you that sharing is caring. Care for your health and please avoid lending or borrowing these items. There is a thick line for you to not cross for your own sake.
Story first published: Monday, January 15, 2018, 11:00 [IST]