For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఆహారపదార్ధాన్ని వారానికి రెండుసార్లు తిన్నట్లైతే, గుండెపోటు మీకు ఆమడ దూరంలో ఉన్నట్లే!

ఈ ఆహారపదార్ధాన్ని వారానికి రెండుసార్లు తిన్నట్లైతే, గుండెపోటు మీకు ఆమడ దూరంలో ఉన్నట్లే!

|

అనారోగ్య కారణాల వలన కొన్ని నిమిషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయిన వారిని చూసినపుడు, లేదా వారి గురించి విన్నప్పుడు, మానవ జీవితం క్షణభంగురమని అనిపిస్తుంది కదా!

ఈ రోజు వారిని చూసినపుడు ఎంతో ఆరోగ్యంగా, ఆనందకరమైన జీవితం గడుపుతున్నారు అనిపించినప్పటికి, మారునాడే హఠాత్తుగా ఊహించని విధంగా తలెత్తే ఆరోగ్య సంక్లిష్టతలు వారి ప్రాణాలను హరించి వేసినపుడు సహజంగా భయాన్ని కలుగజేస్తుంది.

వయస్సు లేదా లింగబేధం లేకుండా చాలామంది ప్రజలు వివిధ రకాల జబ్బులు మరియు అనారోగ్య కారణాల చేత, దుర్భరమైన జీవితం లేదా ప్రాణాలు కోల్పోవడం గురించి మనం రోజూ వింటున్నాం.

Eating This One Food Twice A Week Can Reduce The Risk Of Heart Attacks!

కనుక ప్రతి మనిషి తన ఆరోగ్యానికి తనే బాధ్యుడు. తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నిరంతరం జాగ్రత్తలు తీసుకుంటూ, వీలయినంత కాలం ఎటువంటి జబ్బులు లేకుండా ఉండటానికి ప్రయత్నించాలి.

ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు ఉన్నప్పటికీ, కొన్ని జబ్బులు ఊహించని రీతిలో మనపై దాడి చేస్తాయి. కొన్ని జబ్బులు మాత్రం, మన జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా అరికట్టవచ్చు.

ఉదాహరణకు, రక్త క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించినప్పటికీ, ఏ సమయంలో అయినా దాడిచేయవచ్చు.

కానీ హృద్రోగాలు మరియు ఊబకాయం వంటి రోగాలు సమతులాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మొదలైన ఆరోగ్యకర జీవనశైలి అలవాట్లు వలన అదుపులో పెట్టవచ్చు.

కొన్ని సహజమైన ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా సేవిస్తే గుండె జబ్బుల వంటి ప్రమాదాలని తగ్గిస్తాయి.

ఇప్పుడు మీకు మేము సమాచారం అందజేయబోతున్న ఆహార పదార్థం హృద్రోగ సమస్యలను తగ్గిస్తుంది. ఆ పదార్ధం ఏమిటో, అది మీ గుండె యొక్క ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుందో ఇప్పుడు తెలుసుకోండి.

Eating This One Food Twice A Week Can Reduce The Risk Of Heart Attacks!

గుండె పోటు అంటే ఏమిటి?

మానవ శరీరంలో వివిధ అవయవాలు వివిధ రకాల విధులు నిర్వర్తిస్తాయని మనకు తెలిసిందే.

ఊపిరితిత్తులు, గుండె, మెదడు, మూత్రపిండాలు, మరియు కాలేయం వంటి ముఖ్య అవయవాలు మన శరీరానికి సంబంధించిన ముఖ్య విధులను నిర్వర్తిస్తాయి.

ఈ అవయవాలకు వ్యాధులు లేదా స్వల్ప గాయాల వలన కొద్దిపాటి నష్టం జరిగినా కూడా, అవి మృత్యువాతకు దారితీయవచ్చు.

గుండె, మన రక్తం నుండి కార్బన్ డై ఆక్సైడ్ ను వడగట్టి, ఆక్సిజన్ తో నిండిన రక్తాన్ని శరీరమంతటికి సరఫరా చేస్తుంది.

గుండె పోటు అనే పరిస్థితి తలెత్తినప్పుడు, గుండె జబ్బులు, రక్తం గడ్డకట్టడం, అధిక ఒత్తిడి, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ మొదలైన కారణాల వలన, హఠాత్తుగా ఆక్సిజన్ తో నిండిన రక్తం శరీరమంతటికి సరఫరా జరగడం ఆగిపోతుంది.
గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా జరగడం ఆగిపోయినపుడు, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి, స్ట్రోక్ వచ్చి, చనిపోయే పరిస్థితి తలెత్తుతుంది.

కనుక గుండె పోటు అనేది అత్యంత అపాయకరమైన పరిస్థితి. దీని వలన క్షణాల్లో ప్రాణాలు కోల్పోతారు.

గణాంకాలు తెలియజేసేదాని ప్రకారం, ఒక్క భారతదేశంలోనే ఏటా ఒక మిలియన్ జనాభా ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.

ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడి లేని వాతావరణంలో ఉండటం, గుండె జబ్బులు చికిత్స చేయించుకోవడం వంటి కొన్ని ఆరోగ్యకర జీవనశైలి మార్పులు గుండె పోటు యొక్క ప్రమాద స్థాయిని తగ్గిస్తాయి.

వారానికి రెండుసార్లు చేపలను తింటే, గుండె పోటు ప్రమాదాన్ని తగుస్తుందని మీకు తెలుసా? అదెలాగో తెలుసుకోండి.

Eating This One Food Twice A Week Can Reduce The Risk Of Heart Attacks!

చేపలను భుజించడం ఏ విధంగా గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది?

మీరు కనుక చేపలను తినడం ఇష్టపడినట్లైతే, ఇది మీకు శుభవార్తే! వారానికి రెండుసార్లు చేపలను తింటే గుండెపోటు ప్రమాదం చాలమేరకు తగ్గిపోతుందని నిపుణులు కనుగొన్నారు. హార్వార్డ్ వైద్య కళాశాల వారి అధ్యయనం ప్రకారం, వారానికి రెండుసార్లు చేపలను తింటే హృదయారోగ్యం మెరుగుపడి, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మరియు విటమిన్ ఈ మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు ధమనులలో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించి, గుండెల్లోకి రక్తప్రసరణ నిరంతరంగా కొనసాగేటట్లు చేస్తుంది.

అంతేకాకుండా, చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, అధిక రక్తపోటు మరియు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండెను ఆరోగ్యకరంగా ఉంచుతుంది.

Eating This One Food Twice A Week Can Reduce The Risk Of Heart Attacks!

కనుక తప్పనిసరిగా వారానికి రెండు సార్లు చేపలను తింటే,గుండె జబ్బుల తీవ్రత తగ్గిపోతుంది.

గమనిక: మీరు చేపలు తిన్నప్పటికిని, వ్యాయామం చేయకపోవడం, పొగ తాగడం,మద్యపానం, అనారోగ్యకర ఆహారం భుజించడం వంటి అనారోగ్యకర జీవనశైలి అలవాట్లు ఉంటే, గుండె జబ్బు ప్రమాదం తగ్గే అవకాశం ఉండకపోవచ్చు.

వారానికి రెండుసార్లు తక్కువ కొవ్వులు కలిగిన పదార్థాలతో కలిపి వండిన చేపలను తినడంతో పాటుగా మంచి జీవనశైలి విధానాలను పాటించడం ముఖ్యం.

మీరు చేపలు తినని వేగన్స్ లేదా శాఖాహారులైనట్లైతే,అప్పుడు చేప నూనెతో తయారైన క్యాప్సూల్స్ డాక్టర్ సలహా ప్రకారం తీసుకోవడం మంచి ప్రత్యామ్నాయం.

English summary

Eating This One Food Twice A Week Can Reduce The Risk Of Heart Attacks!

Only when we witness or hear about people losing their lives in seconds owing to health conditions, do we realise how fragile the human life is, right? People who may seem to be on the top of their health today, leading a content life can just be gone the next day, from sudden health complications which were rather unexpected.
Desktop Bottom Promotion