ఎండాకాలంలో కీరతో లెక్కలేనన్నీ ప్రయోజనాలు

Written By:
Subscribe to Boldsky

ఎండాకాలం వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి. దీనితో ఆరోగ్యంపై ఒకింత శ్రద్ధ కనబర్చాల్సి ఉంటుంది. ముఖ్యంగా నీటిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో డీ హైడ్రేషన్ కు గురవుతుంటారు. నీరు ఎక్కువగా దొరికే వాటిలో 'కీర' ఒకటి. ఇది ఆరోగ్యానికి మంచి ఔషధం అని చెప్పవచ్చు.

కీరను ప్రతి రోజు తీసుకోవడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. కిడ్నీలోని రాళ్లను కరిగించడంలో బాగా పనిచేస్తుంది. పాస్పరస్‌, విటమిన్లు, పోటాషియం, నీటి శాతం, మెగ్నీషియం, మినరల్స్‌, జింక్‌, ఐరన్‌, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయి.

కీర ముక్కలు తీసుకోవడం వల్ల

కీర ముక్కలు తీసుకోవడం వల్ల

ప్రతి రోజు రెండు గ్లాసుల కీరా జ్యూస్ తాగితే కడుపు నొప్పి..అల్సర్ వంటి సమస్యలు దూరం అవుతాయి. కీరలో 95 శాతం నీరు ఉండడం వల్ల శరీరానికి చల్లదనం అందిస్తుంది. వేసవిలో కీర ముక్కలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదిని వైద్యులు పేర్కొంటుంటారు.

విటమిన్లు, మినరల్స్

విటమిన్లు, మినరల్స్

ప్రపంచ వ్యాప్తంగా అధికంగా పండించే పంటలలో దోసకాయ నాలుగోస్థానంలో ఉంది. ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్లు,మినరల్స్ పుష్కలంగా కలిగి ఉంది. అంతేకాకుండా, చర్మానికి వాడే వివిధ రకాల ఉత్పత్తులలో కూడా వాడుతున్నారు. దోసకాను తినటం వలన కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.

విటమిన్ బీ

విటమిన్ బీ

విటమిన్స్, మినరల్'లను ఎక్కువగా కలిగి ఉంటుంది, ముఖ్యంగా విటమిన్ బీ. కావున, వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరుచుటకు కార్బోనేటేడ్ ద్రావణాల కన్నా, దోసకాయను తినండి. ఇందులో 90 శాతం వరకు నీరు ఉంటుంది, అంతేకాకుండా, శరీరాన్ని హైడ్రేటేడ్'గా ఉంచుతుంది

కళ్ళ ఆరోగ్యానికి

కళ్ళ ఆరోగ్యానికి

దోసకాయ, యాంటీ-ఇంఫ్లమేటరీ గుణాలను కలిగి ఉన్నందు వలన, కంటికి కలిగే వ్యాధులను తగ్గించటమే కాకుండా, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కేవలం 15 నిమిషాల పాటూ కళ్ళపై, తాజా దోసకాయ ముక్కలను ఉంచటం వలన మంచి భావనను పొందుతారు.

మధుమేహానికి

మధుమేహానికి

శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో ఉంచే హార్మోన్ దోసకాయలో ఉందని పరిశోధనలలో కనుగొనబడింది. మధుమేహ వ్యాధి గ్రస్తులు, దోసకాయ రసాన్ని తాగటం వలన మంచి ఫలితాలను పొందుతారు

కొవ్వు స్థాయిలలో తగ్గుదల

కొవ్వు స్థాయిలలో తగ్గుదల

శరీరంలో కొవ్వు పదార్థాలను తగ్గించే ''స్టేరాల్'' అనే మూలకం దోసకాయలో ఉంటుంది. అంతేకాకుండా, బరువు తగ్గించే ఆహర ప్రణాళికలో కలుపుకోండి కారణం- ఇది అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉండి, తక్కువ క్యాలోరీలను అందిస్తుంది.

మూత్రపిండాలకు ప్రయోజనం

మూత్రపిండాలకు ప్రయోజనం

దోసకాయలో ఉండే నీటి శాతం, శరీర వ్యవస్థలలో ఉండే విష మరియు హానికర పదార్థాలను బయటకు పంపివేస్తాయి. శరీరాన్ని చల్లబరచి మరియు మూత్రపిండాల విధిని మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గుదల

బరువు తగ్గుదల

అన్ని రకాల ఆరోగ్య ప్రణాళికలో దోసకాయను కలపవచ్చు, ముఖ్యంగా బరువు తగ్గించే ఆహర ప్రణాళికలో కలపవచ్చు. అధిక మొత్తంలో ఫైబర్'ను కలిగి ఉండి, జీర్ణక్రియను మెరుగుపరచటమే కాకుండా, కడుపు నిండేలా చేస్తుంది. తక్కువ క్యాలోరీలను కలిగి ఉండి, శక్తిని కూడా అందిస్తుంది.

గోళ్ళు జుట్టు పెరుగుదల

గోళ్ళు జుట్టు పెరుగుదల

జుట్టు గోళ్ళ పెరుగుదలలో ముఖ్య పాత్ర పోషించే ''సిలికా''ను పుష్కలంగా కలిగి ఉంటుంది. దోసకాయను రోజు తినటం వలన బలమైన జుట్టు మరియు గోళ్ళు పెరగటమే కాకుండా, మెరిసేలా చేస్తుంది

చర్మ సమస్యలకు

చర్మ సమస్యలకు

దోసకాయ చల్లభరించే గుణాలను కలిగి ఉన్నందు వలన, చర్మంపై కలిగే మంటలను మరియు ఎర్రగా మారే క్రియలను తగ్గించి వేస్తుంది. చర్మ ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్ సీ ని పుష్కలంగా కలిగి

సీ విటమిన్

సీ విటమిన్

కీర దోసలో 95 శాతం నీరు ఉండడం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాదు. శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగిస్తుంది. కీరదోస పొట్టులో సీ విటమిన్ ఉంటుంది. దాన్ని అలాగే తీసుకోవడం వల్ల ఒక రోజులో శరీరానికి అవసరమయ్యే సీ విటమిన్ పది శాతం వరకు అందుతుంది. దోసకాయలో ఉన్న పొటాషియం రక్తపోటులోని హెచ్చు తగ్గులను సవరిస్తుంది.

నల్లటి చారలు

నల్లటి చారలు

కళ్లకింద నల్లటి చారలు ఏర్పడితే.. కీర దోస ముక్కలను పెట్టుకుంటే చారలు తొలగిపోతాయి. కళ్లు ఉబ్బినట్లు ఉంటే వాటి మీద తాజా కీరదోస కాయ ముక్కలను కాటన్ వేసి పెట్టుకుంటే ఫలితం ఉంటుంది. వెంట్రుకల ఎదుగుదలకు దోసలోని సల్ఫర్, సిలికాన్, దోహద పడుతాయి. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపులో మంట (ఎసిడిటి)ను తగ్గిస్తుంది.

బాక్టీరియాను చంపేస్తుంది

బాక్టీరియాను చంపేస్తుంది

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.దోస తొక్కలో విటమిన్ కే సమృద్ధిగా ఉన్నందున చర్మానికి మేలు కలుగుతుంది. ఒక దోసకాయ ముక్కని 30 సెకన్ల పాటు నాలుకతో నోటి మీద పట్టుకుని ఉంటే చెడు శ్వాసకి కారణమైన బాక్టీరియాను చంపేస్తుంది.

బరువు తగ్గాలనుకునుకుంటే

బరువు తగ్గాలనుకునుకుంటే

నీటి శాతం ఎక్కువగా ఉండడం, కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి దీన్ని మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. కీరదోసలో పీచు ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది.

తొక్కతో తింటే మంచిది

తొక్కతో తింటే మంచిది

దోసకాయను తొక్కతోనే తినాలి. దోసకాయను ఊరగాయగా చేసి తినకూడదు. కీరదోసకాయ జ్యూస్ తాగడం ద్వారా అందులో ఉండే ఖనిజాల్లోని ఆల్కలైన్ స్వభావం వల్ల రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. దీంతో ఎసిడిటి సమస్య తగ్గుతుంది. కీర దోసకాయ జ్యూస్ గ్యాస్ట్రిక్, డియోడినం అల్సర్లకు చికిత్సగా ఉపయోగపడుతుంది.

రక్తప్రసరణ

రక్తప్రసరణ

ఎటువంటి రంగులు లేని కీరదోసకాయ జ్యూస్ వల్ల రక్తప్రసరణ క్రమబద్ధంగా ఉంటుంది. ఇందులోని ఖనిజాలు సోడియం నియంత్రణకు దోహదపడుతుంది. వాతావరణం పొడిగా, వేడిగా ఉన్న రోజుల్లో ఏవైనా ఆకు కూరల రసంతో కలిపి జ్యూస్ తీసుకుంటే చలువ చేస్తుంది. మూత్ర పిండాలలో రాళ్లు కరిగిపోవడానికి, మూత్ర విసర్జన చక్కగా జరగడానికి దోహదపడుతుంది.

తగ్గిపోతాయి

తగ్గిపోతాయి

కీళ్లలో ఉండే యూరిక్ యాసిడ్‌ను తొలగించడం వల్ల వాపు, నొప్పి తగ్గిపోతాయి. తీవ్రమైన ఎండ వల్ల చర్మం కమిలిపోతే కీరదోసకాయ రసం తీసి కమిలిన చోట రాస్తే చల్లగా ఉండి శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది.

English summary

healing benefits of cucumber to beat the heat this summer

healing benefits of cucumber to beat the heat this summer
Story first published: Monday, April 30, 2018, 17:00 [IST]