For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐరన్ లోపిస్తే బాడీలో ఈ మార్పులు వస్తాయి, తినే ఆహారంలో మార్పులు చేర్పులు అవసరం

తరుచుగా తలనొప్పితో బాధపడుతుంటే కూడా ఐరన్ లోపం ఉందని అర్థం. ఎందుకంటే ఐరన్ లోపం వల్ల బ్రెయిన్ లోని కొన్ని ర‌క్త‌ నాళాలు బాగా ఉబ్బి తలనొప్పి వస్తుంటుం

|

బాడీకి బ్లడ్ ఎంత అవసరమో ఐరన్ కూడా అంతే అవసరం. శరీరంలో ఐరన్ లోపం ఉండకుండా చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఐర‌న్ ఎక్కువగా ఉండే ఫుడ్ తింటే బాడీకి కావాల్సినంత బ్లడ్ అందుతుంది.

ఐరన్ బాగా ఉంటే రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్యాల బారిన పడరు. బాడీలో ఐరన్ లోపిస్తే ప్రధానంగా కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అలసటకు గురైనట్లు కనపడతారు

అలసటకు గురైనట్లు కనపడతారు

ఐరన్ లోపిస్తే బాగా అలసటకు గురైనట్లు కనపడతారు. బాగా చికాకు కలుగుతుంది. బాగా వీక్ అయిపోతారు. దేనిపైనా కూడా ఏకాగ్రత ఉండదు. చిన్న పని చేసినా లేదంటే కాసింత దూరం పరుగెత్తినా సరే శ్వాసం తీసుకోవడం కష్టంగా మారిపోతుంది.

ఒళ్లంతా దురదగా

ఒళ్లంతా దురదగా

బాగా నిద్రలో ఉన్నా కూడా కాళ్లు మాత్రం అదే పనిగా కదుపుతున్నారంటే మీకు ఐరన్ లోపం ఉందని సంకేతం. అలాగే నిద్రలో ఒళ్లంతా దురదగా ఉండినట్లు అనిపించడం, అదేపనిగా గోకడం కూడా ఐరన్ లోపం ఉందనడానికి సంకేతాలు.

తలనొప్పితో బాధపడుతుంటే

తలనొప్పితో బాధపడుతుంటే

తరుచుగా తలనొప్పితో బాధపడుతుంటే కూడా ఐరన్ లోపం ఉందని అర్థం. ఎందుకంటే ఐరన్ లోపం వల్ల బ్రెయిన్ లోని కొన్ని ర‌క్త‌ నాళాలు బాగా ఉబ్బి తలనొప్పి వస్తుంటుంది. అంతేకాదు ఐరన్ లోపం ఉన్నవారు చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు.

గుండె వేగం పెరిగిపోతుంది

గుండె వేగం పెరిగిపోతుంది

ఐరన్ లోపం ఉంటే కాస్త ఆందోళన చెందినా సరే గుండె వేగం పెరిగిపోతుంది. థైరాయిడ్ గ్రంథి కూడా సరిగ్గా పని చేయదు. ఐరన్ లోపం ఉంటే కాస్త బరువు కూడా బాగా పెరుగుతారు. ఐరన్ లోపం ఉంటే జుట్టు కూడా ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలుంటే మీరు వెంటనే డాకర్ని సంప్రదించాలి.

పాలకూర ఉండేలా చూసుకోండి

పాలకూర ఉండేలా చూసుకోండి

అయితే ఐరన్ బాడీ బాగా అందలాంటే మీరు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. రోజూ మీరు తినే ఆహారంలో పాలకూర ఉండేలా చూసుకోండి. అలాగే కనీనం వారానికి ఒకసారైనా చికెన్‌ తినండి. ఇక కాబూలీ శ‌న‌గ‌ల్లో కూడా ఐరన్ బాగా ఉంటుంది.

ఎరుపురంగు ఉన్న పండ్లు

ఎరుపురంగు ఉన్న పండ్లు

అలాగే ఎర్ర మిర‌ప‌కాయ‌లు, బీట్రూట్, ట‌మాట‌ల్ని రోజూ తీసుకోండి. యాపిల్స్‌ కూడా ఎక్కువగా తింటూ ఉండండి. ఎర్రగా ఉండే పండ్లలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎరుపురంగు ఉన్న పండ్లను ఎక్కువగా తింటూ ఉండండి. ఐరన్ లోపం ఉన్న వారు తినే ఆహారంలో కచ్చితంగా వెంటనే మార్పులు చేర్పులు చేసుకోవాలి.

English summary

iron deficiency signs and symptoms

iron deficiency signs and symptoms
Desktop Bottom Promotion