For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మౌత్ వాష్ ను ఉపయోగిస్తే లాభమా? నష్టమా? తెలుసుకోండి మరి

మౌత్ వాష్, కావిటీస్ కలిగించే క్రిములతో వ్యతిరేకంగా పోరాడే, పోరాట సామర్థ్యాలను కలిగి ఉంటుంది. కొన్ని మౌత్ వాష్లు ఫ్లోరైడ్ ద్వారా, క్రిములను నాశనం చేయడంలో ప్రయోజనాన్ని అందిస్తాయి. అయితే కొన్ని మాత్రం

|

నోటిని శుభ్రపరచుటలో మౌత్ వాష్ ఎంతవరకు అవసరం ?, మౌత్ వాష్ వలన కలిగే ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి ?, మౌత్ వాష్ నిజంగా నోటిలోని బాక్టీరియాను, క్రిములను చంపుతుందా ? వంటి అంశాల గురించిన పూర్తి వివరాలను తెలుసుకోవడంలో ఈ వ్యాసం దోహదం చేస్తుంది.

మొత్తం ఆరోగ్యానికి నోటి పరిశుభ్రత కీలకమైన పాత్ర పోషిస్తుంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని సామెత, అలాగే నోరు శుభ్రంగా ఉంటే శరీరం కూడా అనారోగ్యాలపాలు కాకుండా ఉంటుంది. మౌత్ వాష్ యొక్క ప్రాముఖ్యత మరియు దాని ఆవశ్యకత గురించిన పూర్తి వివరాలు మీకోసం.

మౌత్ వాష్, కావిటీస్ కలిగించే క్రిములతో వ్యతిరేకంగా పోరాడే, పోరాట సామర్థ్యాలను కలిగి ఉంటుంది. కొన్ని మౌత్ వాష్లు ఫ్లోరైడ్ ద్వారా, క్రిములను నాశనం చేయడంలో ప్రయోజనాన్ని అందిస్తాయి. అయితే కొన్ని మాత్రం దంతాలపై ఫలకాల ఆకృతిని నిరోధించే క్రిములను అడ్డుకోవడంలో సహాయాన్ని అందివ్వగలవు. కానీ, అధిక ఆల్కహాల్ కంటెంట్ కలిగిన, మరియు బలమైన యాంటీబాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న మౌత్ వాష్లు, వాటి అధిక ఘాడత తత్వాల కారణంగా నోటి లోపలి కణజాలాలను అసౌకర్యానికి గురిచేయగలవు.

కొందరు మద్యవయస్కులపై, మౌత్ వాష్ ఉపయోగాలు మరియు దుష్ప్రభావాల గురించిన అవగాహన కోసం శాస్త్రీయ ప్రయోగాలు జరపడం కూడా జరిగింది. ప్రజలలో మౌత్ వాష్ వినియోగం గురించిన అపోహలను తొలగించుట, ఈ పరిశోధన వెనుక ఉన్న ఆలోచనగా చెప్పబడింది.

ఆరోగ్యకరమైన చిగుళ్ళు మరియు దంతాల కొరకు మౌత్ వాష్ వినియోగానికి సంబంధించి అనేక దురభిప్రాయాలు, అపోహలు హల్చల్ చేస్తున్నాయి. కానీ మౌత్ వాష్ వినియోగాన్ని నిర్ణయించడానికి, నోటి పరిశుభ్రత కీలకపాత్ర పోషించినట్లు అధ్యయనాలు పేర్కొన్నాయి.

పైగా మౌత్ వాష్ వాణిజ్య ప్రకటనలు కూడా మౌత్ వాష్ వినియోగించకుండా పూర్తి నోటి పరిశుభ్రతను సాధించడం కుదరదు అని ప్రజల్లోకి చేరేలా ప్రయత్నిస్తున్నాయి. ఈ నమ్మకం గురించిన మరిన్ని వాస్తవాలను తెలుసుకోవడానికి ఈ వ్యాసం దోహదపడుతుంది.

మౌత్ వాష్ ఎలా పనిచేస్తుంది?

మౌత్ వాష్ ఎలా పనిచేస్తుంది?

ఒక మౌత్ వాష్ అనేది రిన్సింగ్(పుక్కిలించడం)తో సమానంగా చెప్పవచ్చు, కానీ ఇది మీ రోజువారీ నోటి పరిశుభ్రతలో భాగంగా, బ్రష్ చేయడం మరియు రెండుసార్లు ఫ్లాసింగ్ వంటి చర్యలను భర్తీ చేయలేదు. నిజానికి, నోటి దుర్వాసనను పోగొట్టే క్రమంలో భాగంగా మాత్రమే మౌత్ వాష్ వినియోగించడం జరుగుతుంది. కొన్ని మౌత్ వాషులు, ప్రత్యేకించి ఫ్లోరైడ్ కంటెంట్ కలిగి ఉంటుంది. ఇవి వైద్యుల సలహా మేరకు వినియోగించడం జరుగుతుంటుంది. ఇవి, పళ్ళను బ్యాక్టీరియా ద్వారా ప్రభావితం చేసే ఆమ్లతత్వాల నుండి దంతాలను రక్షించగలవు. మీరు గమ్ సమస్యలను లేదా నోటి సంక్రమణ వ్యాధులతో బాధపడుతుంటే మీ దంతవైద్యుడు నిర్దిష్టమైన మౌత్ వాష్లను సూచించవచ్చు.

కొన్ని మౌత్ వాష్లు మాత్రం ఫ్లోరైడ్ నుండి వ్యతిరేక ప్రయోజనాలను అందిస్తాయి, అయితే మిగిలినవి దంతాల ఫలకాన్ని దెబ్బతీసే క్రిములను నాశనం చేయడంలో సహాయపడుతాయి.

అనేక మౌత్ వాష్లు ఆల్కహాల్ కంటెంట్ కలిగి ఉంటాయి, అనుకోకుండా కొందరు మింగిన సందర్భంలో సమస్యలను కలిగించవచ్చు. అయితే, ఆల్కహాల్ రహిత మౌత్ వాష్లు కూడా అందుబాటులో ఉన్నాయని గుర్తుంచుకోండి. సున్నితమైన చిగుళ్ళు ఉన్నవారికి సహజ సిద్దమైన మౌత్ వాషులు సరిపోతాయి. సహజసిద్దమైన మౌత్ వాష్లలో అలోవేరా మరియు చమోమిలే(చామంతి) వంటి పదార్థాలు ఉన్నాయి.

ఆరోగ్యకరమైన దంతాలు మరియు చిగుళ్ళ కోసం మౌత్ వాష్ ఎంతవరకు అవసరం?

ఆరోగ్యకరమైన దంతాలు మరియు చిగుళ్ళ కోసం మౌత్ వాష్ ఎంతవరకు అవసరం?

మీరు నోటి పరిశుభ్రతను పాటిస్తున్నవారైన ఎడల, రోజులో కనీసం రెండు సార్లు బ్రష్ చేసే అలవాటు కలిగి, అప్పుడప్పుడు పుక్కిలించడం వంటివి చేస్తూ ఎప్పటికప్పుడు దంతాలను శుభ్రంగా ఉంచేలా ప్రయత్నిస్తుంటారు. మీకు మౌత్ వాష్లతో అంతగా అవసరం కూడా ఉండదు. మౌత్ వాష్లు మీ దంతాల ఉపరితలం మీద మాత్రమే ప్రభావవంతంగా పని చేస్తాయి. ఇదివరకే బ్యాక్టీరియా కారణంగా ఫలకాల ఏర్పాటు ఉంటే, వాటి విషయంలో మౌత్ వాష్లు అంత సమర్దవంతంగా పనిచేయవు కూడా.

మౌత్ వాష్లు, చెడు శ్వాసను తొలగించుటలో సమర్థవంతంగా పనిచేస్తాయి. కానీ, క్రిములను పూర్తి స్థాయిలో నివారించడంలో సమర్థవంతమైనది కాదు. అయినప్పటికీ, మీరు మౌత్ వాష్లు ఉపయోగించడం కొనసాగించాలనుకుంటే, యాంటీ బాక్టీరియల్ తత్వాలు కలిగి ఉన్నదాన్ని ఎంచుకోవడం ఉత్తమం, తద్వారా ఇది క్రిములతో కూడిన దంత ఫలకాలతో కూడా యుద్ధం చేయగలదు.

మౌత్ వాష్ యొక్క ఉపయోగాలు :

మౌత్ వాష్ యొక్క ఉపయోగాలు :

మౌత్ వాష్ అనేది నోటి పరిశుభ్రతను కాపాడుకునే క్రమంలో అనేక మందికి ఒక అలవాటుగా ఉంటుంది. మౌత్ వాష్ ఉపయోగించడం వలన కలిగే లాభాలు క్రింద పొందుపరచడం జరిగింది.

• మౌత్ వాష్, కావిటీస్ సమస్యలతో పోరాడే పోరాట సామర్థ్యం కలిగి ఉంటాయి. దంతక్షయం దారితీసే బ్యాక్టీరియాను దూరంగా ఉంచడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. అలాగే, మీ మౌత్ వాష్లో ఫ్లోరైడ్ కలిగి ఉంటే, అది అదనపు ప్రయోజనంగా చెప్పబడుతుంది. పళ్ళ యొక్క ఎనామెల్ను బలపరచడంలో ఫ్లోరైడ్ ఆధారిత మౌత్ వాష్లు ఉత్తమంగా పని చేస్తాయి, అంతేకాకుండా కావిటీస్ నుండి రక్షణ కల్పించడంలో అద్భుతంగా సహాయపడగలవు.

• మౌత్ వాష్లు చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి. వాపు లేదా గమ్ వ్యాధులను నిరోధించడంలో భాగంగా చిగుళ్ళ మీద చేరే బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయం చేస్తుంది.

• మౌత్ వాష్లు, దంతాల మీద మరకలను తొలగించుటలో సహాయం చేయడం ద్వారా, దంతాలను తెల్లగా మెరిసేలా చేయడంలో దోహదంచేస్తాయి.

• మౌత్ వాష్లు నోటి దుర్వాసన తొలగించడంలో ఉత్తమంగా పని చేస్తుంది, క్రమంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచగలుగుతుంది.

• మౌత్ వాష్లు నోటి పూతల నుండి ఉపశమనం అందివ్వడంలో సహాయం చేస్తాయి. కాని ఆల్కాహాల్ లేని మౌత్ వాష్ ఉపయోగించడం వలన బాధాకరమైన పూతల చికిత్సలో వేగవంతమైన స్పందన ఉంటుంది. ఇది వాపు-కలిగించే బ్యాక్టీరియాను నిర్మూలించడం ద్వారా పనిచేస్తుంది.

మౌత్ వాష్ చెడు ప్రభావాలు :

మౌత్ వాష్ చెడు ప్రభావాలు :

మౌత్ వాష్ వినియోగం కొన్ని దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుందని చెప్పబడింది.

వాటి గురించిన వివరాలు ఇక్కడ.

• నోటి వలయాలకు చికాకును కలిగించవచ్చు. అధిక ఆల్కహాల్ కంటెంట్ ఉన్న మౌత్ వాష్లలో బలమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి అధిక ఘాడత తత్వాలను కలిగి ఉన్నందువలన నోటి లోపలి కణజాలాలకు అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అందువలన, ఆల్కహాల్ ఆధారిత మౌత్ వాషెస్ వినియోగించడం మూలంగా నోటి పూతలు కలిగిన వారు అసౌకర్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరియు ఇవి చికిత్సను ఆలస్యం చేయవచ్చు.

• మీరు అనుకోకుండా మౌత్ వాష్ మింగేస్తే, అది ప్రమాదకరమైనదిగా కూడా పరిణమించవచ్చు, ముఖ్యంగా ఆల్కహాల్ ఆధారిత మౌత్ వాష్ల వినియోగం, చేసేవారు. అందుచేతనే 6 సంవత్సరాలలోపు పిల్లలకు మౌత్ వాష్లను ఏ వైద్యుడు కూడా సిఫార్సు చేయరు.

• మౌత్ వాష్ల వాడకం నోరు పొడిబారడానికి కూడా దారి తీస్తుంది. ఆల్కహాల్ ఆధారిత మౌత్ వాష్ యొక్క అధిక వినియోగం మీ నోటిని అత్యంత పొడిగా చేయగలదు. ఇది కావిటీస్ మరియు చెడు శ్వాసలను తగ్గించక పోగా, పంటి సున్నితత్వాన్ని కలిగిస్తుంది కూడా.

• మౌత్ వాష్ల అధిక వాడకం వలన తీవ్రమైన నోటి ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా మౌత్ వాష్లను ఉపయోగించినప్పుడు దీర్ఘకాలిక చెడు శ్వాస మరియు దీర్ఘకాలిక హాలిటోసిస్ పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక హాలిటోసిస్ సమస్య తలెత్తిన ఎడల ఏమాత్రం ఆలస్యం చేయకుండా, దంత వైద్యుని సంప్రదించడం మేలు. కావున అధిక వినియోగం ఎన్నటికీ మంచిది కాదని చెప్పబడింది.

చివరిగా ...

చివరిగా ...

మీ నాలుక వెనుక భాగంలోని కొద్దిపాటి ప్రాంతంలో నివసిస్తున్న బ్యాక్టీరియా కారణంగా, చెడు శ్వాస సంభవిస్తుందని కొందరు వైద్యులు ప్రమాణపరుస్తున్నారు. సులభంగా వాటిని మీ టూత్ బ్రష్ ఉపయోగించి బ్రష్ చేయడం ద్వారా శుభ్రం చేయవచ్చు. దీనికి మౌత్ వాష్ ఉపయోగించనవసరం లేదు. మీ చెడు శ్వాసను తొలగించడానికి బ్యాక్టీరియాను దూరంగా ఉంచడంలో అన్నివేళలా మౌత్ వాష్ వినియోగించడం సూచించదగినదికాదు.

ఒక మౌత్ వాష్ ఉపయోగించడం, బ్రషింగ్ మరియు ఫ్లాసింగ్ వంటి చర్యలకు ప్రత్యామ్నాయం ఎన్నటికీ కాదు. అంతేకాకుండా, కేవలం మంచి మౌత్ వాష్ వినియోగించడం కారణంగా నోటి ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అనుకోవడం అపోహే. రోజులు కనీసం రెండు సార్లు బ్రష్ చేయడం, ఫ్లాసింగ్ చేయడం ద్వారా నోటి పరిశుభ్రతను కాపాడుకోవచ్చు. క్రమంగా బ్రషింగ్, ఫ్లాసింగ్ అలవాటుగా పాటించడం మూలంగా, నోటి దుర్వాసన చాయలకు కూడా రాదు.

అలాగే, క్రమంతప్పకుండా కనీసం 6 నెలలకు ఒకసారి వైద్యుని సంప్రదించి, దంతాలను తనిఖీ చేయించుకోవడం అవసరం. మరియు ఏ ఆహార పదార్ధాలను స్వీకరించినా నోటిని శుభ్రపరచుకోవడం మరవకండి. ముఖ్యంగా చాక్లెట్స్, కూల్డ్రింక్స్ వంటివి తీసుకున్నప్పుడు. అంతేకాకుండా, అతి శీతల మరియు అతి వేడిపదార్ధాలను స్వీకరించడం కూడా దంతసమస్యలకు కారణం అవుతుంది. కావున జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించేలా ప్రణాళికలు చేసుకోవలసి ఉంటుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, జ్యోతిష్య, ఆహార, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Is Mouthwash Really Needed

Is Mouthwash Really Needed
Story first published:Friday, October 5, 2018, 12:07 [IST]
Desktop Bottom Promotion