For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోటిలో అధిక లాలాజలం స్రవించడానికి కారణాలివే, ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి

|

సామాజిక ఆందోళనలతో కూడుకుని అసహనం ఎక్కువగా కలిగి ఉండేవారు ఎక్కువ స్థాయిలో లాలాజలం ఉత్పత్తి చేయడం జరుగుతుందని చెప్పబడింది. దీనికి భయం, అసహనం, అసౌకర్యం మొదలైన అంశాలు తోడు కావొచ్చు. హైపర్సలైవేషన్ (లాలాజలం అధికంగా ఉత్పత్తి అవడం) కారణంగా మీ నోటి దిగువ పెదవుల నుండి లాలాజలం బయటకు వచ్చేలా చేస్తుంది. సహజంగా చొంగ కారడం అని వ్యవహరిస్తుంటారు.

పరిస్థితులను అనుసరించి, హైపర్సాలైవేషన్ అనేది శాశ్వతంగా, లేదా తాత్కాలికమైనదిగా ఉంటుంది. ఈ కారణాన్ని గుర్తించడం ద్వారా రోగులకు ఉత్తమమైన చికిత్సను అందివ్వవచ్చు. ఇది నలుగురితో మాట్లాడడానికి ఇబ్బందిని కలిగించడమే కాకుండా, వేరే ఇతర అనారోగ్య పరిస్తితులకు కూడా దారితీస్తుంది. ముఖ్యంగా రోజువారీ కార్యకలాపాలలో తీవ్ర అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయి.

హైపర్సాలైవేషన్ అంటే ఏమిటి ?

హైపర్సాలివేషన్ అనగా లాలాజలం అధిక స్రావానికి గురవడం. ప్రత్యేకించి ఒక వ్యాధిగా పరిగణించకపోయినా కూడా, హైపర్సాలైవేషన్ ఒక రకమైన అంతర్లీన పరిస్థితికి చిహ్నంగా పరిగణించబడుతుంది. వ్యయ ప్రయాసలు లేకుండానే చికిత్స తీసుకునేలా ఉంటాయి. కానీ చికిత్సను తీసుకొని ఎడల, ఇతరులు మీతో మాట్లాడేందుకు కూడా సుముఖత వ్యక్తం చేయని పరిస్థితులు దాపురిస్తుంటాయి. పరిస్థితి చేయి దాటినప్పుడు మాత్రమే, వైద్యుడు శస్త్ర చికిత్సను సూచించవచ్చు.

లాలాజల గ్రంధుల ద్వారా మన నోటిలోకి స్రవించబడే స్పష్టమైన ద్రవంగా లాలాజలం కనిపిస్తుంది. ఆహారాన్ని నమిలేందుకు, అనుకూల వాతావరణాన్ని నోటిలో కలుగజేసేందుకు లాలాజలం ఉత్తమంగా సహాయపడుతుంది. లాలాజలంలోని ఎంజైముల ఉనికిని జీర్ణక్రియలో సహాయపడుతాయి.

నోటి నుండి క్రిములను తొలగించడంలో కూడా లాలాజలం ఉత్తమంగా పనిచేస్తుంది. ఇది నోటి గాయాల చికిత్సలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా విషానికి మరియు చికాకులకు వ్యతిరేకంగా ఒక అవరోధం వలె పనిచేస్తుంది కూడా. లాలాజలం నోరు పొడిబారకుండా చూడడంలో సహాయం చేస్తుంది.

ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి లాలాజల ఉత్పత్తి, సగటున 0.75 నుండి 1.5 లీటర్లు. ఆహారం తీసుకునేటప్పుడు, దీని ఉత్పత్తి శిఖరాగ్ర స్థాయిలో ఉంటుంది. అదేవిధంగా మనం నిద్రపోతున్న సమయంలో అతి తక్కువగా ఉంటుంది.

మీరు అధిక లాలాజల ఉత్పత్తితో బాధ పడుతున్న ఎడల, మాట్లాడటం మరియు తినడం కూడా కష్టంగా ఉంటుంది. హైపర్సలైవేషన్ చర్మ వ్యాధులకు, పెదాలపై పూతలు, పుండ్లు ఏర్పడడానికి కూడా కారణమవుతుంది. ఎక్కువ మోతాదులో చొంగ కారడం కారణంగా సామాజికంగా ఆత్మ విశ్వాసం దెబ్బతినడానికి కూడా కారణం అవుతుంది. హైపర్సాలైవేషన్ యొక్క కారణాలు :మితిమీరిన లాలాజల ఉత్పత్తికి ప్రాథమిక కారణాలు :

గర్భం

గర్భం

గర్భధారణ సమయంలో మార్నింగ్ సిక్నెస్ మరియు వికారం వంటి సమస్యలు అధిక లాలాజల ఉత్పత్తికి కారణమవుతుంది. గర్భాశయ హార్మోన్లు మీ లాలాజల గ్రంథుల పనితీరుని సైతం ప్రభావితం చేయగలవు.

గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి :

గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి :

ఎసోఫాగియల్ లైనింగ్లో, నిరంతరంగా రిఫ్లక్స్ జరగుతున్న ఎడల, క్రమంగా ఈపరిస్థితి హైపర్సాలైవేషన్ ప్రేరేపిస్తుంది. అటువంటి సందర్భాలలో, దీనిని నీటి గొలుసుగా పిలవడం జరుగుతుంది. నోటిలో ఉత్పత్తి జరిగే లాలాజలం ఏమాత్రం రుచి లేకపోవడం లేదా పుల్లటి రుచి అనుభవానికి లోనుచేయడం జరుగుతుంటుంది.

• అధిక పిండి పదార్దాలు తీసుకోవడం :

• అధిక పిండి పదార్దాలు తీసుకోవడం :

అధిక పిండి పదార్ధాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం కూడా మీ నోటిలో లాలాజలం ఉత్పత్తిని కూడా పెంచుతుంది.

ప్యాంక్రియాటైటిస్ :

ప్యాంక్రియాటైటిస్ :

ఇది లాలాజల గ్రంధులు పూర్తిస్థాయిలో పనిచేయకపోవటానికి కారణం కావచ్చు. అనేక సంవత్సరాల పాటు మద్యపానం అధికంగా తీసుకోవడం మూలంగా ప్యాంక్రియాటైటిస్ సమస్యకు కారణమవుతుంది.

Most Read : నా భార్యను నేను అలా టెంప్ట్ చేస్తాను, దీంతో తను సెక్స్ కు బాగా సహకరిస్తుంది #mystory257

నోటి అల్సర్స్ ( పుండ్లు ) :

నోటి అల్సర్స్ ( పుండ్లు ) :

నోటిలో పుండ్లు ఉన్నప్పుడు మరింత ఎక్కువగా లాలాజల ఉత్పత్తి జరుగుతుంది. అనగా, బాధాకరమైన నోటి పూతల విషయంలో హైపర్సలైవేషన్ ఖచ్చితంగా ఉంటుంది. క్రమంగా అటువంటి పుండ్ల లక్షణాలు సాధారణంగా పులిసిన భావనని కలిగిస్తుంటాయి. క్రమంగా ఆ ప్రాంతంలో ఎర్రటి బంప్ వలె ఏర్పడుతుంది

కాలేయ వ్యాధి

కాలేయ వ్యాధి

లాలాజల స్రావం అనేది స్వయం ప్రతి నాడీ వ్యవస్థ ద్వారా నియంత్రించబడుతుంది. కాలేయ వ్యాధి అధిక లాలాజల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.

ఓరల్ ఇన్ఫెక్షన్లు :

ఓరల్ ఇన్ఫెక్షన్లు :

నోటి మంట లేదా వాపుతో కూడిన ఇన్ఫెక్షన్లు అధిక లాలాజల స్రావానికి దారితీస్తుంది. టాన్సలిటిస్ వంటి ఓరల్ ఇన్ఫెక్షన్లు హైపర్సలైవేషన్ సమస్యకు కారణమవుతాయి. నోటిలో హెర్పెస్ వంటి వైరల్ సంక్రమణ రూపంలో కూడా ఓరల్ ఇన్ఫెక్షన్లు ఉంటాయి. హెర్పెస్, నోటి చుట్టూ వాపు మరియు పుండ్లు ఏర్పడడానికి కారణమవుతుంది.

Most read : మా ఆయన ఆ భంగిమలో పాల్గొన్నప్పుడు వెంట్రుకలను గట్టిగా వెనక్కి లాగుతాడు, బూతులు మాట్లాడతాడు

సెరోటొనిన్ సిండ్రోమ్

సెరోటొనిన్ సిండ్రోమ్

ఇది నాడీ వ్యవస్థలో అధిక సెరోటోనెర్జిక్ చర్యలను సూచించే లక్షణం కలిగిన ప్రాణాంతకమైన వ్యాధిగా చెప్పబడింది. ఈ స్థితిలో, రోగి మానసిక స్థితిలో మార్పులను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా న్యూరోమస్కులర్ హైపర్ యాక్టివిటీ మరియు ఆటోనామిక్ అస్థిరతలను (మానసిక జాడ్యం) ఎదుర్కొంటుంది. ఇటువంటి నరాల లక్షణాలు ఉన్న రోగులలో, హైపర్సలైవేషన్ అనేది చాలా సాధారణమైన అంశంగా ఉంటుంది.

హైపర్సాలివేషన్ నిర్ధారణ ఎలా జరుగుతుంది ?

హైపర్సాలివేషన్ నిర్ధారణ ఎలా జరుగుతుంది ?

అన్నిటికన్నా ముఖ్యమైనది వ్యాధి నిర్ధారణ. దీనికి అంతర్లీన అనారోగ్య పరిస్థితులు కూడా కారణంగా మారవచ్చు, మరియు వాటికి సంకేతంగా కూడా ఉండవచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో, అధిక లాలాజల ఉత్పత్తి కారణాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సూచిస్తాయి. హైపర్సలైవేషన్ సమస్యను గుర్తించడానికి మీ వైద్యుడు ఈ క్రింది వాటిని పరిశీలించడం జరుగుతుంది :

• మీ దంతాలు, నోరు మరియు పరిసర చర్మం

• మీ మ్రింగే సామర్థ్యం, నాలుక నియంత్రణ మరియు దవడ స్థిరత్వం

• మీ నాసికా రంద్రాల పనితీరు

• టాన్సిల్స్

• ఆర్ద్రీకరణ మరియు ఆకలి స్థాయిలు

• తల భంగిమ

• చురుకుదనం మరియు భావోద్వేగ స్థితి

మీ వైద్యుడు మరికొన్నిఇతర వివరాలను కూడా అడుగువచ్చు, వాటిలో కొన్ని దిగువ పేర్కొనబడ్డాయి.

• హైపర్సలైవేషన్ సంభవించే అవకాశం ఉన్నప్పుడు, పరిస్థితి వ్యవధి మరియు సమయం

• మీరు వాడుతున్న మందుల వివరాల గురించి అడుగవచ్చు. ఒక్కోసారి మందుల ప్రతికూలతలు శాతం సమస్యకు కారణంగా ఉండవచ్చు.

• ఉత్పత్తి చేసే అదనపు లాలాజలం మొత్తం

• పరిస్థితి కొనసాగే సమయం

• రోజువారీ జీవితంలో హైపర్సాలివేషన్ యొక్క ప్రతికూల ప్రభావాలు

హైపర్సలైవేషన్ కారణాన్ని గుర్తించిన తర్వాత, మీ వైద్యులు మీకు చికిత్సను ఖరారు చేసే ముందు, క్రింద పేర్కొన్న విధంగా, కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.

• వ్యక్తి మానసిక స్థితి మరియు రోగి వయస్సు

• పరిస్థితి యొక్క చిక్కులు మరియు తీవ్రత

• మెరుగుదల అవకాశాలు మరియు పరిధి

• నరాల సంబంధిత పరిస్థితుల గురించిన అవగాహన

• దీర్ఘకాలిక లేదా తాత్కాలిక హైపర్సలైవేషన్

హైపర్సాలివేషన్ చికిత్స ఎలా ?

హైపర్సాలివేషన్ చికిత్స ఎలా ?

అంతర్లీన పరిస్థితికి చికిత్స అవసరం ఉంటుంది. ఈ పరిస్థితిపై ఆధారపడి, ఈ క్రింద సూచించబడిన వాటిలో ఏ చికిత్సనైనా చేయవచ్చు :

• చికిత్స :

స్పీచ్ థెరపీ చికిత్స మరియు ప్రవర్తనా సరళి సవరణా చికిత్స ప్రధానంగా ఉంటుంది.

• ఔషధ ప్రయోగం :

లాలాజలం ఉత్పత్తిని తగ్గించడానికి యాంటి ఖోలినెర్జిక్ మందులను సూచించబడతాయి.

• గృహ నివారణలు :

పుష్కలంగా నీటిని తాగడం లాలాజల ఉత్పత్తిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. మౌత్ వాష్ ఉపయోగించి నోటిని శుభ్రపర్చడం తాత్కాలికంగా నోటిని పొడిగా ఉంచడంలో సహాయపడుతుంది.

కొన్ని అరుదైన మరియు విపత్కర పరిస్థితుల్లో, శస్త్రచికిత్స కూడా హైపర్సలైవేషన్ వెనుక ఉన్న కారణానికి, చికిత్స చేయడానికి చివరి మార్గంగా ఉండవచ్చు. మరియు ఏకైక కారణం కూడా అదే కావొచ్చు. కావున పరిస్థితి చేయి దాటకుండానే వైద్యుని సంప్రదించడం మేలు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, జ్యోతిష్య, ఆహార, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

What Causes Too Much Saliva In The Mouth?

What Causes Too Much Saliva In The Mouth?
Story first published: Friday, October 5, 2018, 14:00 [IST]