For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎముక విరిగితే శరీరంలో ఇలాంటి చాలా మార్పులొస్తాయి, తెలుసుకోండి

|

ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడో, లేదా ఆటలాడుతున్నప్పుడో ఎముక విరగడం అనేది తరచూ చూస్తుంటాము. కానీ ఆ సమయంలో ఎముక విరిగిన భాగంలోనే కాకుండా, ఆ ప్రభావం శరీరంలోని ఇతర భాగాల మీద కూడా ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం. ఉదాహరణకు, మాటల్లో తడబాటు, జ్వరం, నెర్వస్ ఫీలింగ్ వంటి సమస్యలు ఎదురవడం వంటివి. ఎముక విరిగినప్పుడు, నిజానికి దానికదే కొంతకాలానికి సర్దుకుంటుంది. కానీ కొన్ని కీలక సమయాల్లో మాత్రమే పరిస్థితి జఠిలమై ఖచ్చితంగా శస్త్ర చికిత్స అవసరమవుతుంది.

శస్త్ర చికిత్స, శల్య చికిత్సలు అంటూ అనేకరకాల వైద్య విధానాల నుండి, ఫిజియోథెరపీ వరకు అనేక దశలుగా ఈ చికిత్స ఉంటుంది. ఒక ఎముక విరిగిన తర్వాత, అది తిరిగి యధాస్థితికి వచ్చే వరకు ఉండే దశలను వరుసగా చూద్దాం. ఏది ఏమైనా నొప్పి నివారణా చర్యలలో భాగంగా వైద్యుని పర్యవేక్షణ, చికిత్స తప్పనిసరి అని మరువకండి. ఒక్కోసారి చిన్నవేకదా అని తేలికగా తీసుకునే అంశాలు కూడా, భవిష్యత్తులో ప్రమాదకరంగా పరిణమించవచ్చు.

1. అసలు ఎముక విరగడం అంటే ఏమిటి ?

1. అసలు ఎముక విరగడం అంటే ఏమిటి ?

నిజానికి శరీరంలో ఎముకలు అత్యంత కీలకమైన అంతర్గత అవయవాలుగా ఉంటాయి. నిజానికి ఇవి రెండు రకాలుగా ఉంటాయి. అవి దృఢమైన ఎముక మరియు మృదులాస్థిగా ఉంటాయి. దృడమైన ఎముకలలో అస్థిపంజరం, కాళ్ళు, చేతులలోని ప్రధాన ఎముకల భాగం, పుర్రె, వెన్నెముక వంటివి ఉంటాయి. కానీ మృదులాస్థిలో నాలుగు ఇతర రకాలు కూడా ఉన్నాయి. ఎముకలు లేని శరీరం నిలబడడానికి సహకరించదు కూడా. కొన్నిరకాల వ్యాదులలో నెమ్మదిగా ఎముకలు శరీరంలోకి కరిగిపోవడం కూడా గమనించారు శాస్త్రవేత్తలు. ఈ పరిస్థితిని గురించి ఇదివరకు వ్యాసాలలో చెప్పుకున్నాం కూడా.

ఎముకల నిర్మాణాన్ని అనుసరించి జీవులు తమ తమ రూపాలను సంతరించుకున్నట్లే, ఎటువంటి ఎముకలు లేని జీవులు కూడా భూమి మీద ఉన్నాయి. వాటిని ఇన్వర్టబ్రేట్స్ అని వ్యవహరిస్తుంటారు.

2. అంత తేలికైన విషయం కాదు

2. అంత తేలికైన విషయం కాదు

ఇక మానవశరీరం విషయానికి వస్తే, ఎముకలు మన శరీరంలో అత్యంత చురుకైన భాగాలుగా చెప్పబడుతాయి. ఎముక తనకుతానుగా విరగడం అంత తేలికైన విషయం కాదు. కానీ దురదృష్టవశాత్తు విరిగినా కూడా, అదృష్టవశాత్తు త్వరగా నయమైపోతుంది. మీరు ఊహించిన సమయానికన్నా ముందుగానే సమస్య నుండి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి కారణం శరీరంలోని మూలకణాల ఉనికి. ఈ మూలకణాలు, ఎముకను తనకుతాను స్వయంగా పునరుద్ధరించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండేలా ప్రోత్సహిస్తాయి.

3. ఫ్రాక్చర్

3. ఫ్రాక్చర్

ఎముక విరగడాన్ని ఫ్రాక్చర్ అని వ్యవహరిస్తారు. ఎముక విరిగినప్పుడు, వైద్యుడు తిరిగి యధాతధంగా ఉండేలా శరీర నిర్మాణస్థితికి తగినట్లుగా చికిత్సా పద్దతులను అవలంభించి అమర్చవలసిన అవసరం ఉంటుంది. వైద్యం ఏమాత్రం వికటించినా, అది వైకల్యానికి దారితీసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఫ్రాక్చర్స్ అనేది, ఎముక విరిగిన స్థానం, సంక్లిష్టత వంటి అనేకములైన లక్షణాలపై ఆధారపడి వర్గీకరించబడతాయి.

ఒక పాత ఎముక, ఒక కొత్త ఎముకతో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది కణాల పరస్పర చర్యల కారణంగా ఎముకలు తిరిగి మామూలు స్థితికి వచ్చేలా సులభతరం చేస్తుంది. విరిగిన ఎముకను నయం చేయడంలో, ఈవిధానం కీలకపాత్రను పోషిస్తుంది.

బోన్ ఫ్రాక్చర్ దశలు - ఎముక విరిగిన క్షణం నుంచి నయం అయ్యేవరకు :

4. శరీరం షాక్ గురవుతుంది:

4. శరీరం షాక్ గురవుతుంది:

వెంట్రుకవాసిలో ఏర్పడిన చిన్న చిన్న ఫ్రాక్చర్స్ కొంతకాలంపాటు గుర్తించబడవు కూడా. కానీ, తీవ్రంగా విరిగిన స్థితిలో, వ్యక్తి అకస్మాత్తుగా మైకానికి లోనై, షాక్ గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ స్థితిలో నొప్పి అనుభూతి ఉండకపోయినా, శరీరం పాలిపోయినట్లుగా కనిపిస్తాడు. శ్వాస కష్టతరం అయిన పక్షంలో, మూర్చకు గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.

5. రక్తనాళాలు వేరుచేయబడతాయి:

5. రక్తనాళాలు వేరుచేయబడతాయి:

ఎముక విరిగినప్పుడు రక్తనాళాలు చిట్లడం ద్వారా, ఎముకలలోనికి రక్తస్రావం జరుగుతుంది. చర్మాన్ని చొచ్చుకుని ఎముక బయటకు వచ్చిన స్థితిలో, రక్తం ధారాళంగా కారుతుంది. ఈ స్థితిలో కాలు కదపడం కూడా కష్టంగా ఉంటుంది.

6. రక్తం గడ్డకట్టడం

6. రక్తం గడ్డకట్టడం

ఎముక యొక్క విరిగిన భాగం చుట్టూ రక్తము గడ్డకట్టడం మనం గమనించవచ్చు. దీనిని హెమటోమాగా వ్యవహరిస్తారు. కారుతున్న రక్తంలోని ప్రోటీన్ల కారణంగా రక్తకణాలు సేకరించబడి ఒక మెష్ వలె అడ్డుకుని అధిక రక్తస్రావం కాకుండా కాపాడుతుంది. దీనికి శరీరంలోని k విటమిన్ ఎక్కువగా సహాయం చేస్తుంది. ఈ k విటమిన్ తక్కువగా ఉన్న వ్యక్తులలో ఎనీమియా(రక్తహీనత) వంటి వ్యాధులే కాకుండా, ఎముక విరిగిన పరిస్థితుల్లో రక్తం గడ్డకట్టకుండా చేసి, సమస్యను మరింత కఠినతరం చేస్తుంది. ఒక్కోసారి అధిక రక్తస్రావానికిలోనై ప్రాణాంతకం కూడా కావొచ్చు.

7. వాపు మొదలవుతుంది:

7. వాపు మొదలవుతుంది:

రక్తం గడ్డకట్టిన తరువాత, రోగనిరోధక వ్యవస్థ పనిచేయడం కారణంగా ప్రభావిత ప్రాంతంనందు వాపు ప్రారంభమవుతుంది. రోగనిరోధక వ్యవస్థ పూర్తిస్థాయిలో చికిత్సను జరపడం మరియు నొప్పిని తగ్గించే క్రమంలో భాగంగా, వాపు కూడా సహాయం చేస్తుంది. తదనంతరం ఎముక మజ్జ, రక్తం మరియు కణజాలాల మూల కణాలు విరిగిన ప్రాంతానికి చేరడం జరుగుతుంది. క్రమంగా ఎముక నిర్మాణానికి మరియు ప్రభావిత ప్రాంతంలో మృదులాస్థి ఏర్పడటానికి మార్గాన్ని సుగమం చేస్తుంది.

8. కోండ్రోబ్లాస్ట్స్ ద్వారా ఆకస్మిక నిర్మాణం

8. కోండ్రోబ్లాస్ట్స్ ద్వారా ఆకస్మిక నిర్మాణం

విరిగిన ప్రాంతం అంచుల నుండి కొత్త ఎముక నిర్మాణం ప్రారంభమవుతుంది. నిర్వహణ ప్రక్రియలో భాగంగా దాదాపు ప్రతిరోజూ కొత్త ఎముక ఏర్పడుతూ, పాత ఎముకను భర్తీ చేస్తూ ఉంటుంది. విరిగిన ప్రాంతం చివరల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని పూరించడానికి మృదువైన మృదులాస్థి కణాల ఉత్పత్తి జరుగుతుంది.

9. పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడు

9. పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడు

ఈ ప్రక్రియ కడుపులో పిండం అభివృద్ధి చెందుతున్న ప్రక్రియలో శిశువు యొక్క ఎముకలు(మృదువైన ఎముకలు) ఏర్పడే దశను సూచిస్తుంది. అదేవిధంగా ఫైబ్రోకార్టిలేజ్ దశలో, ఎముక విరిగినప్పుడు గాయాన్ని కొత్త ఎముకతో పూడ్చడం చేస్తుంది. ఈ దశ గరిష్టంగా దెబ్బతగిలిన 8రోజులవద్ద ప్రారంభమవుతుంది.

అయితే, ఫైబ్రోకార్టిలేజ్ బలంగా లేని ఎడల, ఇది తాత్కాలికమైన చికిత్సగానే ఉంటుంది కానీ, శాశ్వత పరిష్కారంగా మాత్రం ఉండదు. క్రమంగా రోజువారీ జీవితంలో ఎముకలు ఎదుర్కొంటున్న కష్టాలను మరియు ఒత్తిళ్లను భరించగలిగే శక్తిని ఫైబ్రోకార్టిలేజ్ కలిగి ఉండకపోవచ్చు. ఒక్కోసారి బరువైన వస్తువులు ఎత్తినప్పుడు, మరలా ఫ్రాక్చర్ లోనయ్యే అవకాశాలు లేకపోలేదు.

10. కోండ్రోబ్లాస్ట్స్

10. కోండ్రోబ్లాస్ట్స్

కొత్త ఎముక ఏర్పడటం అనేది "కోండ్రోబ్లాస్ట్స్" తో సంబంధాన్ని కలిగి ఉంటుంది. గ్రాన్యులేషణ్ కణజాలం(విరిగిన ఎముకను జతచేయడంలో సహాయపడే కణజాలం)లో ఉండే ఫైబ్రోబ్లాస్ట్స్, కోండ్రోబ్లాస్ట్స్ వలె రూపాంతరం చెందుతాయి.

ఇది కూడా హయాలిన్ మృదులాస్థిని రూపొందిస్తుంది. ఈ కణజాలాలు చివరకు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఏకమవుతాయి. ఈ ప్రక్రియ విజాతీయ కణజాలాల సమ్మేళనాన్ని సూచిస్తుంది. దీనిని ఫ్రాక్చర్ కాలస్(విరిగిన భాగంలో ఏర్పడిన కొత్త ఎముక) అని వ్యవహరిస్తారు. ఈ కొత్త ఎముక నిర్మాణం, ఎముక విరిగిన 2 వారాలకు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది. అప్పటివరకు వైద్యపర్యవేక్షణ అవసరం ఉంటుంది.

11. కొత్త ఎముకను ఏర్పరిచే విరామసమయాలు

11. కొత్త ఎముకను ఏర్పరిచే విరామసమయాలు

ఈ మృదువైన ఎముక కణజాలం, మొట్టమొదటగా దృడమైన ఎముక రూపంలోని నూతన కణజాలాలతో మార్పిడి చెందుతుంది. కానీ, ఇది నిజమైన ఎముక వలె ఆశించినంత బలంగా ఉండదు. ఎముక విరిగిన మూడు నుండి నాలుగు వారాల తరువాత కొత్తగా ఏర్పడిన ఎముక, పక్వానికి రావడం మొదలవుతుంది. ఈ నిర్మాణం కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఎముక విరిగిన ప్రదేశం, మరియు దెబ్బ తీవ్రత మీద ఈ సమయం ఆధారపడి ఉంటుంది.

ఫ్రాక్చర్ పూర్తిస్థాయిలో నయం అవడానికి అధికమైన సమయం తీసుకోవడం అనేది అరుదుగా ఉంటుంది. కానీ అనేక అధ్యయనాల ప్రకారం, ఎక్కువగా ధూమపానం చేసే వారిలో ఇటువంటి పరిస్థితి ఎక్కువగా నెలకొంటుందని తేల్చాయి.

12. ఎముకను సంగ్రహించి

12. ఎముకను సంగ్రహించి

ధూమపానం చేసేవారిలో ఎముక ఏర్పడడంలో రక్త నాళాల పెరుగుదల ఆలస్యం కావచ్చు. అటువంటి సందర్భాలలో, వైద్యులు శరీరంలోని ఇతర భాగాల నుండి లేదా దాత నుండి ఎముకను సంగ్రహించి, ఎముకను సరిచేయడానికి శస్త్రచికిత్సా విధానాలను చేపట్టవచ్చు.

సాధారణంగా, ఎముకల పునరుత్పత్తి వాటి అద్భుతమైన సామర్థ్యంగా పిలవబడుతుంది. క్రమంగా తక్కువ సమయంలోనే విరిగిన ఎముక తిరిగి యధాస్థితి లోనికి వచ్చే ప్రయత్నం చేస్తుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

What Happens In Your Body When A Bone Breaks?

Just the idea of a bone breaking in your body can give you a jittery feeling. No one likes to fracture a bone but it is quite a common occurrence and is set to take its own due course to get healed. Let's look into the events that occur when a bone breaks and how it takes the path towards healing.
Story first published: Friday, September 28, 2018, 11:30 [IST]