Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
వెజీనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ గురించి మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు
వెజీనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ గురించి మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు
శరీరంలో నివసించే అనేక రకాల బాక్టీరియా ప్రభావం గట్ హెల్త్ పై ఉంటుంది. జీర్ణక్రియలో ఈస్ట్ లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శరీరంలోని ఈస్ట్ తగిన మోతాదులో ఉన్నప్పుడు ఇమ్మ్యూన్ సిస్టమ్ పనితీరు మెరుగవుతుంది. కానీ, ఈస్ట్ ల వృద్ధి నియంత్రణలేనట్లుగా ఉంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్ కి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ ఆర్టికల్ లో వెజీనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి చర్చించుకుందాం.
వెజీనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి?
క్యాండిడా అనే ఈస్ట్ ఓవర్ గ్రోత్ వలన ఈస్ట్ ఇన్ఫెక్షన్ సమస్య ఎదురవుతుంది. చర్మంపై నివసించే ఫంగస్ అలాగే శరీరంలోపల అంటే నోరు, గొంతు, గట్ మరియు వెజీనాలో నివసించే ఫంగస్ ఆరోగ్యంపై సాధారణంగా దుష్ప్రభావం చూపకపోవచ్చు. అయితే, ఇవి నియంత్రణ లేకుండా వృద్ధి చెందుతున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ కి దారితీస్తాయి.

క్యాండిడా స్పెసీస్ అనేవి దాదాపు 150 ఉన్నాయని అంచనా. వాటిలో కేవలం 15 మాత్రమే ఇన్ఫెక్షన్స్ కి కారణమవుతాయి. క్యాండిదా అల్బికన్స్, సి. గ్లాబ్రాట్రా, సి. పారాప్సిలోసిస్, సి. ట్రాపికల్స్ మరియు సి. క్రుసేయ్ వంటివి ఈ కోవలోకే వస్తాయి.

వెజీనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ కి దారితీసే కారణాలేంటి?
ఒత్తిడి, నిద్రలేమితో పాటు కొన్ని రకాల మెడికేషన్స్ వలన అలాగే హెచ్ ఐ వీ, డయాబెటీస్ మరియు ఒబెసిటీ వలన శరీరంలోని మైక్రో ఆర్గానిజమ్స్ బాలన్స్ అనేది భంగమైనప్పుడు ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది తలెత్తుతుంది.
కొన్ని రకాల లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ను అవుట్ ఆఫ్ బాలన్స్ చేస్తాయి. షుగర్ ఎక్కువగా ఉన్న డైట్ ను తీసుకోవడం, అం సేన్టేడ్ సోప్స్ ను ఉపయోగించడం, బబిల్ బాత్స్, డౌచింగ్ , వెజీనల్ హైజీన్ ని సరిగ్గా పాటించకపోవడం, సింథెటిక్ అండర్ వేర్ ని వాడటంతో పాటు కొన్ని రకాల కాంట్రాసెప్టివ్స్ వంటివి అటువంటి కొన్ని లైఫ్ స్టయిల్ హ్యాబిట్స్.

వెజీనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన లక్షణాలు?
వెజీనల్ ఏరియా అలాగే వాల్వా ప్రాంతంలో దురద
వాల్వా వాపు
వెజీనల్ ఏరియాలో మంట
గ్రీనిష్ లేదా ఎల్లోయిష్ డిస్చార్జ్
వాల్వర్ ర్యాష్
సంభోగం సమయంలో నొప్పి
మూత్ర విసర్జన సమయంలో మంట

వెజీనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ ని డయాగ్నోస్ చేయడమెలా?
మొదటగా మీ డాక్టర్ మీ సమస్యకు సంబంధించిన లక్షణాల గురించి అలాగే మెడికల్ హిస్టరీని తెలుసుకుంటారు. అందులో గతంలోని వెజీనల్ ఇన్ఫెక్షన్స్ గురించి అలాగే లైంగికంగా సంక్రమించిన వ్యాధుల గురించి ప్రస్తావన ఉంటుంది. ఆ తరువాత పెల్విక్ ఎగ్జామినేషన్ ని చేసి రెడ్ నెస్, డిస్చార్జ్, దుర్వాసనతో పాటు వాపును గమనిస్తారు. అలాగే వాల్వా స్కిన్ పై క్రాక్స్ ను మరియు ఇన్ఫెక్షన్ కి సంబంధించిన బయటి లక్షణాను గమనిస్తారు.
వెజీనల్ వెట్ మౌంట్ టెస్ట్ ద్వారా ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను డయాగ్నోస్ చేస్తారు.
వెజీనల్ వెట్ మౌంట్ టెస్ట్ లో భాగంగా వెజీనల్ డిశ్చార్జ్ శాంపిల్ ను సాల్ట్ సొల్యూషన్ లో కలుపుతారు. ఆ తరువాత మైక్రోస్కోప్ తో మార్పును గమనిస్తారు. వైట్ లంపీ డిశ్చార్జ్ అనేది వెజీనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను సూచిస్తుంది.
అలాగే, వెజీనల్ డిశ్చార్జ్ పై పొటాషియం హైడ్రాక్సయిడ్ అనే సొల్యూషన్ ని ఉపయోగించి కెఓహెచ్ స్లైడ్ టెస్ట్ ను కూడా నిర్వహిస్తారు. ఈ సొల్యూషన్ బాక్టీరియాను అలాగే వెజీనల్ సెల్స్ ను హరిస్తుంది. ఫంగస్ ని మాత్రం వదిలేస్తుంది. ఈ రకమైన ఫంగస్ అనేది ఇన్ఫెక్షన్ కు దారితీయబడేది. ఫంగస్ ను గుర్తించిన తరువాత తగిన ట్రీట్మెంట్ ను కొనసాగిస్తారు.

వెజీనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను ట్రీట్ చేసే విధానం
ఇన్ఫెక్షన్ కి దారితీసిన కారణం బట్టి ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. యాంటీ ఫంగల్ పిల్స్ ను, యాంటీ బయాటిక్స్ మరియు వెజీనల్ సపోర్టర్స్ లేదా క్రీమ్స్ ను వైద్యులు సిఫార్సు చేయవచ్చు. మైకోనజోల్, టియోకోనాజోల్, బూటోకోనాజోల్ మరియు క్లోట్రీమజోల్ వంటి వెజీనల్ సపోజిటరీస్ మరియు క్రీమ్స్ ని వాడి ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ను ట్రీట్ చేస్తారు.
మీరు గర్భిణీ అయితే, ఈ మెడికేషన్స్ ని వాడే ముందు తప్పనిసరిగా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి.
వెజీనల్ ఇన్ఫెక్షన్ సివియర్ గా ఉన్నట్టయితే, ఫ్లూకోనజోల్ మరియు ఇట్రాకోనజోల్ వంటి యాంటీ ఫంగల్ మెడిసిన్స్ ను ఓరల్ గా తీసుకోవాలి. ఈ డ్రగ్స్ ద్వారా క్యూర్ రేట్ 80శాతం ఉండవచ్చు. అయినా, ఈ మెడికేషన్స్ ను ఎక్కువగా తీసుకుంటే లివర్ ప్రాబ్లెమ్స్ తలెత్తే ప్రమాదం ఉంది.
వెజీనల్ ఇన్ఫెక్షన్ సివియర్ గా లేనప్పుడు, నిస్టాటిన్, మైకోనజోల్, క్లొట్రైమజోల్ వంటి వాటిని తీసుకోవచ్చు.

వెజీనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ వలన తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి?
ఈస్ట్ ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడే గర్భిణీలు ప్రీ టర్మ్ లేబర్ ని ఎక్స్పీరియెన్స్ చేసే ప్రమాదం ఉంది. ప్రేటెర్మ్ రప్చర్ తో పాటు ఇతర సమస్యలు కూడా తలెత్తవచ్చు.
కొన్ని రకాల క్యాండీడా సమస్యలకు చికిత్సనందించకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. వెజీనల్ త్రష్ ఆ కోవలోకే వస్తుంది. ఇది ప్రాణాపాయ ఇన్ఫెక్షన్స్ కి దారితీయవచ్చు.
అలాగే, ఈస్ట్ అనేది రాను రాను బ్లడ్ స్ట్రీమ్ లోకి చొచ్చుకుని పోయి లంగ్స్, హార్ట్ వాల్వ్స్ మరియు లివర్ లోకి చేరుకొని ప్రాణాపాయ స్థితిని కలిగించవచ్చు. ఇది మెనింగిటిస్, ఏసోఫాగిటిస్ మరియు ఎండోఫ్తాల్మిటీస్ వంటి ఇన్ఫెక్షన్స్ ని కలిగించవచ్చు.
ఇతర సందర్భాలలో క్యాండిడా అనే ఈస్ట్ బ్లడ్ స్ట్రీమ్ ను ఇన్ఫెక్ట్ చేస్తుంది. దీన్ని కాండిడేమియా అనంటారు.

వెజీనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ని అరికట్టడమెలా?
కాటన్ అండర్ వేర్ నే ధరించండి. టైట్ ఫిట్టింగ్ అండర్ వేర్స్ వాడకాన్ని నిరోధించండి.
స్విమ్మింగ్ కి వెళ్ళినట్లైతే, తడిగా అలాగే తేమగా ఉన్న అండర్ వేర్స్ ను వెంటనే మార్చుకోండి. లేదంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది.
హాట్ బాత్స్ కి దూరంగా ఉండండి.
యాంటీ బయాటిక్స్ ని ఎక్కువగా వాడడం తగ్గించుకోండి. లేదంటే వెజీనాలోని హెల్తీ బాక్టీరియా అనేది డిస్టర్బ్ అవుతుంది.
డౌచింగ్ ను అవాయిడ్ చేయండి. బేకింగ్ సోడా లేదా వినేగార్ వంటి పదార్థాలతో వెజీనాను క్లీన్ చేయడం లేదా రిన్స్ చేసే డౌచ్ ప్రక్రియకు దూరంగా ఉండండి. ఇది వెజీనాలోని పీహెచ్ బాలన్స్ పై ప్రభావం చూపుతుంది.



Click it and Unblock the Notifications











