Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
శృంగారం చేస్తున్నంత సేపు హాయిగా ఉంటుంది కానీ అయిపోయాక నొప్పితో అల్లాడిపోతున్నా, ఏం చెయ్యమంటారు
నా వయస్సు 32 ఏళ్లు. మా ఆవిడతో నేను రోజూ రాత్రి అందులో పాల్గొంటూ ఉంటాను. శృంగారం చేస్తున్నంత సేపు నాకు చాలా హాయిగా ఉంటుంది. మంచి సంతృప్తి కలుగుతుంది. నా భార్య కూడా నాకు బాగా సహకరిస్తుంది. అయితే సెక్స్
ప్రశ్న : నా వయస్సు 32 ఏళ్లు. మా ఆవిడతో నేను రోజూ రాత్రి అందులో పాల్గొంటూ ఉంటాను. శృంగారం చేస్తున్నంత సేపు నాకు చాలా హాయిగా ఉంటుంది. మంచి సంతృప్తి కలుగుతుంది. నా భార్య కూడా నాకు బాగా సహకరిస్తుంది. అయితే సెక్స్ పూర్తయ్యాక పురుషాంగంలో భరించలేనంత నొప్పి ఏర్పడుతూ ఉంటుంది.
మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు ఆ నొప్పి మరింత ఎక్కువవుతుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు.
మా ఫ్రెండ్స్ ని అడిగితే సెక్స్ కు ముందు మూత్ర విసర్జన చేస్తే అలాంటి నొప్పి ఉండదంటున్నారు. అలా కూడా చేసి చూశాను. అంగంలో నొప్పి ఏర్పడుతూ ఉంది. అసలు ఈ నొప్పి ఎందుకొస్తుంది. దీనికి పరిష్కార మార్గం ఏమిటో చెప్పండి?

బాధ గురించి ఎవ్వరికీ చెప్పుకోలేరు
సమాధానం : సాధారణంగా యువకులు ఇలాంటి సమస్యకు గురవుతుంటారు. శృంగారం పూర్తయిన వెంటనే పురుషాంగంలో నొప్పి ఏర్పడి అల్లాడిపోతుంటారు. ఆ బాధ గురించి ఎవ్వరికీ చెప్పుకోలేరు. ఇంటర్ కోర్స్ పూర్తయిన తర్వాత మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు కూడా నొప్పితో బాధపడిపోతుంటారు.

అక్కడే నొప్పి
పురుషాంగం ప్రారంభంలో పూర్వ చర్మాన్ని వెనక్కి అంటే తలలాగా కనిపించే భాగాన్ని షాఫ్ట్ అంటారు. సాధారణంగా చాలా మందికి అక్కడ నొప్పి ఏర్పడుతూ ఉంటుంది. వీర్యం, మూత్రం అక్కడ ఉండే రంధ్రం నుంచే బయటకు వస్తాయి.

అవన్నీ బాగా సాగడం వల్లే
అంగం స్తంభించినప్పుడు అందులోని కండరాలు, నరాలన్నీ కూడా రక్తంతో నిండిపోతాయి. అవన్నీ బాగా సాగడం వల్లే అంగం గట్టిగా పొడవుగా లావుగా మారుతుంది. అయితే అలెర్జీ లేదా ఇన్‌ఫెక్షన్ వల్ల అప్పుడప్పడు ఆ కండరాల్లో నొప్పి ఏర్పడుతుంది.

నొప్పి రావడానికి ప్రధాన కారణం
అయితే వీర్యస్కలనం తర్వాత పురుషాంగంలో నొప్పి రావడానికి ప్రధాన కారణం ప్రోస్టా టైటిస్. ప్రోస్టేట్ అనే గ్రంథి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అందులో ఏదైనా అలర్జీ ఏర్పడితే ఇలాంటి సమస్యతో ఇబ్బందిపడతారు. మూత్రం చేస్తున్నప్పుడు మంట ఏర్పడుతుంది.

ఆండ్రాలజిస్ట్ ని కలవండి
మీరు వెంటనే యూరాలజిస్ట్ ను సంప్రదించండి. కొన్ని రోజుల పాటు చికిత్స మీకు అవసరం. దీన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆండ్రాలజిస్ట్ ని కూడా కలవండి.



Click it and Unblock the Notifications
