Latest Updates
-
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా!
పురుషాంగం సమస్యలపై వచ్చే సందేహాలివే, లావు, పొడవుగా కావాలంటే ఏం చెయ్యాలి, ఎక్కువ సేపు చెయ్యాలంటే?
చాలా మంది యువకులు ఆ మూవీలు చూసి పురుషాంగం పెంచుకోవాలనుకుంటారు. వాస్తవానికి పురుషాంగం చాలా పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. అంగస్తంభన బాగుండి, వీర్యం స్కలిస్తే చాలు. అయితే రోజూ వ్యాయామాలు చేస్తున్నట్లయిత
మగవారికి అంగానికి సంబంధించి చాలా సందేహాలు అనుమానాలుంటాయి. వాటిని ఎవరిని అడగాలో కూడా అర్థం కాదు. ఎవరికీ తెలియకుండా ఆ డౌట్స్ క్లారిఫై చేసుకునేందుకు కొన్నిరకాల వీడియోలు చూస్తుంటారు. కొన్ని రకాల సైట్స్ చూస్తుంటారు. అయినా కూడా వారి అనుమానాలు పోవు. అయితే
డాక్టర్ కోక్ అనే సెక్సాలజిస్ట్ కు కొన్ని వేలమంది పురుషులు రోజూ పురుషాంగం, సెక్స్ కు సంబంధించిన ప్రశ్నలు మెయిల్ చేస్తున్నారు. ఆయన తరుచుగా చాలా మందికి సమాధానాలు ఇస్తూనే ఉంటారు.
డాక్టర్ ఎటిఎన్నే కోక్ ప్రిటోరియా విశ్వవిద్యాలయం , స్టీవ్ బికో అకాడెమిక్ ఆసుపత్రిలో ఒక సీనియర్ వైద్యుడు. ఈయన సెక్సాలజిస్ట్ అలాగే సీనియర్ లెక్చరర్. ఈయన్ని కొందరు పురుషులు అడిగిన ప్రశ్నల్లో కొన్నింటిని ఇక్కడ మేము ఇస్తున్నాం. వాటికి సమాధానాలు కూడా ఇస్తున్నాం.

శీఘ్ర స్ఖలనాన్ని నేను ఎలా నియంత్రించుకోవాలి?
చాలా మంది శీఘ్ర స్కలనం సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. దీని వల్ల యోనిలో పురుషాంగం పెట్టి పెట్టగానే వీర్యం కారిపోతుంది. దీంతో చాలా నిరుత్సాహానికి గురవుతారు. అయితే ఎక్కువగా ఒత్తిడికిలోనయ్యే వారు, ఎక్కువగా నిరాశకు గురయ్యేవారు ఫ్రస్టేషన్ కు గురయ్యేవారే ఇలాంటి సమస్య బారిన పడతారని డాక్టర్ కోక్ చెప్పారు. వాటికి దూరంగా ఉంటే మీ సమస్య దాదాపుగా పోతుంది.

త్వరగా స్కలిస్తే
2-5 నిమిషాల్లోనే స్కలిస్తే వారు శీఘ్ర వీర్య స్కలనం సమస్యతో ఇబ్బందిపడుతున్నారని అర్థం. అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుంటే జీవితాంతం ఇబ్బందులుపడతారు. అయితే ఎక్కువగా టెంప్ట్ కాకుండా నిదానంగా సెక్స్ చేస్తుంటే నెమ్మదిగా ఈ సమస్య పోతుంది.

నా టెస్టోస్టెరాన్ లెవెల్స్ ను ఎలా పెంచుకోవాలి ?
టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే సెక్స్ లో బాగా పాల్గొనవచ్చు. దాని పెంచడానికి చాలా సహజ మార్గాలు ఉన్నాయని డాక్టర్ కోక్ చెప్పారు. సాధారణంగా స్టెరాయిడ్లు, మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డవారిలో ఎక్కువగా టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. అందువల్ల వాటికి దూరంగా ఉండండి. అలాగే మధుమేహంతో బాధపడే వారు కూడా టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గుతుంది.

వీర్యం నాణ్యత పెరగాలంటే
వీర్యం నాణ్యత పెరగాలంటే మీరు మంచి ఆహారాలు తింటూ ఉండండి. వాస్తవానికి ప్రతి ఒక్కరి వీర్యం నాణ్యతగా ఉంటుంది. ఎక్కువగా మాదక ద్రవ్యాలు వినియోగించేవారిది తప్ప మిగతా వారందరిదీ వీర్యం నాణ్యతగా ఉంటుంది.

ఎంత సేపు నా అంగం గట్టిగా ఉంటుంది ?
"చాలా మంది నన్ను అడిగిన ఒక ప్రశ్న నా అంగం సేపు ఎంత సేపు గట్టిగా ఉంటుంది "అని డాక్టర్ కోక్ చెప్పారు. అది ఆ వ్యక్తి స్టామినాపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది వృద్ధుల్లో కూడా అంగం గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది. కొంత మంది యువకులకు అంత స్టామినా ఉండకపోవొచ్చు. అది వారు తీసుకునే మంచి ఆహారం వ్యాయామాలపై ఆధారపడి ఉంటుంది.

పురుషాంగం పరిమాణం పెంచడానికి సహజ మార్గాలు ఏమైనా ఉన్నాయా?
చాలా మంది యువకులు ఆ మూవీలు చూసి పురుషాంగం పెంచుకోవాలనుకుంటారు. వాస్తవానికి పురుషాంగం చాలా పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. అంగస్తంభన బాగుండి, వీర్యం స్కలిస్తే చాలు. అయితే రోజూ వ్యాయామాలు చేస్తున్నట్లయితే మీరు ఒత్తిళ్లకు లోనుకాకుండా ఉంటారు. మీ పురుషాంగానికి సెక్స్ చేసే సమయంలో ఎక్కువగా రక్త ప్రసరణ మెరుగై బాగా లావుగా అవుతుంది. అంతేకానీ పురుషాంగం పరిమాణం పెంచడానికి ఎలాంటి సహజ మార్గాలు లేవు.

పురుషాంగం పెద్దగా స్తంభించాలంటే శస్త్రచికిత్సా విధానాలు ఉన్నాయా?
పురుషాంగం లావుగా మారాలంటే బాగా స్తంభించాలంటే ఏం చెయ్యాలని చాలా మంది అడుగుతుంటారు. అందుకు ఎలాంటి శస్త్ర చికిత్స విధానాలు లేవు. ఉన్నా చేయించుకోకూడదు. సెక్స్ చేసేటప్పుడు పురుషాంగా నిటారుగా ఉంటే చాలు. సాధారణంగా ఏ అమ్మాయి కూడా బాగా లావుగా ఉండే పురుషాంగాన్ని కోరుకోదు. ప్రేమగా మీరు ఆమెతో సెక్స్ చేస్తే చాలు అనుకుంటుంది.

శిశ్నం దగ్గర చిన్నపాటి తెల్ల గుల్లలను ఎలా తొలగించుకోవాలి ?
చాలా మంది పురుషాంగం మొదల్లో శిశ్నం దగ్గర తెల్లటి సన్నటి గుల్లల్ని చూసి భయపడుతుంటారు. దానివల్ల ఏమీ కాదు. అదేమీ సమస్య కాదు. కావాలనుకుంటే CO2 లేజర్ చికిత్సతతో తొలగించుకోవొచ్చు.

వెయిట్ లిఫ్టింగ్, సప్లిమెంట్స్ వాడితే పురుషాంగం పరిమాణం పెరుగుతుందా?
వెయిట్ లిఫ్టింగ్, సప్లిమెంట్స్ వాడితే పురుషాంగం సైజ్ పెరుగుతుందని అనుకుంటారు.కానీ అది అపోహ.

ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత రెండోసారి చేయలేకపోతున్నా?
డాక్టర్ కోక్ కు ఇలాంటి ప్రశ్నను చాలా మంది అడిగారు. అయితే ఎంతటి మగాడైనా ఫస్ట్ రౌండ్ సెక్స్ లో పాల్గొన్న తర్వాత మళ్లీ వెంటనే పాల్గొనాలంటే పాల్గొనలేడు. కాస్త టైమ్ అవసరం. కొంతసేపు విశ్రాంతి తీసుకుంటే మళ్లీ పాల్గొనవచ్చు. అయితే ఆడవారు ఒకసారి సంత్రుప్తి చెందినా మళ్లీ వెంటనే సెక్స్ కు రెడీ కాగలరు. కానీ మగవారు అలా కాదు.

సెక్స్ అయిపోయినా కూడా అంగం గట్టిగానే ఉంటుంది. ఏమి చెయ్యాలి?
కొందరికి వీర్య స్కలనం అయినా కూడా అంగం గట్టిగా ఉండొచ్చు. అయితే ఒత్తిడికి గురయ్యేవారు ఎక్కువగా ఇలాంటి సమస్య బారిపడే అవకాశం ఉంది. అంగస్తంభన ఎక్కువగా ఉండడం కూడా సమస్యే.



Click it and Unblock the Notifications
