Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
రోజూ హస్త ప్రయోగం చేసుకుని వీర్యాన్ని స్కలిస్తే వచ్చే ప్రయోజనాలు తెలుసా? బోలెడన్నీ ఉన్నాయి
చాలా మందికి రోజూ హస్త ప్రయోగం చేసుకోవడం అలవాటుగా ఉండొచ్చు. అయితే రోజూ అలా వీర్యాన్ని స్కలిస్తే ఏమవుతుందనే విషయంపై చాలా మందికి చాలా రకాలు అనుమానాలు, అపోహలు ఉంటాయి. హస్త ప్రయోగం చేసుకోవడం తప్పేమీ కాదు.
చాలా మందికి రోజూ హస్త ప్రయోగం చేసుకోవడం అలవాటుగా ఉండొచ్చు. అయితే రోజూ అలా వీర్యాన్ని స్కలిస్తే ఏమవుతుందనే విషయంపై చాలా మందికి చాలా రకాలు అనుమానాలు, అపోహలు ఉంటాయి. హస్త ప్రయోగం చేసుకోవడం తప్పేమీ కాదు. ఎక్కువగా యువత రోజూ హస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటారు. 14 నుంచి17 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారిలో (సుమారు 74% మంది అబ్బాయి, 48% అమ్మాయిలు) ప్రతి రోజూ హస్తప్రయోగం చేసుకుంటున్నారని కొన్ని పరిశోధనల్లో తేలింది.
అలాగే 57 నుంచి 64 సంవత్సరాల మధ్య ఉన్నవారిలో 63% పురుషులు, 32% మంది మహిళలు రోజూ హస్తప్రయోగం చేసుకుంటున్నారని కొన్ని సర్వేల్లో తేలింది. . కొందరు సెక్స్ లో పాల్గొంటున్నా కూడా అందులో సరైన సంత్రుప్తి దక్కకపోవడం వల్ల హస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటారు.

హస్తప్రయోగంపై అపోహలు
హస్తప్రయోగంపై అందరికీ చాలా అపోహలుంటాయి. రోజూ హస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటే అంగస్తంభన సమస్యలతో పాటు పురుషాంగం వంకరంగా మారుతుందని కొందరి అపోహ. అలాగే చాలా రకాల అనారోగ్యాలకు గురవుతామని కొందరు నమ్ముతారు.

వీర్యం తగ్గిపోతుంది
అలాగే ఎక్కువగా హస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటే వీర్యం తగ్గిపోతుందని కొందరు అనుకుంటూ ఉంటారు. వంధ్యత్వం కూడా వచ్చే అవకాశం ఉంది అనుకుంటూ ఉంటారు. అలాగే ఆడవారు కూడా తాము రోజూ హస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటే చాలా ఇబ్బందులకు గురవుతామని భయపడుతుంటారు.

రోజూ హస్త ప్రయోగం చేసుకుంటే వచ్చే ప్రయోజనాలు
రోజు హస్త ప్రయోగం చేసుకుంటే బాగా సంత్రుప్తి చెందడంతో పాటు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఆడవారు రోజూ హస్తప్రయోగం చేసుకుంటూ ఉంటే యోనికి సంబంధించి చాలా సమస్యలు తగ్గిపోతాయి. రోజూ హస్తప్రయోగం చేసుకునే అమ్మాయిలకు సెక్స్ సమయంలో పెద్దగా నొప్పి ఉండదు. హస్తప్రయోగం చేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. ఆందోళనలు తగ్గుతాయి. అలాగే అమ్మాయిలకు యోని పొడిగా ఉండకుండా ద్రవాలు ఊరుతాయి.

ఒత్తిడికి గురి కాకుండా
చాలా మంది హస్త ప్రయోగం విషయంలో చాలా ఇబ్బందులుపడుతుంటారు. దాన్ని చాలా రహస్యంగా చేసుకోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. అది చేసుకునేటప్పుడు ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా చేసుకోండి. అలాగే చేసుకుంటే మానసికంగా మీరు ఎలాంటి సమస్యలకు గురికాకుండా ఉంటారు.
అయితే ఏదైనా సరే లిమిట్ దాటకుండా ఉండాలి. మితిమీరిన హస్తప్రయోగం కూడా మంచిది కాదు.



Click it and Unblock the Notifications
