For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్తమాకు చికిత్స చేయకపోతే ప్రాణానికి ప్రమాదం! దీన్ని నివారించడానికి హోం రెమెడీస్ ఉన్నాయి

|

ఆస్తమా లేదా ఉబ్బసం అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధి మరియు శ్వాసకోశ వ్యాధి. దీనివల్ల శ్వాసలోపం, ఛాతీ నొప్పి, ఊపిరి తీసుకోవడం ఇబ్బందలు మరియు దగ్గు వస్తుంది. ఈ పరిస్థితి అన్ని వయసులవారిలో ఉండవచ్చు. అయితే ఇది చిన్నతనంలోనే రావచ్చు. ఉబ్బసం లేదా ఆస్తమాను పూర్తిగా నివారించడానికి సాధ్యపడదు.

కానీ కొన్నింటిని చికిత్స మరియు ఔషధం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. కొన్నిసార్లు ఉబ్బసం యొక్క లక్షణాలు తేలికపాటివి మరియు చిన్నపాటి చికిత్సతో తగ్గిపోవచ్చు. ప్రారంభంలోనే ఆస్తమాకు చికిత్స చేయాలి మరియు దాని లక్షణాలు తీవ్రంగా ఉంటే ఆస్తమా ప్రమాదకరంగా మారుతుంది. దీనికి అత్యవసర సంరక్షణ మరియు చికిత్స అవసరం. ఉబ్బసం లేదా ఆస్తమాకు వెంటనే చికిత్స చేయకపోతే ఇక్కడ కొన్ని సాధారణ ప్రమాదాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి ...

నిద్రలేమి సమస్య

నిద్రలేమి సమస్య

ఉబ్బసం ఉన్నవారు రాత్రిపూట దగ్గుతారు, ముఖ్యంగా. ఇది నిద్రలేమికి కారణమవుతుంది. నిద్రలేమి కారణంగా, మీరు కార్యాలయంలో లేదా పాఠశాలలో సరిగ్గా పనిచేయలేరు లేదా నేర్చుకోలేరు. యంత్రాలతో పని చేసి వారు మరియు డ్రైవింగ్ చేసే వారికి ఇది చాలా ప్రమాదకరం.

శారీరక శ్రమ

శారీరక శ్రమ

ఉబ్బసం లేదా ఆస్తమా ఉన్న కొందరు వ్యాయామం మరియు క్రీడలలో పాల్గొనలేకపోవచ్చు. వ్యాయామం లేకపోవడం వల్ల కొందరిలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మరియు మానసిక నిరాశ లేదా బరువు పెరగడం వంటి కొన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

ఉత్పాదకత

ఉత్పాదకత

తరచుగా ఉబ్బసం లక్షణాల కారణంగా పాఠశాల లేదా కార్యాలయాలకు హాజరు కావడం తరచుగా తగ్గుతుంది. పిల్లలు స్కూల్ కు వెళ్ళకుండా సెలవు తీసుకోవడానికి ఆస్తమా ఒక ప్రధాన కారణం.

ఎయిర్‌వే (గాలిప్రసరించే మార్గం) పునర్నిర్మాణం

ఎయిర్‌వే (గాలిప్రసరించే మార్గం) పునర్నిర్మాణం

కొంతమందిలో, ఉబ్బసం లేక ఆస్తమా అనేది దీర్ఘకాలం ఉంటే అది వాయుమార్గం వాపుకు గురిచేస్తుంది. సరిగ్గా చికిత్స చేయకపోతే, ఇది వాయుమార్గాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తుంది. ఇది వాయుమార్గ కణాలు మరియు కణజాలాలలో మార్పులకు కారణమవుతుంది. ఈ మార్పు ఊపిరితిత్తులు విఫలం కావడానికి మరియు కొన్నిసార్లు దీర్ఘకాలిక దగ్గుకు కారణమవుతుంది.

మరణం

మరణం

తీవ్రమైన ఉబ్బసం వాయుమార్గాన్ని అడ్డుకుంటుంది. ఇది ఊపిరితిత్తుల వైఫల్యానికి దారితీస్తుంది మరియు చికిత్స చేయకపోతే మరణానికి దారితీస్తుంది. ఉబ్బసం నుండి ఉపశమనం లేదా నియంత్రణకు ఉపయోగపడే మూలికలు మరియు ఆయుర్వేద ఔషధాల గురించి ఇక్కడ పొందుపరచడం జరిగింది. వాటి గురించి తెలుసుకోండి..

తేనె

తేనె

సహజంగా లభించే తేనెలో యాంటీ బాక్టీరియల్, మంట, వాపును తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఉబ్బసం ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియాను నివారిస్తుంది మరియు ఇందులో ఉండే రోగ నిరోధక లక్షణాలు మంటను తగ్గించి ఆస్తమాను తగ్గిస్తుంది.

పసుపు

పసుపు

పసుపు అనేక రకాల చిన్న చిన్న రోగాలను నయం చేస్తుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన పసుపు ఉబ్బసం నివారణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

డ్రై ఫ్రూట్స్ తినండి

డ్రై ఫ్రూట్స్ తినండి

విత్తనాలలో మెగ్నీషియం మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇది ఉబ్బసం బాధితులకు సరైన అల్పాహారం. మెగ్నీషియం ఉబ్బసంను తగ్గిస్తుంది. విటమిన్ ఇ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శ్వాసనాళాల్లో మంట మరియు శ్వాసనాళ నష్టాన్ని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను సమర్థవంతంగా తగ్గిస్తుంది.

మొలకలు

మొలకలు

మొలకల్లో లేదా చిక్కుళ్ళలో తక్కువ కేలరీలు మరియు కొవ్వు తక్కువగా ఉండటం వల్ల, ఉబ్బసం ఉన్న రోగులకు ఇది చాలా ప్రభావవంతమైన ఆహారం. మొలకల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల శరీరంలో కొవ్వు, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. ఇది బాహ్య పదార్థాలు రాకుండా ఊపిరితిత్తుల్లో చేరకుండా ఇన్ఫెక్షన్లకు గురికాకుండా చేస్తుంది. మొలకల్లో కొవ్వు కరిగించే కణాలు ఉబ్బసం వల్ల వచ్చే జలుబు మరియు ఫ్లూని నివారిస్తాయి.

మామిడి ఆకులు

మామిడి ఆకులు

కొన్ని మామిడి ఆకులను నీటిలో వేసి ఉడకబెట్టండి. ఉదయం ఈ నీటిని వడపోసి త్రాగండి. ఈ నీరు సాయంత్రం సమయాల్లో త్రాగుతూ ఉండండి. మరో పద్ధతి ఏమిటంటే, మామిడి ఆకులను పూర్తిగా ఎడ్డబెట్టి, పొడి చేసి ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. అనారోగ్యం సమయంలో, ఈ పొడిని ఒక టేబుల్ స్పూన్ నీటితో కలిపి త్రాగాలి. ఇంకా మంచి పద్ధతి ఏమిటంటే, లేతగా ఉండే మామిడి ఆకులను బాగా కడిగి నోట్లో వేసుకుని నమలిలి మింగడం మంచిది.

ముల్లంగి-తేనె నిమ్మ

ముల్లంగి-తేనె నిమ్మ

ఒక కప్పు తురిమిన ముల్లంగి, ఒక చెంచా తేనె మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి. దీన్ని ప్రతిరోజూ ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే ఆస్తమా నుండి ఉపశమనం లభిస్తుంది.

మెంతులు

మెంతులు

మెంతులకు అలెర్జీని తగ్గించే శక్తి ఉంటుంది. మీరు వీటిని నీటిలో వేసి నానబెట్టి, దీనికి ఒక చెంచా తేనె మరియు అల్లం రసంలో కలిపి రోజుకు ఒకసారి తీసుకుంటే ఉబ్బసం తగ్గుతుంది.

పసుపు

పసుపు

పసుపు అనేక రకాల చిన్న రోగాలను నయం చేస్తుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన పసుపు ఉబ్బసం నివారణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ ఒక టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవడం ద్వారా ఉబ్బసం తగ్గించవచ్చు. పసుపును పాలలో కలిపి సేవించండి. దీన్ని నుండి తీవ్రమైన ఉబ్బసం నివారంచుకోవచ్చు.

English summary

Dangers of Untreated Asthma- Home remedies for this Disease

Asthma,a chronic lung disease related to inflammation and narrowing of airways,causes wheezing,chest tightness,shortness of breath and coughing. The condition affects people of all ages, but it usually starts during childhood. Although asthma has no cure, it can be easily managed with modern treatment and medicines.
Story first published:Monday, September 9, 2019, 16:06 [IST]
Desktop Bottom Promotion