Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
దక్షిణ కొరియాలో అరుదైన ఇన్ఫెక్షన్.. మెదడును తినే ఆ ఇన్ఫెక్షన్ ఎంత ప్రమాదకరం?
దక్షిణ కొరియాలో మెదడును తినే అమీబా ఇన్ఫెక్షన్‌ను అధికారులు గుర్తించారు. ఈ అమీబా ముక్కు ద్వారా మెదడు వరకు వెళ్లి కణజాలాన్ని నాశనం చేస్తుంది. అమెరికాలో ఇప్పటి వరకు 154 మందికి సోకగా కేవలం నలుగురు మాత్రమే బతికారు.
చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అక్కడ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న వైరస్‌తో ప్రపంచదేశాలన్నీ అప్రమత్తం అయ్యాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో వ్యాధి భయపెడుతోంది. ఇది అలాంటి ఇలాంటిది కాదు. ఏకంగా మెదడును తినేస్తుంది. ఈ అరుదైన ఇన్ఫెక్షన్‌ను దక్షిణ కొరియాలో గుర్తించారు. నెగ్లెరియా ఫౌలెరి గా ఈ వ్యాధిని పిలుస్తారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని కూడా అంటారు. ఈ ఇన్ఫెక్షన్ సోకి 50 ఏళ్ల వ్యక్తి ఒకరు దక్షిణ కొరియాలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇన్ఫెక్షన్ ఆయనకు థాయ్‌లాండ్‌లో సోకి ఉండవచ్చని దక్షిణ కొరియా అధికారులు భావిస్తున్నారు. మరణించిన ఆ వ్యక్తి 4 నెలల పాటు థాయ్‌లాండ్‌లో ఉండి డిసెంబర్ 10వ తేదీన దక్షిణ కొరియాకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మరుసటి రోజు నుండి ఆ వ్యక్తి తలనొప్పి, వాంతులు, నెక్ స్టిఫ్‌నెస్, మాటలు సరిగ్గా రాకపోవడం లాంటి లక్షణాలు కనిపించగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.

'మెదడును తినే అమీబా' ఏంటసలు?
అమీబాలు ఏక కణజీవులు. ఇవి చాలా చోట్ల ఉంటాయి. మట్టిలో, కాల్వల్లో, నదుల్లో, మురికి కాల్వల్లో చాలా చోట్ల కనిపిస్తాయి. అయితే నెగ్లెరియా అనే అమీబాలు మాత్రం మనుషులకు సోకుతుంది. నెగ్లెరియా ఫౌలెరి అనే అమీబా ముక్కు నుండి మనిషి శరీరంలోకి సోకుతుందని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది. ఈ అమీబా ముక్కు నుండి క్రమంగా మెదడుకు చేరుకుంటుంది. అక్కడ మెదడులోని కండరాలను, నరాలను దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితిని ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్‌సైఫలిటిస్(పీఎంఏ) ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తుంది. దీని వల్ల ప్రాణాలు కూడా పోవచ్చు.

'మెదడును తినే అమీబా' ఎలా సోకుతుందంటే..
నెగ్లెరియా ఫౌలెరి అనే అమీబా ముక్కు ద్వారా మనిషి ఒంట్లోకి ప్రవేశిస్తుంది. మెదడు వరకు ప్రయాణిస్తుంది. ఈత కొట్టినప్పుడు, నీటిలో దూకినప్పుడు, తలను నీటిలో ముంచినప్పుడు ముక్కులోకి నీరు వెళ్లినప్పుడు అమీబా సోకే అవకాశాలు ఉన్నాయి. కలుషిత నీటితో ముక్కును శుభ్రం చేసినప్పుడు కూడా ఈ అమీబా సోకవచ్చు.
నెగ్లెరియా ఫౌలెరీ మెదడు వరకు వెళ్లిన తర్వాత అక్కడి కణజాలాన్ని ఈ అమీబా నాశనం చేస్తుంది. దీని వల్ల ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్(పీఏఎం) అని పిలిచే ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తుంది.

'మెదడును తినే అమీబా' లక్షణాలు:
* అమీబా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత 1 నుండి 12 రోజుల్లోపు మొదటి దశ సంకేతాలు కనిపిస్తాయి.
* ప్రారంభ దశలో తలనొప్పి, వికారం, జ్వరం, మెనింజైటిస్ ఉంటాయి.
* తర్వాతి దశలో మెడ తిప్పలేకపోవడం, మూర్చ, భ్రాంతులు, కొంతమంది కోమాలోకి కూడా వెళ్లవచ్చు.
* లక్షణాలు తీవ్రమైన తర్వాత 5 రోజుల్లో ప్రాణాలు కోల్పోవచ్చని అమెరికా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ వెల్లడించింది.
* అమెరికా వ్యాప్తంగా 1962 నుండి 2021 వరకు 154 మందికి ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్(పీఏఎం) సోకగా అందులో కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.
* మెదడును తినే అమీబా సోకిన వ్యక్తి నుండి మరొక వ్యక్తి వ్యాప్తి చెందినట్లు శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు గుర్తించలేదు.

'మెదడును తినే అమీబా' చికిత్స:
నెగ్లెరియా ఫౌలెరి ఇన్ఫెక్షన్ చాలా అరుదు. త్వరగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి శాస్త్రవేత్తలు ఇంకా ఎటువంటి ప్రభావవంతమైన చికిత్సలను గుర్తించలేకపోయారు. ప్రస్తుతం, వైద్యులు యాంఫోటెరిసిన్ బి, అజిత్రోమైసిన్, ఫ్లూకోనజోల్, రిఫాంపిన్, మిల్టెఫోసిన్, డెక్సామెథసోన్ వంటి మందుల కలయికతో దీనికి చికిత్స చేస్తున్నారు.



Click it and Unblock the Notifications