Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
Ice Cream In Winter: చలికాలంలో ఐస్‌క్రీం తినొచ్చా?
చలికాలంలో ఐస్ క్రీం లాంటి చల్లని పదార్థాలు తినడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వస్తుందని హెచ్చరిస్తుంటారు తల్లిదండ్రులు. అయితే నిజంగా చలికాలంలో ఐస్ క్రీం తింటే జలుబు చేస్తుందా? చలికాలంలో పిల్లలకు ఐస్ క్రీం ఇవ్వొచ్చా.. ఇస్తే వ
Ice Crean In Winter: బయట చలి గజగజ లాడిస్తోంది. ఉదయం నిద్ర లేవాలనిపించడం లేదు. ముసుగు తన్ని పడుకోవాలనిపిస్తోంది. చల్లని వాతావరణంలో వేడి వేడిగా పకోడీలు, బజ్జీలు తినాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఈ చలికాలంలో ఐస్ క్రీం లాంటి చల్లని వస్తువులు తినొద్దని ఇంట్లో పెద్దలు చెబుతుంటారు.

చలికాలంలో ఐస్ క్రీం లాంటి చల్లని పదార్థాలు తినడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వస్తుందని హెచ్చరిస్తుంటారు తల్లిదండ్రులు. అయితే నిజంగా చలికాలంలో ఐస్ క్రీం తింటే జలుబు చేస్తుందా? చలికాలంలో పిల్లలకు ఐస్ క్రీం ఇవ్వొచ్చా.. ఇస్తే వారిలో జలుబు లాంటి సమస్యలు రావడం నిజమేనా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఐస్ క్రీములుపిల్లలకు ఇవ్వొద్దని వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో ఐస్ క్రీముల్లాంటివి తినడం వల్ల పిల్లల్లో జలుబు, దగ్గు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అయితే ఐస్‌క్రీం చల్లగా ఉండటం వల్ల జలుబు, దగ్గు వస్తాయన్నది నిజం కాదు. ఐస్‌క్రీంలో ఉండే చక్కెర వల్లే అనారోగ్యం పాలవుతారని వైద్యులు వెల్లడిస్తున్నారు.

ఐస్‌క్రీం తింటే ఏమవుతుంది?
ఐస్‌క్రీం జలుబు, ఫ్లూ, ఇన్‌ఫెక్షన్ వంటి లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. ఒకవేళ ఫ్లూ, జలుబు కలిగించే వైరస్ ఇప్పటికే శరీరంలోకి ప్రవేశించి ఉంటే ఐస్‌క్రీంలోని చక్కెర వైరస్‌ను ఉత్తేజపరుస్తుంది.
పాల ఉత్పత్తులు కఫాన్ని ఉత్పత్తి చేస్తాయి. కఫం పెరగడం వల్ల శ్లేష్మం చిక్కగా ఉంటుంి. అందువల్ల జలుబు, ఫ్లూ సమయంలో పిల్లల నాసికా మార్గాన్ని అడ్డుకుంటుంది. కపం ఉత్పత్తి కారణంగా సాయంత్రం, రాత్రి సమయాల్లో ఐస్‌క్రీములు ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవద్దు.
చలికాలంలో ఐస్‌క్రీం తినడం వల్ల శరీరం చల్లబడుతుంది కాబట్టి శీతాకాలంలో ఐస్‌క్రీం తీసుకోవడాన్ని వైద్యులు సిఫార్సు చేయరు. పిల్లలకు చలికాలంలో చల్లని పదార్థాలను నివారించాలని చెబుతుంటారు. పిల్లలు వైరస్, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా చల్లగా ఉండే వాతావరణంలో ఐస్‌క్రీం తినడం వల్ల ప్రత్యేకించి ఎలాంటి జబ్బులు రాకపోవచ్చు. కానీ చలికాలం మీ శరీరానికి వెచ్చగా ఉండే ఆహారం ఇవ్వాల్సిన సమయం.

పిల్లలకు ఈ ఐస్‌క్రీం ఇవ్వొచ్చు
పిల్లలకు ఐస్‌క్రీం ఇవ్వాలనుకుంటే అది మంచి నాణ్యమైన డైరీ ఉత్పత్తులు, ప్రోబయోటిక్స్‌తో తయారు చేసిందని నిర్ధారించుకోవాలి. అంటే ఇంట్లో తయారు చేసిన ఐస్‌క్రీమును పిల్లలకు నిరభ్యంతరంగా ఇవ్వొచ్చు.
ఐస్‌క్రీంతో పాటు దానికి పోషకాలను జోడించవచ్చు. పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి పోషకాహారాన్ని ఐస్‌క్రీంకు జోడించవచ్చు. దీని వల్ల పోషకాలు అందుతాయి.
ఖర్జూరం, ఎండుద్రాక్ష, బాదం, పిస్తా వంటి పదార్థాలను ఐస్‌క్రీంకు జోడించి పిల్లలకు ఇవ్వడం వల్ల చలికాలంలో శరీరం వెచ్చగా ఉంటుంది.
పిల్లలకు ఐస్‌క్రీంను దూరంగా ఉంచడం కాబట్టి ఆ ఐస్‌క్రీమును కూడా పోషకాహారంలా తయారు చేస్తే పిల్లల కోరికా తీరుతుంది.. అలాగే వారికి పోషకాలు అందించాలన్న తల్లిదండ్రులు కోరిక కూడా తీరుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications