For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెర్ఫ్యూమ్స్ ఎక్కువగా వాడుతున్నారా? శృంగార సమస్యలు తప్పవు!

|

Perfumes: పెర్ ఫ్యూమ్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లే సమయంలో కొందరు తప్పనిసరిగా పెర్ఫ్యూమ్స్ వాడుతుంటారు. పెర్ ఫ్యూమ్స్ వల్ల మనసు ఆహ్లాదంగా ఉంటుంది. దాని నుండి వచ్చే సువాసన మంచి భావనను కలిగిస్తుంది. పెర్ ఫ్యూమ్ ఆత్మవిశ్వాసాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. పెర్ఫ్యూమ్స్ లో చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కో రకమైన వాసన వస్తుంది. అందుకే వాటిని ఎంచుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కొందరికి గాఢంగా వాసన ఉండే పెర్ ఫ్యూమ్స్ అంటే ఇష్టం ఉంటుంది. మరికొందరికి లైట్ గా ఉండే వాటిని ఇష్టపడతారు.

పెర్ఫ్యూమ్స్ ఎలా ఎంచుకోవాలి?

పెర్ఫ్యూమ్స్ ఎలా ఎంచుకోవాలి?

పెర్ఫ్యూమ్స్ ఎంచుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. పెర్ఫ్యూమ్స్ వాసన బాగుండటంతో పాటు అది ఎక్కువ సమయం వచ్చేది అయి ఉండాలి. దాని గాఢత ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. శరీరతత్వం, వెళ్లే కార్యక్రమానికి తగ్గట్లుగా పెర్ ఫ్యూమ్ ఉండాలి.

ఎలాంటి పెర్ఫ్యూమ్స్ సెలక్ట్ చేసుకోవాలి?

ఎలాంటి పెర్ఫ్యూమ్స్ సెలక్ట్ చేసుకోవాలి?

1. సీజన్ ను బట్టి..

పెర్ఫ్యూమ్ ను సీజన్ బట్టి మార్చుకుంటుండాలి. వేసవి కాలంలో, చలికాలంలో ఒకే రకమైన గాఢత ఉన్న పెర్ఫ్యూమ్ వాడితో దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎండాకాలంలో చెమట పడుతుంది. చలికాలంలో అంతగా చెమట పట్టదు.

2. ఎలా ఎంచుకోవాలి?

2. ఎలా ఎంచుకోవాలి?

పెర్ఫ్యూమ్ ను కొనే ముందు దాని సువాసనను తనిఖీ చేయాలి. దాని గాఢత ఎంత ఉంది.. ఎంత సమయం వరకు సువాసన అలాగే ఉంటుంది అనేది చూడాలి. చేతులు, చిన్న కాగితం ముక్క, మణికట్టుపై స్ప్రై చేసి దాని వాసన చూడాలి. అలాగే ఎంతసేపు వస్తుందో గమనించాలి. చెమట ఎక్కువగా పట్టే వారు మంచి మన్నిక ఉన్న పెర్ఫ్యూమ్ ను ఎంచుకోవాలి.

3. గాఢత ఎంత ఉండాలి?

3. గాఢత ఎంత ఉండాలి?

పెర్ఫ్యూమ్ గాఢత మరీ ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. గాఢత ఎక్కువగా ఉంటే ఇతరులకు ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంతమందికి అంత గాఢత పడకపోవచ్చు కూడా. కాబట్టి గాఢత ఎంత ఉండాలనేది నిర్ధారించుకోవాలి. కొందరు గాఢత చాలా ఎక్కువగా ఉండే పెర్ఫ్యూమ్ వాడుతుంటారు. అలాంటి వాళ్లు అలా మన ముందు నుండి వెళ్లినా.. గుప్పుమని వాసన వచ్చేస్తుంది. మన వాడే పెర్ఫ్యూమ్ వల్ల ఎదుటివారికి చాలా బాగుంది అనిపించాలి, మనసుకు ఆహ్లాదంగా అనిపించాలి. కానీ, ఇదేం వాసన అని అనిపించకూడదు.

4. ఎక్కువ సమయం రావాలి

4. ఎక్కువ సమయం రావాలి

పెర్ఫ్యూమ్ స్ప్రే చేసిన సమయం నుండి ఎక్కువ సేపు దాని వాసన రావాలి. ఇలా కొట్టగానే ఓ 10 నిమిషాల తర్వాత ఎలాంటి వాసన రాకపోతే... అలాంటి పెర్ఫ్యూమ్ వాడినా ఒకటే.. వాడకపోయినా ఒకటేనని గమనించాలి.

5. మరీ ఎక్కువ వద్దు

5. మరీ ఎక్కువ వద్దు

కొందరు పెర్ఫ్యూమ్ ను చాలా ఎక్కువగా వాడుతుంటారు. ఎక్కువగా పెర్ఫ్యూమ్ వేసుకుంటే.. ఎక్కువ సేపు వస్తుందని అనుకుంటారు. కానీ దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. అంతే కానీ ఎక్కువ కొట్టుకుంటే ఎక్కువ సమయం పాటు వస్తుందన్నది అపోహే.

6. స్నానం చేశాకే వెంటనే..

6. స్నానం చేశాకే వెంటనే..

స్నానం చేసిన ఒంటిని తుడుచుకున్న తర్వాత వెంటనే పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోవాలి. తేమగా ఉన్నప్పుడే వాడటం వల్ల శరీరం బాగా పీల్చుకుంటుంది. శరీర రంధ్రాల్లోకి పెర్ఫ్యూమ్ వెళ్తుంది. అది ఎక్కువ సమయం పాటు ఉంటుంది. అలాగే ఎక్కువ వాసన వచ్చే సబ్బులను వాడి.. దాని తర్వాత పెర్ఫ్యూమ్ వాడితే ఆ రెండింటి ప్రయోజనం పొందలేము. ఒకదాని వాసనను మరొకటి డామినేట్ చేస్తుంది. మాయిశ్చరైజర్లు, క్రీములు, పౌడర్లు ఇలాంటి ఏవి అయినా.. పెర్ఫ్యూమ్ వాసనను డామినేట్ చేయకుండా ఉండాలి.

7. ఎలాంటి ప్రదేశాల్లో ఉంచాలి?

7. ఎలాంటి ప్రదేశాల్లో ఉంచాలి?

Perfumes: పెర్ ఫ్యూమ్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లే సమయంలో కొందరు తప్పనిసరిగా పెర్ఫ్యూమ్స్ వాడుతుంటారు. పెర్ ఫ్యూమ్స్ వల్ల మనసు ఆహ్లాదంగా ఉంటుంది. దాని నుండి వచ్చే సువాసన మంచి భావనను కలిగిస్తుంది. పెర్ ఫ్యూమ్ ఆత్మవిశ్వాసాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. పెర్ఫ్యూమ్స్ లో చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కో రకమైన వాసన వస్తుంది. అందుకే వాటిని ఎంచుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కొందరికి గాఢంగా వాసన ఉండే పెర్ ఫ్యూమ్స్ అంటే ఇష్టం ఉంటుంది. మరికొందరికి లైట్ గా ఉండే వాటిని ఇష్టపడతారు.

పెర్ఫ్యూమ్స్ ఎలా ఎంచుకోవాలి?

పెర్ఫ్యూమ్స్ ఎలా ఎంచుకోవాలి?

పెర్ఫ్యూమ్స్ ఎంచుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. పెర్ఫ్యూమ్స్ వాసన బాగుండటంతో పాటు అది ఎక్కువ సమయం వచ్చేది అయి ఉండాలి. దాని గాఢత ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. శరీరతత్వం, వెళ్లే కార్యక్రమానికి తగ్గట్లుగా పెర్ ఫ్యూమ్ ఉండాలి.

మరీ ఎక్కువగా వాడొద్దు

మరీ ఎక్కువగా వాడొద్దు

పెర్ఫ్యూమ్ ను ఎక్కువగా వాడవద్దు. అలాగే పెర్ఫ్యూమ్ కొనే ముందు ఏమైనా అలెర్జీలు ఉన్నాయేమో చూసుకోవాలి. పెర్ఫ్యూమ్ ఎక్కువగా వాడితే చర్మం దురద పెడుతుంది. ముక్కు, కళ్లు, గొంతు నొప్పి, మతిమరుపు, శ్వాసకోశ వ్యాదులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు పెర్ఫ్యూమ్ లో ఉండే రసాయనాలు పురుషుడి లైంగిక సామర్థ్యంపై కూడా దెబ్బతీస్తాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. తక్కువ మొత్తంలో స్ప్రే చేసుకుంటే సువాసన వెదజల్లుతుంది. ఎక్కువగా కొడితే మొదటికే మోసం వస్తుంది.

కొన్ని బ్రాండ్ల పెర్ఫ్యూమ్ బాటిళ్లపై ఎంత దూరం నుండి స్ప్రే చేయాలో రాసి ఉంటుంది. అలాంటి వాటిని అంతే దూరం నుండి శరీరంపై స్ప్రే చేసుకోవాలి. మొత్తం గ్యాస్ కాకుండా కొంచెం తేమగా ఉండే వాటిని వాడాలని చెబుతున్నారు నిపుణులు.

English summary

Side Effects Of Using Perfumes in telugu

read on to know Side Effects Of Using Perfumes in telugu
Story first published: Wednesday, July 27, 2022, 14:12 [IST]
Desktop Bottom Promotion