Latest Updates
-
Father's Day 2026: చాలా మంది తండ్రులు 60 ఏళ్లు దాటాక పశ్చాత్తాపపడే ఒక్క విషయం అదే! -
జుట్టు చివర్లు దారుణంగా చిట్లిపోతున్నాయా.. మీరు చేస్తున్న తప్పులివే.! -
Success Story : ఇదిరా సక్సెస్ అంటే..పేదరికరంలో పుట్టాడు, ఆటో డ్రైవర్ నుంచి ఎయిర్ లైన్ ఓనర్ అయ్యాడు.. -
పెళ్లయింది తర్వాతేంటి.. అమ్మాయిలు గూగుల్‌ని అడుగుతున్న సలహాలు ఇవేనట.! -
పోషకాల పవర్ హౌస్..ఇంట్లోనే రాగి మాల్ట్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే.. -
ఆర్థరైటిస్ పేషెంట్లకు అలర్ట్.. ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.? -
నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం.. శుక్రుడి సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది! -
జూన్ 19 నుంచి ధన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
పొగాకు నమిలితే క్యాన్సర్, గుండెపోటు మాత్రమే కాదు.. మరో ప్రమాదం ఉందని తెలుసా.? -
ఎక్కువ కాలం బతకాలా? ఈ వ్యాయామాలు చేస్తే మరణ ప్రమాదం తగ్గుతుంది..
టమాట జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటి ?
టమాటలో చాలా పోషకాలు వుంటాయ్. ఈ విషయాన్ని చాలా మంది కొట్టి పారేస్తుంటారు. కొందరు అన్నం తినే సమయంలో కూరలో టమాట వస్తే వాటిని పక్కకు తీసి పెట్టేస్తారు. టమాట తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయ్ లాంటి అపోహలకు గురౌతారు. టమాట వేయనిది ఏ కూర కూడా రెడీ కాదు. టమాటను ప్రతి రోజూ భోజనంలో భాగం చేసుకోవాలి. ఉదయమే టమాట రసం తాగితే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు వున్నాయ్. టమట జ్యూస్‌తో గుండె జబ్బులు రాకుండా వుండడమే కాదు క్యాన్సర్‌ను కూడా నివారిస్తుంది.
టమాటల్లో పోషకాలు మెండుగా వుంటాయ్. యాంటీ ఆక్సిడెంట్లు, వైటమిన్లు, మినరల్స్ పుష్కలంగా వుంటాయ్. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. టమాటలో వుండే లైసోపీన్, వైటమిన్ ఈ, గుండె సంబంధిత రోగాలు రాకుండా చేస్తాయ్. ప్రతి రోజూ పాలు తాగినట్టే ఈ టమాట జ్యూస్‌ను తాగితే చాలా ఆరోగ్యవంతంగా వుంటాం. మరి ఈ టమోజ్యోస్ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

క్యాన్సర్‌ను నివారిస్తుంది
ప్రతిరోజూ టమాట జ్యూస్‌ను తాగితే చాలా రకాల క్యాన్స్‌రలు నయం అవుతాయ్. ఒక పరిశోధనలో.. టమాట జ్యూస్ తాగడం వల్ల ప్రోస్టేట్ క్యాన్స్ రిస్క్ తగ్గే అవకాశం వుందని తేలింది. స్కిన్ క్యాన్సర్ కూడా తగ్గే అవకాశం వుందని రిపోర్టులు చెబుతున్నాయ్.
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది
టమాట జ్యూస్ కు గుండె ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం వుంది. టమాట వల్ల గుండె మెరుగుపడుతందని చెప్పగానే చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ ఇది పరిశోధనలో తేలిన విషయం. టమాటలో వుండే లైసోపీన్, బీటా కెరోటీన్ బ్లడ్ ప్రెజర్‌ను, కొలెస్ట్రాల్‌ను అదుపులో వుంచుతుంది. 584 మంది పది సంవత్సరాలపాటు క్రమం తప్పకుండా టమాట జ్యూస్ తాగితే వచ్చే ఫలితాలను బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించారు. దీని ఆధారంగానే టమట గెండకు మేలు చేస్తుందని కనుగ్గొన్నారు. టమాట వల్ల శరీరంలో కొవ్వు కూడా కరుగుతుందని తేలింది.
పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు
టమాట జ్యూస్‌లో లైసోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు వున్నాయన్న విషయం మనకు తెలిసిందే. ఒక గ్లాసు టమాట జ్యూస్‌లో 22 మిల్లీ గ్రాముల లైపోపీన్ వుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. డ్యామేజ్ అయిన సెల్స్‌ను రిపేర్ చేసే లక్షణం లైసోపీన్‌లో వుంటుంది.

టమాటలో ప్రొటీన్లు పుష్కలంగా వుంటాయ్
టమాటలో ప్రొటీన్లు మెండుగా వుంటాయ్. రోజూ ఒక కప్పు టమాట జ్యూస్ తాగితే శరీరానికి అవసరమైన వైటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఒక గ్లాసు టమాట జ్యూస్‌లో ఒక్కరోజుకు అవసరమయ్యే వైటమిన్ ఏ 20 శాతం వుంటుంది.
క్యారటినాయిడ్స్, పాలిఫినాల్స్
టమాటలో క్యారటినాయిడ్లు, పాలిఫినాల్స్ పుష్కలంగా వుంటాయ్. క్యారటినాయిడ్లు వైటమిన్ ఏగా మార్చబడతాయ్. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఈ క్యారటినాయిడ్లు క్యాన్సర్‌ను కూడా నివారిస్తుంది.
టమాట జ్యూస్ వల్ల సైడ్ ఎఫెక్టులు
టమాట జ్యూస్ ఎక్కువ తాగితే కొన్ని సైడ్ ఎఫెక్టులు కూడా వుంటాయ్. టమాటలో సోడియం, ఉప్పు పదార్ధం ఎక్కువగా వుంటుంది. ఇది బ్లడ్ ప్రెజర్ పెరగడానికి కారణమవుతుంది. టమాట జ్యూస్‌లో ఫైబర్ తక్కువగా వుంటుంది. జ్యూస్ చేసిన తరువాత టమాట తొక్క బయట పారేయడం వల్ల ఫైబర్ కంటెంట్ తక్కువగా వుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications