Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
రోజూ అరటిపండు తింటే ఏమవుతుందో మీకు తెలుసా..? బరువు పెరుగుతారనేది అపోహ మాత్రమే..!
రోజుకొక గుడ్డు, రోజుకొక యాపిల్, రోజూ గ్లాసు పాలు తాగమని సలహా ఇస్తారు. కానీ రోజుకొక అరటిపండు తినమని చాలా తక్కువ మంది చెబుతారు. అరటి పండు రోజూ తినడం వల్ల బరువు పెరుగుతారనే అపోహ వుంది. ఇంకా జీర్ణసమస్యలు వస్తాయని కూడా పుకారు వుంది. రోజూ అరటిపండు తినడం వల్ల ఎలాంటి లాభాలు వుంటాయో తెలుసుకుందాం.

రోజుకొకి అరటిపండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఒక చిన్న సైజు అరటిపండును తినడం వల్ల 116 క్యాలరీలు శరీరానికి అందుతాయ్. బాగా పండిని అరటిపండును తింటే లూకోసైనడిన్ అనే కెమికల్ మన జీర్ణ వ్యవస్థకు చక్కటి లాభాన్ని కలిగిస్తుంది. కడుపులో మ్యూకస్ సెక్రిషన్ తప్పకుండా జరగాలి. ఈ మ్యూకస్ సెక్రిషన్ జరిగేలా అరటి పండు దోహదపడుతుంది. ఈ మ్యూకస్ సెక్రిషన్ తగ్గితే పొట్టలో అల్సర్లు వస్తాయ్. పొట్టకు రక్షణని అరటి పండు పెంచుతుంది.
అరటిపండులో ఫైబర్‌లు పుష్కలంగా వుంటాయ్, ఇవి జీర్ణ ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తాయ్. ఫైబర్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి మరియు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. దీని వల్ల మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది.
అరటిపండు మీ గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమన్న విషయాన్ని మరవవద్దు. ఇందులో పొటాషియం, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయ్. అరటిపండులో పోటాషియం ఎక్కుం, సోడియం తక్కువగా వుంటుంది. ఈ కారణం వల్ల రక్తపోటు పెరగకుండా నియంత్రిస్తుంది.

అరటిపండ్లలో ఫోలేట్ శాతం అధికంగా వుంటుంది. దీనివల్ల రక్తహీనతతో బాధపడేవారికి హెమోగ్లోబిన్‌ను పెంచుతుంది. ఎనేమియాతో బాధపడేవారు రోజుకొక అరటిపండును తొంటే రాక్తహీనత తగ్గే అవకాశం వుంది.
అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేయాలంటే శరీరంలో మూత్రపిండాలు ఆరోగ్యంగా వుండాలి. వారానికి 5 అరటిపండ్లు తినేవారి కిడ్నీలు చాలా ఆరోగ్యంగా వున్నట్లు పరిశోధనలో తేలింది. వీరికి కిడ్నీ సంబంధింత వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా వున్నట్లు కనుగ్గొన్నారు.
వ్యాయామం చేసిన తరువాత కండరాలను తిరిగి మామూలు స్థితిలోకి తీసుకొని రావాలి. ఇలా తీసుకొని రావడంలో పొటాషియం కీలకంగా పనిచేస్తుంది. అరటిపళ్లలో ఈ పొటాషియం పుష్కలంగా వుంటుంది. కాబట్టి వ్యాయామం చేసిన తరువాత ఒక అరటిపండు తినాలని వైద్యులతో పాటు పరిశోధకులు సూచిస్తున్నారు.
శరీరంలో క్యాల్షియంను తీసుకోవాలంటే ఫ్రక్టోలిగోసాకరైడ్స్ అనే ప్రీబయోటిక్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అరటిపళ్లలో ఎక్కువగా వుండడం వల్ల ఇతర ఆహారంలో వుండే క్యాల్షియంను చాలా సులువుగా గ్రహిస్తుంది.
బరువు పెరగకుండా పరోక్షంగా అరటిపండు దోహదపడుతుంది. రెండు అరటిపళ్లు తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల భోజనం ఎక్కువగా చేయరు, బయట జంక్ ఫుడ్‌ను కూడా తీసుకోవడం తగ్గిస్తారు. దీంతో అనవసర ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల అధిక బరువు పెరగకుండా వుంటారు.
పార్టీలో మందుతాగి బాగా అలసిపోయిన తరువాత హాంగోవర్ వస్తుంది. ఈ హాంగోవర్ నుంచి బయటపడాలంటే ఒక అరటిపండును తినాలి. పెరుగులో లేదంటే పాలలో అరటిపండను కలుపుకొని తినడం వల్ల హాంగోవర్ నుంచి బయటపడతారు.
అరటిపండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయ్. ఇది ఎన్నో హానికర బ్యాక్టీరియా నుంచి రోగాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి కూడా ఇవి కాపాడతాయ్. అందువల్ల రోజుకొక అరటిపండు తినడం వల్ల లాభాలే కానీ నష్టాలు లేవని అంటున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
