Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
నేటికీ పోలియోతో బాధపడుతున్న దేశాలివే..బాంబులు,మిసైల్స్ పైన ఉన్న శ్రద్ధ పిల్లల ప్రాణాలపై లేకపోయే
పోలియో పేరు వింటనే మనదేశంలో ఇప్పటికీ చాలామంది భయపడుతుంటారు. ఇప్పుడంటే వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి కానీ ఒకప్పుడు మనదేశంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. మన వీధుల్లో ఆడుకోవాల్సిన పసిపిల్లలు కాళ్ళు చేతులు చచ్చుబడి, జీవితాంతం వికలాంగులుగా మారడం చూసి ప్రతి హృదయం ద్రవించిపోయేది. అయితే మనదేశాన్ని గడగడలాడించిన ఈ భయంకరమైన వ్యాధిని 2014లోనే భారతదేశం తరిమికొట్టి పోలియో రహిత దేశంగా చరిత్ర సృష్టించింది.
అయితే ఇప్పటికీ కొన్ని దేశాలు పోలియో మహమ్మారితో బాధపడుతున్నాయి. ప్రతి ఏటా అక్టోబర్ 24 న ప్రపంచ పోలియో దినోత్సవాన్ని(world polio day) జరుపుకుంటారు. పోలియో వ్యాక్సిన్ ను కనుగొన్న మొదటి బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ జోనాస్ సాల్క్ పుట్టినరోజు జ్ఞాపకార్థం ఈ రోజును రోటరీ ఇంటర్నేషనల్ స్థాపించింది.

పోలియో వ్యాధి గురించి, అది కలిగించే అంగవైకల్యం, మరణాల గురించి,ప్రతి బిడ్డకు పోలియో టీకాలు వేయడం ప్రాముఖ్యతను గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, ప్రపంచం నుండి పోలియోను పూర్తిగా నిర్మూలించే లక్ష్యం కోసం జరుగుతున్న కృషిని, పురోగతిని గుర్తించడమే పోలియో దినోత్సవ లక్ష్యం.
అసలు పోలియో అంటే ఏంటీ
పోలియో అంటే పోలియోమైలిటిస్ (Poliomyelitis) అనే వైరల్ వ్యాధి. పోలియోకు ట్రీట్మెంట్ లేదు, కానీ టీకాల ద్వారా దీనిని పూర్తిగా నివారించవచ్చు. ఇది ప్రధానంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ప్రభావితం చేస్తుంది. కొన్ని సమయాల్లో ఇది శాశ్వత పక్షవాతం లేదా మరణానికి కూడా దారితీస్తుంది.
నేటికీ పోలియోతో పోరాడుతున్న దేశాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం మన పొరుగుదేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పోలియో వ్యాధికి చివరి అడ్డాలుగా మిగిలిపోయాయి. ఈ దేశాల్లో వైల్డ్ పోలియోవైరస్ ఇంకా ప్రబలంగా ఉంది. ఈ దేశాలలో ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి, ఎందరో చిన్నారులు శాశ్వత వైకల్యం బారిన పడుతున్నారు. వీటితో పాటు, నైజీరియా వంటి కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో అడపాదడపా కేసులు వెలుగు చూస్తున్నా అక్కడి ప్రభుత్వాలు కఠిన చర్యలతో పరిస్థితిని అదుపులోకి తెస్తున్నాయి.
నిర్మూలనకు అడ్డుగోడలు ఇవే
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న అంతర్యుద్ధం, ఉగ్రవాద కార్యకలాపాలు టీకా కార్యక్రమాలకు పెను సవాలుగా మారాయి. ఆరోగ్య కార్యకర్తలు మారుమూల గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. టీకాలపై ప్రజల్లో ఉన్న అపోహలు, నిరక్షరాస్యత, మతపరమైన తప్పుడు ప్రచారాలు తల్లిదండ్రులు తమ పిల్లలకు చుక్కలు వేయించడానికి నిరాకరించేలా చేస్తున్నాయి. బలహీనమైన ప్రభుత్వ ఆరోగ్య సేవలు, టీకాలు నిల్వ చేయడానికి, పంపిణీ చేయడానికి సరైన సౌకర్యాలు లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
