Latest Updates
-
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.!
టేబుల్ చూస్తే ఆకలి వేయాల్సిందే!

1. డైనింగ్ టేబుల్ పాతది అయిపోతే, పూర్తిగా కవర్ అయ్యేలా ఆకర్షణీయమైన టేబుల్ క్లాత్ వేయండి. ఎంబ్రాయిడరీ చేసిన అంచులు కల పలుచటి కాటన్ బట్ట వేస్తే చక్కగా కనపడుతుంది. టేబుల్ కాళ్ళు ఆకర్షణీయంగా సాంప్రదాయకంగా వుంటాయి కనుక అలానే వదిలేయండి.
2. ఆధునికంగా ఏర్పడుతున్న కిచెన్ ఆర్ట్ లో భాగంగా వస్తున్న మాడ్యులర్ టేబుల్స్ అయితే అలానే వదిలేయండి. వీటికి డ్రసింగ్ బాగుండదు. కుషన్లు లేని సింపుల్ కుర్చీలు టేబుల్ కి జతగా బాగుంటాయి. ఒక్క పూలగుత్తి టేబుల్ మధ్యలో పెడితే చాలు, అలంకరణ పూర్తయినట్లే. గుడ్డ వేయకుంటే తరచుగా టేబుల్ క్లీన్ చేస్తూండాలి.
3. ఏవైనా పార్టీలు జరిగేటపుడు ఇంటిలోని ప్రధాన డైనింగ్ టేబుల్ కాకుండా తాత్కాలికంగా వేసే వాటికి తెల్లటి టేబుల్ క్లాత్ వేసి ఉపయోగించండి.
4. మీ డైనింగ్ అలంకరణకు పిక్నిక్ టేబుల్ ఎంపిక చేస్తే వాటికి పైన గుడ్డ వేయకుండా వుంటేనే బాగుంటుంది. వీటికి ఆకర్షణీయమైన డార్కు కలర్ గుడ్డ వేసి టేబుల్ పై కట్లరీ లేదా చైనా వేర్ పెడితే బాగుంటుంది.
5. గ్లాస్ టేబుల్స్ అయితే, గుడ్డ వేసినా, వేయకపోయినా బాగానే వుంటాయి. అయితే నేటి రోజులలో వీటిపై వేసే టందుకు ప్లాస్టిక్ లేదా ట్రాన్స్ పరెంట్ పాలీధిన్ టేబుల్ క్లాత్ లు వివిధ డిజైన్లలో వస్తున్నాయి. వీటిని గ్లాస్ పై వేసినప్పటికి గ్లాస్ బాగా కనపడుతూ ఒరిజినాలిటీ పోకుండా వుంటుంది. వీటిపై కేండిల్ లైట్లు, రంగురంగుల పూలు, కాయకూరలు, పండ్లు వంటివి పెడితే మంచి ఆకర్షణీయంగా వుంటుంది. మీ డైనింగ్ టేబుల్ కనుక హస్తాకళా నైపుణ్యతతో కూడినది అయితే, టేబుల్ పై వేసే గుడ్డను కిందదాకా వేయకుండా కాళ్ళు కనపడేలా వేయండి.



Click it and Unblock the Notifications
