Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పండుగ అలంకరణలుగా ముచ్చటైన ప్రత్యామ్నాయ ముగ్గులు!

ప్రత్యామ్నాయ రంగోలి డిజైన్లు -
1. పూలతో రంగోలి - పూల రేకులు ప్రత్యేకించి బంగారు వర్ణంలో వుండే చేమంతి, ఎర్రటి గులాబి రేకులు ముగ్గులను మరింత అందంగా చేస్తాయి. చివరలు ఆకులతోను లేదా చిన్న కొమ్మలతో కూడా అలంకరించవచ్చు. కావలసిందల్లా ఒక పేపర్ పై డిజైన్ చేసి దానికి అదే డిజైన్ లో రంగురంగుల పూరేకలు అతకటమే. మంచి ఆహ్లాదాన్నివ్వాలంటే కొద్దిపాటి సెంట్ వేస్తే ఇక ఆ ప్రదేశమంతా తాజాగా రంగురంగుల డిజైన్ తో సువాసన భరితంగా వుంటుంది.
2. మేరిసేటి రంగోలి - దీపాలను రంగోలిలో వాడవచ్చు. చిన్న కేండిల్స్ తో డిజైన్ గా అలంకరించండి. సెంటెడ్ కేండిల్స్ అయితే మంచి వాసన కూడా వస్తుంది.
3. తళుకుల రంగోలి - ఇంటిలో మహిళలు బట్టలపై కుట్టే తళుకులున్నాయా? వాటితో మరింత ఆకర్షణీయంగా ముగ్గుల డిజైన్లు తయారు చేసి అందరిని మురిపించవచ్చు. లైటింగ్ లో అవి మెరుస్తూ వుంటాయి కూడాను. ఇంటిలో పిల్లలుంటే, పండుగరోజు వారికి ఈ రంగోలి ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. తళుకులు పెద్దవిగా వుంటే డిజైన్లు పెద్దవిగా వుండి ఆకర్షిస్తాయి. పండుగ అవ్వగానే వాటిని తీసి దాచేయవచ్చు కూడాను.
4. రంగోలి డిజైన్లకు ఆహార పదార్ధాలు - బియ్యం, రాగి, ఇతర పప్పులనను కూడా రంగోలి డిజైన్లలో అలంకరించవచ్చు. ఉప్పును ఫుడ్ కలర్స్ తో కలిపి రంగోలికి వాడండి. పిల్లలు వీటిని తినేసినా హాని కలుగదు.



Click it and Unblock the Notifications