Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
సెంటర్ టేబుల్ అలంకరణ!

డ్రాయింగ్ రూమ్ అలంకరణకు, సెంటర్ టేబుల్ అలంకరణ సరిపోలాలి. ఇంటిలో ఏవైనా ప్రత్యేక సందర్భాలు వస్తే తప్ప, ఈ సెంటర్ టేబుల్ కు కొద్దిపాటి అలంకరణ సరిపోతుంది. చూడంగానే ఆకర్షించటానికిగాను సెంటర్ టేబుల్ పై ఫ్లవర్ వేజ్, బోన్ సాయి మొక్కలు, పండ్లు, కూరలు, కేండిల్స్, క్రిస్టల్స్ వంటివి వుంచండి. లేదా ఒక వెడల్పు గిన్నెలో నీరుపోసి, గులాబి, చామంతి వంటి పూలు లేదా రేకులు వేసి పెడితే బాగుంటుంది. సెంటర్ టేబుల్ పై పెట్టే ఈ వస్తువు టేబుల్ సైజుకు తగ్గట్టు వుండాలి. మంచి సువాసన వచ్చే కేండిల్స్ కొన్నిటిని రంగు రిబ్బను కట్టి దానిపై వుంచండి. రాత్రి వేళ వాటిని వెలిగించండి. కేండిల్ స్టాండ్ లేదా మరేదైనా షోపీస్ వంటివి కూడా వుంచవచ్చు.
ఇంటికి వచ్చినవారి ఉపయోగం కొరకు సెంటర్ టేబుల్ గ్లాస్ కింద భాగంలో కొన్ని పుస్తకాలు, మేగజైన్లు వంటివి పెట్టండి. బ్రాంజ్ షో పీసులు సెంటర్ టేబుల్ పై పెడితే, క్లాసిక్ గానే కాదు, స్టైలిష్ గా కూడా వుంటుంది. సెంటర్ టేబుల్ పై చాలా వస్తువులు పెట్టకండి. ఖాళీ జాగా వుంటే...అప్పటికపుడు పెట్టి తీసే వస్తువేదైనా పెట్టుకోవచ్చు.



Click it and Unblock the Notifications
