Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ఇంటి అలంకరణకు వన్నె తెచ్చే పురాతన డిజైన్ల సోఫాలు!

ఇంటిలో వేసే సోఫా డిజైన్ ఏదైనప్పటికి రూమ్ లో వున్న గోడ రంగులు ఇతర ఫర్చిచర్లకు మ్యాచ్ అయ్యేలా వుండాలి. సొఫా ఎంపిక, నిర్వహణలలో కొన్ని చిట్కాలు పరిశీలించండి.......
లవ్ సీట్ సోఫా: ఈ డిజైను సోఫాలు సాధారణంగా అన్ని ఇండ్లలోనూ వుంటూనే వుంటాయి. సోఫా ఫ్రేము వివిధ రకాల వుడ్ తో తయారు చేస్తారు. ఫ్రేము పని అంతా చక్కగా కనపడుతూ మెత్తగా రంగు రంగుల కుషన్ కూడా కనపడుతూంటుంది. కళాత్మకంగా చేయబడిన చేతిపని సోఫాకే కాక గదికి ఎంతో అందాన్ని తెచ్చిపెడుతుంది. వీటిని ఇటీవలికాలంలో స్టీలు, రాట్ ఐరన్ లేదా అల్యూమినియం మెటల్స్ తో కూడా తయారు చేస్తున్నారు. కుషన్ భాగంలో గుడ్డ లేదా లెదర్ ఉపయోగిస్తున్నారు. మరింత ఆకర్షణీయంగా వుండాలంటే కుషన్ కవర్లకు ఎంబ్రాయిడరీ లేదా పెయింట్ లేదా పూసలు మొదలైనవి వాడండి.
బెంచి సోఫాలు: ఇది సర్వ సాధారణం అయినది. ఎవరింటోనైనా సరే ఇది తప్పక వుంటుంది. పొడవైన బెంచిలా వుండి వీపు ఆనుకోడానికి మంచి సపోర్టు కలిగి వుంటుంది. సోఫా కవరుగా కాటన్ గుడ్డలు వాడండి. కుషన్లు కు మంచి బ్రైట్ కలర్లు గల కవర్లు వేస్తే బాగుంటుంది.
దివాన్ సోఫా: దివాన్ సోఫా అనేది భారతీయుల ఇండ్లలో చాలా పురాతనమైంది. దీనినే సోఫా కం బెడ్ అంటారు. సోఫాగాను, బెడ్ గాను కూడా వాడవచ్చు. ఇంటిలో సభ్యులు అధికంగా వుంటే దివాన్ సోఫా సౌకర్యంగా వుంటుంది. దీనిపైన కూడా సాప్రదాయ రంగుల కుషన్లు లేదా పిల్లోలు వేస్తే చాలా బాగుంటుంది. కుషన్ కవర్లకు చిన్నపాటి అద్దాలు లేదా పూసలు కుట్టి మరింత ఆకర్షణీయ డిజైన్ గా చేస్తే ఇంట్లో పండుగవాతావరణాన్ని తలపిస్తూంటుంది.
సాంప్రదాయకమైన ఈ పద్ధతులలో మీ ఇంటి సోఫాను అమర్చి వచ్చిన అతిధులకు మీ అభిరుచిని వెల్లడించండి.



Click it and Unblock the Notifications