Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ ఇంటిని అలంకరణలో దాగుంది అసలైన ఆనందం..

మీఇంట్లో పిల్లల గది రంగులమయం చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలకు రంగులంటే చాలా ఇష్టం. పిల్లలుండే గది గోడలకు ఎనామిల్ ప్రింట్ లేదా కార్టూన్ లలోని పాత్రలకు చెందిన పోస్టర్ లు అంటించండి. మీరుండే ఇల్లు చిన్నదిగా ఉంటే అందులోని గదులు చిన్నవిగానే ఉంటాయి. ఆ గదులను పెద్దవిగా కనపడేలా ఉంచాలనుకుంటే ఏక్సెంట్ లైట్ ను ఉపయోగించండి. ఆ లైట్ ను ఫర్నీచర్ లేదా వాల్ ఆర్ట్ పై ఫోకస్ చేయండి. దీంతో చిన్న గదికూడా పెద్ద గదిలా కనపడుతుంది.
సందర్భాన్ని బట్టి రెడీమేడ్ డెకరేషన్ ఉదాహరణకు అన్ని గదుల్లో కర్టెన్లు ఉంటాయి. ఒక వేళ లేకున్నా కర్టెన్లు ఏర్పాటు చేసుకోవాలి. అయితే ముందు గదిలో ఏర్పాటు చేసిన కర్టెన్లపై ఆడవాళ్లు అప్పుడప్పుడు వాడే బెనారస్ చీరలు మెరిసే చున్నీలను కర్టెన్ లపై వేసి వాటికి అదనపు అలంకరణగా చేయవచ్చు.
అలాగే గది గోడలపై ఉన్న ఫొటోలను అన్నీ తీసేయండి. వాటి స్థానంలో అందమైన దృశ్యాలతో ఉన్న సీనరీ వాల్ పోస్టర్లను అతికించాలి. గోడలకు పగుళ్లు, పెచ్చులు ఊడినచోట ఈ పోస్టర్లను అతికిస్తే ఎటువంటి సమస్యా ఉండదు. పైగా చూసేవారికి అందంగా కూడా కనిపిస్తుంది గది. అందరూ కూర్చునే ముందు గదిలో సాధ్యమైనంత వరకూ ఎక్కువ వస్తువులను పెట్టకుండా చూసుకోవాలి. గది ఉన్నంతలో విశాలంగా కనిపించేలా చేయాలి. అంతేగానీ అక్కడే మంచాలు, సోఫాలు, కుర్చీలు వేస్తే ఎక్కువ మంది అతిధులు వస్తే వాళ్లు కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడాల్సివస్తుంది. గది గోడలపై అందమైన మీ ఇంటి పాపాయి ఫోటోలతో ఉండే పోస్టర్లు కూడా బాగుంటాయి.



Click it and Unblock the Notifications