Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
కొనే టీవీకి అన్ని సౌకర్యాలూ ఉంటేనే...?

అంతే కానీ బైక్ కొంటే టీవీ బహుమతి, కారు బహుమతి అంటూ షోరూములు తెగ అడ్వర్టైజ్ మెంట్స్ ఇచ్చేస్తుంటారు. సౌండ్ ఎక్కువైతే దృశ్య నాణ్యత తక్కువ అవుతుందనీ, పిక్చర్ ఫర్వాలేదంటే సౌండ్ నాసిరకంగా ఉంటుందన్న అపోహలు సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. ఫీచర్లతో పాటే కొండెక్కే ధరలు. అయోమయంలో ముంచెత్తే సేల్స్‌మెన్‌ల మాటలు కలర్ టీవీ కొనాలని షోరూములకెళ్లే సగటు మధ్య తరగతి వ్యక్తి పరిస్ధితి ఇదే. అయోమయాల నుంచి బయటపడి సరసమైన ధరకు సరైన టీవీని ఎంచుకోవాలంటే ఈ సూచనలు పాటించాల్సిందే.
ముందుగా మీరు కొనబోయే టీవీని హాల్‌లో పెడతారా? డ్రాయింగ్ రూంలో, బెడ్ రూంలో ఉంచుతారా? అన్నది ముందుగా తేల్చుకోవాలి. బెడ్ రూం అయితే 14 లేదా 15 అంగుళాలు, హాల్‌లో అయితే 20, 21 అంగుళాలవి కొనండి టీవీని తొమ్మిది అడుగుల దూరం నుంచి చూసే వీలుంటే 21 అంగుళాలది తీసుకోండి. కనీసం 12 అడుగుల దూరం నుంచి చూసే వీలుంటేనే 29 అంగుళాలది ఎంచుకోండి. ఎంపికలో ఇలా జాగ్రత్త పడితే భవిష్యత్తులో కళ్ళకు శ్రమ ఉండదు. అంతే కాదు టీవి రెస్పాన్స్ టైం, బ్రైట్ నెస్, కాంట్రాస్ట్ రేషియో, రిఫ్రెష్ రేట్, ఫ్రేమ్ రేట్ అన్నీ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే కొనడానికి డిసైడ్ కావాలి.
టీవి కొనాలన్న నిర్ణయానికి రాగానే నాలుగైదు షాపుల్లో ధరల్ని విచారించండి. టీవీ అన్నది ఏడాదికోసారి మార్చే వస్తువు కాదు కాబట్టి, క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే కొనడం మంచిది. ప్రతి టీవిలో అంతర్గతంగా స్టెబిలైజర్ ఉంటుందని సేల్స్ సిబ్బంది చెప్పేవన్ని నిజం కాకపోవచ్చు. కొన్నింటిలో స్టెబిలైజర్లు ఉంటే మరి కొన్నింటిలో ఉండకపోవచ్చు. కాబట్టి విడిగా స్టెబిలైజర్ కొనటం మంచిది. పదివేలు పెట్టి టీవీ కొనేటప్పుడు వెయ్యి రూపాయలలోపు లభించే స్టెబిలైజర్ కొనడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. టీవీకి భద్రత ఉంటుంది.
మీ ఇంట్లో మ్యూజిక్ సిస్టం ఉన్నా. యాంప్లిఫయర్‌తో పాటు స్పీకర్లున్నా సౌండ్ ఎక్కువవుండే టీవీల జోలికి వెళ్ళొదు. వీటి వల్ల డబ్బు వృధా తప్ప ప్రయోజనం శూన్యం. ప్రస్తుతం మార్కెట్లో లభించే టీవీలకు మ్యూజిక్ సిస్టంను అమర్చుకునే సౌకర్యం ఉంటుంది. టీవి పిక్చర్ ట్యూబ్ నుంచి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌తో సమానమైన వేడి విడుదల అవుతుంది. కాబట్టి మీరు టీవీ పెట్టే గదిలో గాలి ప్రసరించేలా ఏర్పాట్లు చేసుకోండి. టీవీని గోడకు మరి దగ్గరగా పెట్టొద్దు. దీని వల్ల టీవీ చల్లబడటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.



Click it and Unblock the Notifications
