Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఫ్లోటింగ్ కాండిల్స్ తో ఇల్లంతా కళకళా...

వెడల్పుగా ఉండే గాజు పాత్రలో కాసిన్ని నీళ్లు పోసి, రెండు మూడు ఫ్లోటింగ్ కొవ్వొత్తులు వెలిగించాలి. అందులో గులాబీ రేకులు, లావెండర్ లేదా వెనీలా ఎసెన్స్ రెండు మూడు చుక్కలు వేయాలి. మరీ వెడల్పుగా ఉండే కాఫీ టేబుల్, డైనింగ్ టేబుల్ లేదా గది మధ్యలో ఆ పాత్రను ఉంచితే ఇంటికే కొత్త కళ వస్తుందంటే నమ్మండి.
రంగు రంగుల కొవ్వొత్తుల్ని తీసుకుని, రంగులు మ్యాచ్ అయ్యేలా ఐదారు తీసుకోవాలి. వీటిని కలిపి కట్టి, చిన్న ట్రేలో ఉంచి, సాయంత్రం వేళల్లో వెలిగించాలి. ఇలాంటివి కొన్ని సెట్లు చేసి వాకిట్లో అక్కడక్కడా ఏర్పాటు చేసి.. అన్నింటినీ ఒకేసారి వెలిగిస్తే ఆ అందమే వేరు. ఇంకాస్త వెరైటీ కావాలంటే కొవ్వొత్తుల చుట్టూ రంగురంగుల పూలరేకులను పరచి చూడండి.
పెద్ద పళ్ళెం మధ్యలో చిన్న పళ్ళెం పెట్టి దీపాలు నూనె వత్తులు వేసి ఉంచాలి. పెద్ద పళ్ళెంలో చిన్న పళ్ళెం చుట్టూ బంతిపూలు లేక చామంతి, గులాబి పూలు అందంగా పేర్చాలి. రీయల్ ఫ్లవర్స్ దొరకని పక్షంలో ఇంపోర్టెడ్ ఫ్లవర్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ పళ్ళెంలో అమర్చాలి.ఈ మధ్యలో ఉన్న దీపాలను వెలిగించి, డ్రాయింగ్ రూమ్ మధ్యలో టీపాయిపై ఉంచడం గాని దేవుని పూజ ముందు ఉంచడంగాని చేస్తే ఎంతో అందంగా ఉంటుంది. దీపం ఏ ఫంక్షన్ అయినా అవసరమే. పెద్ద పెద్ద సభల్లో కూడా ఈ దీపాల పళ్ళాలు అత్యంత అందమైన అలంకారము. దీపాలు చుట్టు పువ్వులకు బదులు చెమ్కిలు, ధర్మాకాల్ బాల్స్ కూడా పొయ్యవచ్చు. ఇవి మెరుస్తూ ఉంటాయి. దీపాల వెలుగులు పడి మరింత అందం ద్విగుణికృతమవుతుంది. గృహాలంకరణలో ఈనాడు ఈ తరహా అలంకరణ అత్యంత ప్రాముఖ్యత వహిస్తోంది.



Click it and Unblock the Notifications