Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
గృహ శోభను రెంటింపు చేసే ముద్దుముద్దు బొమ్మలు...

అనుకోకుండా అతిథులు వస్తున్నారని తెలియగానే ఇంటి అలంకరణ మీదకు మనసు మళ్లుతుంది. మరి అలాంటి హడావిడి సమయంలో ఎలాంటి ఏర్పాట్లు చకచకా చేయవచ్చో తెలుసుకుందాం..మధ్య గదిలో టీపాయ్, కాఫీ టేబుల్‌ను అందంగా ముస్తాబు చేసుకోవడానికి.. ఏం చేయాలంటే నీలం రంగు వస్త్రం పరవాలి. దానిమీద ఎర్రని గులాబీలతో అలంకరించుకుంటే ముచ్చటగా కనిపిస్తుంది.
అలానే గాజుగిన్నెలో నీళ్లు పోసి అందులో గులాబీ రేకలు వేసి మధ్యలో అమర్చుకొంటే ఆ అందమే వేరు. అదే రాత్రి వేళ అయితే పార్టీలకు గాజుపాత్రలో నీళ్లుపోసి కొవ్వొత్తి వెలిగించి.. అందులో రంగురంగుల రాళ్లు.. పైన పూరేకలు చల్లితే అలంకరణ పూర్తయినట్లే.
ఇంటి శోభను ద్విగుణీకృతం చేసే అందమైన వివిధ రకాలైన బొమ్మలను తమతమ ఇళ్లలో అలంకరించుకోవచ్చు. హస్త కళల రూపాలైన రకరకాల ముద్దులొలికే బొమ్మలతోపాటు ఆధ్యాత్మికత ఉట్టిపడే చందనపు బొమ్మలు, ప్రకృతి రమణీయతను అద్దంపట్టే పక్షుల బొమ్మలు, నాటి ఆచార వ్యవహారాలను తెలియజేసే మానవ ఆకృతులను ఇలా ఒటేంటి ఇంటి శోభను రెట్టింపు చేస్తాయి. అటువంటి ఈ సుందర రూపాలను మీ ఇంటిలో అలంకరించుకుని ఆహ్లాదంగా గడపొచ్చు.
పరదాల విషయానికి వస్తే కిటికీలకు లేత రంగువి ఎంచుకోవాలి. ముఖ్యంగా ఎరుపు, పసుపు, నారింజ, ఆకుపచ్చ.. వర్ణాలను ఏర్పాటు చేస్తే గదికి కొత్త కళ వస్తుంది. డిజైన్లు ఉన్న లేస్ కర్టెన్లు మరింత హుందాతనాన్నిస్తాయి.



Click it and Unblock the Notifications
