Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
లాఫింగ్ బుద్ద ఇంట్లో ఉంటే ఆనందం..ఆరోగ్యం..ఐశ్వర్యం..

సౌత్ ఈస్ట్ లో లాఫింగ్ బుద్ధను ఉంచితే జీవితంలో అబివృద్ధి, అదృష్టం...రెండు ద్విగుణం బహుళం అవుతాయి. వ్యాపారం కలిసొస్తుంది. ఆర్ధికంగా పరిస్థతి ఎంతో మెరుగుపడుతుంది. సౌత్ ఈస్ట్ లో లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, బెడ్ రూమ్, ఆఫీస్ లలో ఉంచుకోవచ్చు. తూర్పు విభాగంలో లాఫింగ్ బుద్ధను ఉంచడం వల్ల కుటుంబానికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందిస్తుంది. మీ కుటుంబాన్ని వేధించే ఎన్నో సమస్యల్ని దూరం చేస్తుంది. పడమర విభాగంలో లాఫింగ్ బుద్ధను ఉంచితే వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది. మీ వెన్ను వెనుక జరిగే రకరకాల కుతంత్రాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఉత్తరంలో లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, ఆఫీసులలో ఉంచితే మీ కెరీర్ బాగుంటుంది. మీకు అదృష్టాన్ని సైతం అందిస్తుంది.
ఇళ్లలో అయితే టివి రూం, కామన్ హాల్‌లలో వీటిని పెట్టాలి మినహా బాత్ రూంలలో, డైనింగ్ హాళ్లలో, డ్రస్సింగ్ రూంలలో పెట్టకూడదని... అలాగే ఈ విగ్రహాన్ని ఎట్టి పరిస్ధితిలోనూ కింద పెట్టకూడాదు అలా పెట్టడం వల్ల అనర్ధాలు జరిగే ప్రమాదం ఉందంటారు ఫెంగ్ షూయ్ నిపుణులు. ఆఫీసులో, ఇళ్లలో ఎక్కడైనా సరే ద్వార బంధానికి దగ్గర్లో, కానీ ఎదురుగా గానీ సరైన స్ధలాన్ని నిర్ణయించి భూమి కనీసం అడుగున్నర ఎత్తులొనైనా ఉంచితే నిత్య సంతోషం అక్కడ తాండవిస్తుందని చెప్తారు. ఇంట్లో సంతోషానికి బలమైన పునాదికి సంకేతంగా ఒక పెద్ద బంగారు తిన్నె మీద కూర్చుని, మరొకరికి ఇచ్చేందుకు చేతిలో బంగారు ముద్దను పట్టుకుని ఉంటాడు. సుదీర్ఘ జీవితానికి తన టోపీతో కూర్చుని ఆనందంగా కనిపించే లాఫింగ్ బుద్దా ప్రతిమ.
లాఫింగ్ బుద్ద వివిధ రూపాల్లో మార్కెట్లో లభ్యమవు తున్నాయి. లాఫింగ్ బుద్దా ప్రతిమను కొనేటప్పుడు సాద్యమైనంత పెద్దది కొనడం మంచిది. ఈ లాఫింగ్ బుద్దను దేవతా విగ్రహం వలే పూజించనవసరం లేదు. అయితే దాన్ని సరైన స్థలంలో ఉంచితే సరిపోతుంది. బౌల్‌ని ఆకాశం వైపు చూపిస్తూ అనంత సంపదను అందుకునే ఉండేదానిని... దయా మయ హృదయంతో చిరునవ్వులు చిందిస్తూ... ఉండే బొమ్మ ఉంచిన చోట సకల సంపదలు వస్తాయని... ఫెంగ్ షూయ్ నిపుణులు చెప్తారు.
అలాగే కుండలోని బంగారు నాణాలతో... భుజం పై సంచీ వేసుకుని నవ్వుతూ కనిపించే లాఫింగ్ బుద్ధ ఓ బంగారు తిన్నెపై కూర్చొని.. ఏదో ప్రయాణానికి సిద్దమవుతున్న వాడిలా ఉంటాడని.. ఈ ప్రయాణం ఆధ్యాత్మికత వైపని.. ఆతని భుజంపై ఉండే గోతంలో ఉండే సకల భాండాగారం మనిషిలోని అంతర్గత భావాలకు... చేతిలోని విసన కర్ర అవగాహన కల్పించే ఆయుధ చిహ్నాలుగా పేర్కొంటారు. ఈ బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే సౌభాగ్యాలకు, సంతోషాలకు కొదవే ఉండదని... ఫెంగ్ షూయ్ నిపుణులు చెప్తారు. ప్రతిరోజూ ఒక్కసారైనా లాఫింగ్ బుద్ద టమ్మీని తప్పకుండా కుడిచేత్తో రబ్ చేయటం ఎట్టి పరిస్థితిలో మర్చిపోకండి. లాఫింగ్ బుద్ధను ప్రతిమలు పలురకాలున్నాయి. వాటి ఉపయోగం మాత్రం ఒక్కటే. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం.



Click it and Unblock the Notifications
