Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
లివింగ్ రూం కి సౌకర్యవంతమైన ఫర్నీచర్ ఎంపిక

సొంత ఇళ్లు ఉన్నవారయితే ఉన్న ఫ్లోర్ కు తగ్గట్టుగా సోఫాలు, కుర్చీలు తీసుకుంటే సరిపోతుంది. ఇక అద్దె ఇంట్లో ఉండేవాళ్లు ఇల్లు మారినప్పుడల్లా ఫర్నీచర్ మార్చలేం కదా.. అందుకే అద్దెం ఇంట్లో ఉండేవాళ్లు ఏ ఫ్లోర్ కైనా సరిపోయే సహజమైన రంగులతో ఉన్న ఫర్నీచర్ ఎంపిక చేసుకోవాలి. సోఫాలు, కుర్చీలు హాల్ మధ్యలో వేయకూడదు. దీనివల్ల నడవడానికి ఇబ్బంది. హాల్ అందం చెడిపోతుంది. వీటిని ఎప్పుడైనా గోడను ఆనుకుని ఉండేలా వేస్తే ఎక్కువగా స్థలం అక్రమించినట్లుగా ఉండదు.
ఎక్కువ రూమ్స్ ఉంటే హాల్ కేవలం ఆ రూమ్స్‌లోకి నడవడానికి మాత్రమే సరిపోతుంది. ఇట్లాంటప్పుడు తక్కువ స్థలం ఆక్రమించే ఫర్నీచర్ తీసుకోవాలి. ఇక ఇది సోఫా కంబెడ్ అయితే మరీ మంచిది. ఉమ్మడి కుటుంబాల్లో దీనిని బెడ్ గా కూడా వాడుకోవచ్చు. మంచి లుక్‌తోపాటు సింపుల్ గా ఉన్న సోఫాలు ఎంచుకుంటే బాగుంటుంది.
లివింగ్ రూమ్ శారీరకంగా, మానసికంగా విశ్రాంతి తీసుకునే గది కావడంతో రంగుల ఎంపికలో కాస్త జాగ్రత్త పడాలి. ఇంకా ఈ గదిని సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. ఈ గదికి నీలం, గులాబి, ఆకుపచ్చ వంటి పోస్టల్ రంగులు లేదా న్యాట్రల్ షేడ్లు వాడటం మంచిది. అలాగే రంగులకు తగినట్లు లైట్లను అమర్చుకుంటే లివింగ్ రూమ్, హాలు ప్రకాశవంతంగా ఉంటాయని ఇంటీరియర్ డెకరేటర్స్ సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications
