Latest Updates
-
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.!
మీ ఇంట్లో ఎయిర్ కండీషనర్ (ఏసీ) ఉందా...?

1. ఏసీని కొనేటప్పుడు మీ గడి, ఇంటి ఆకారాన్ని దృష్టిలో ఉంచుకొని ఏసీని కొనుగోలు చేయండి. ఈ విషయంలో మీరు ఎవరైనా తెలిసిన వారి సలహా తీసుకోండి. ఏసీ సైజు పెరిగిన కొద్దీ ఎక్కువ విద్యుత్తు ఖర్చు అని గుర్తుంచుకోండి.
2. విండో ఏసీని అమర్చేటప్పుడు.. మెషిన్ వెనుకవైపున కనీసం నాలుగు అంగుళాలు ఖాళీ స్థలం ఉండేలా చూడాలి. గాలి ధారాళంగా తాకితే కంప్రెసర్ పై భారం తగ్గుతుంది. లేకపోతే సరిగ్గా చల్లబడక ట్రిప్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
3. ఏసీ ఉన్న గది తలుపులు, కిటికీలను మూసి ఉంచాలి. దాంతో గడి చల్లబడటానికి తక్కువ సమయం పడుతుంది. లేకపోతే దుమ్ము, ధూళి కంప్రెసర్ లో చేరి ఫంగస్ ఏర్పడి ఏసీ జీవితకాలం తగ్గిపోతుంది. అలాగే చల్లదనం బయటకు వెళ్లి ఏసీ వినియోగం పెరిగి, కరెంటు ఛార్జీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వైరింగ్ విషయానికి వస్తే 720 గేజ్ వాడాలి. లేకపోతే లోడ్ పెరిగి కాలిపోతుంది.
4. ఏసీ టెంపరేచర్ 25డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ సెట్ చేసి ఉంచండి. దీంతో మీ విద్యుత్ బిల్లు తగ్గుతుంది.
5. ఏసీని వాడేటప్పుడు ఎక్కువ విద్యుత్తును వాడుకునే మైక్రోవేవ్ ఓవెన్లు, గీజర్లు, వాటర్ పంప్ సెట్ మోటార్లను వేయకూడదు. లేకపోతే లోడ్ పెరిగి ఫ్యూజ్ లు ఎగిరిపోతాయి. 6. ఇక ఓల్టేజీ హెచ్చుతగ్గుల నుంచి క్షేమంగా ఉండాలంటే ఏసీకి స్టెబిలైజర్ వాడకం తప్పనిసరి. అలాగే కరెంట్ షాక్ లనుంచి తప్పించుకోవాలంటే, ఎర్తింగ్ కూడా తప్పనిసరి అన్న విషయం మరువకూడదు.
7. ఎసీని ఎప్పుడూ ఆన్ చేసి ఉంచడానికి బదులు కొద్దిసేపు ఆన్ చేసి ఉంచి, ఒకసారి గది చల్లబడిన తర్వాత ఏసీని ఆపేయాలి.



Click it and Unblock the Notifications
