Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
శీతాకాలంలో అలంకరణకు ముఖ్యమైన చిట్కాలు
శీతాకాలంలో చలి, చల్లటి గాలులు, పొడిగా ఉండే చల్లని వాతావరణం వల్ల మీరు చాలా వెచ్చదనాన్ని కోరుకుంటారు. అందుకు మీ ఇంటి వాతావరణాన్ని వెచ్చగా మార్చుకోవాలని చూస్తారు. అందుకోసం కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మీ మీ వింటర్ హోంను ఏర్పాటు చేసుకవచ్చు. వింటర్ లో మీకు హాయిగా అనిపించి అలంకరన ఆలోచనలు మీరు వింటర్లో చేయడం వల్ల మీఇంట్లో వెచ్చదనాన్ని కలిగించవచ్చు.
ప్రకాశవంతమైన ఎండరోజుల్లో కూడా చలికాలంల మీరు చలిగానే భావిస్తారు. మీరు ఇంట్లో ఇంటీరియర్ కలర్స్ ను మార్చడం ఒక సున్నితమైన ఆలోచన. అలాగే మీ ఫర్నీచర్ కు ఫాబ్రిక్ కలర్స్ ను మార్చడం, ముక్యంగా లివింగ్ రూమ్ లోని సోఫాల యొక్క ఊల్ లేదా లెదర్స్ మార్చడం. శీతాకాలంలో ఇటువంటి మార్పుల వల్ల మీరు వెచ్చదనం పొందవచ్చు. సమ్మర్ లో రోల్డ్ చేసి స్టోర్ రూమ్ లో పెట్టిన వెచ్చని కార్పెట్లు మరియు మ్యాట్స్ ను బయటకు తీయడానికి సంవత్సరంలో ఇదే మంచి సమయం. వాటిని తీసి మీ లివింగ్ రూమ్ లో పర్చడం ద్వారా వెచ్చని వాతావరణాన్ని పొందవచ్చు.
ఇక కిటికీల విషయానికొస్తే, వింటర్లో మందపాటి కాటన్ వస్త్రంతో తయారుచేసన కర్టెన్లను మార్చాల్సి ఉంటుంది. మీ లివింగ్ రూమ్ లో కూర్చోవడానికి వేసిన పిల్లోస్ ను కూడా మార్చాల్సి వస్తుంది. వింటర్ సీజన్లో రెగ్యురల్ కవర్లను మార్చి ఉలెన్ లేదా స్కార్ఫ్ మెటీరియల్స్ ను ఉపయోగించడం వల్ల మీరు వెచ్చగా మరియు కాలానుగుణ అనిపించవచ్చు . అలాగే మీ లివింగ్ రూమ్, బెడ్ రూమ్ లలో సెంటర్ లో ఉన్న మీ ఫర్నీచర్లను విండోలకు అడ్డంగా వేసుకోవడం వల్ల కూడా ఇంట్లో కొంచెం వెచ్చదనం ఏర్పడుతుంది.వీటితో పాటు వింటర్లో చేయాల్సిన మరికొన్ని సెంటర్ పీస్ ఐడియాలు మీకోసం..

కలరింగ్స్:
శీతాకాలంలో బయట చాలా చలిగా ఉంటుంది, అందువల్ల ఇంటిలోపల హాయిగొలిపే కలర్స్ మరియు వెచ్చదనం వల్ల మీకు వెచ్చగా అనిపించవచ్చు. అందుకు డీప్ పింక్, గ్రే-ఆవిల్ కలర్ కాంబినేషన్ వంటి కలర్లను ఎంపిక చేసుకోవడం వల్ల వెచ్చగా అనిపించడానికి చాక్లెట్ కాంబినేషన్ వైట్ లేదా ఐవరీ కలర్ ను ఎంపిక చేసుకోండి.

ఫైర్ ప్లేస్
సంవత్సరంలో మీరు మీరు కూర్చోవడనికి మీరు ఎక్కువ నివసించే ప్రదేశాన్ని శుభ్రం చేయడానికి సంవత్సరంలో ఇది ఒక మంచి సమయం. మీరు లివింగ్ రూమ్ లో ఎక్కువ సమయం గడుపుతారు కాబట్టి, అక్కడ అందమైన ఫ్లవర్ వాజులను మరియు కలర్ఫుల్ పిక్చర్స్ ను, విలువైన కలర్స్ ఆరెంజ్, మెరూన్ మరియు ఎల్లో వంటివాటిని ఎంపిక చేసుకోవాలి.

ఫర్నీచర్ ను రీ అరెంజ్ చేయడం
వింటర్లో చలిని ఎదుర్కోవడానికి మీ లివింగ్ రూమ్ లోని ఫర్నీచర్ ను రీ అరేంజ్ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. గోడలకు మరియు కిటికీలకు దూరంగా మీరు కూర్చోవడానికి వేసుకొన్ని ఫర్నీచర్ ను దూరంగా వేసుకోవాలి. ఆ ఫర్నీచర్ ను సెంటర్ కు లేదా ఫైర్ ప్లేస్ కు దగ్గరగా వేసుకోవడం వల్ల వింటర్లో వెచ్చని అనుభూతిని పొందుతారు.

విండో కర్టెన్లు
శీతాకాలంలో కర్టెన్ల విషయానికి వచ్చినప్పుడు , పల్చటి కర్టెన్లకు బదులు మందంగా ఉన్న కర్టెన్లను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఇవి మీకు హాయిగా మరియు వెచ్చగా అనిపిస్తుంది .

కవర్స్:
మీరు పిల్లో లేదా కుషన్ల కవర్లు రెగ్యులర్ క్లాత్ మెటీరియల్ కవర్లు కాకుండా ఉలెన్ లేదా స్కార్ఫ్ మెటిరియల్ తో తయారుచేసిన కవర్లను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి మీకు శీతాకాలంలో హాయిగా మరియు మీరు కూర్చొనే ప్రదేశంలో వెచ్చగా విశ్రాంతి తీసుకోనే భావనను కల్పిస్తాయి.

లేయర్డ్ పరుపులు
మీ పరుపులకు మరిన్ని పొరలు జోడించండి. మీ రెగ్యులర్ షీట్స్ తో పాటు, అదనంగా మందపాటి బ్లాంకెట్లను పరుపు మీద పరవండి . శీతాకాలంలో వెచ్చదనాన్ని పొందడానికి బెడ్ ను ఉబ్బెత్తుగా తయారుచేసుకోవండి.

వెచ్చనిడిన్నర్ టేబుల్ అలంకరణ
మీ డిన్నర్ టేబుల్ ను వెచ్చగా అలంకరించుకోవాలి. టేబుల్ మీ మరో లేకర్ గా వెచ్చని మరో కవర్ ను పరవండి . అలాగే కొన్ని వవకైన కాండిల్ హోల్డర్ లేదా గ్లాస్ వరింగ్ కాండిల్ పెట్టడం వల్ల ఒక వెచ్చని వాతావరణంను కొవ్వుత్తుల అలంకరణ వింటర్ చలిగి పోగొడుతుంది.

కూర్చొనే ప్రాంతంలో హాయిగా మార్చుకోండి:
మీరు ఎక్కువ సమయం గడిపే మీ లివింగ్ రూమ్ ను కొన్ని వెచ్చని అనుభూతి కలిగించే కలర్స్ తో అలంకరించండి. బ్రైట్ మరియు వార్మ్ కలర్ లైటింగ్స్ , బుక్స్ చదవడానికి సూట్ అయ్యే విధంగా లేదా మీరు ప్రతి రోజూ ఒక కప్పు కాఫీ త్రాగడానికి అనుకూలంగా వెచ్చని వాతావరణాన్ని కల్పించుకోండి . అటువంటి ప్రదేశంలో రెడ్, మెరూన్, డార్క్ పింక్, ఆరెంజ్ షేడ్స్ ను అమర్చుకొనే విధంగా ఎంపిక చేసుకోవాలి . అది హాయిగొలిపే వెచ్చని వాతావరణాన్ని కల్పిస్తుంది.



Click it and Unblock the Notifications











