Latest Updates
-
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.!
ఇంట్లోనే పెంచగలిగిన ఫెంగ్ షూయి పువ్వులు!

లిల్లీ పూలు: వీటిని ఇంటిలోపల కూడా పెంచవచ్చు. లిల్లీ గడ్డలు కొనండి. వాటిని ప్లాస్టిక్ బ్యాగ్ లతో కవర్ చేసి, టాప్ మాత్రం ఓపెన్ గా పెట్టి 35 నుండి 45 డిగ్రీల వేడిలో 12 వారాలు వుంచండి. అధిక తడి లేదా పొడి లేకుండా చూడండి. దానిని తర్వాత పాట్ లేదా కంటైనర్ లో పెట్టి సూర్యరశ్మ తగలేలా చేయండి. మొక్క ఎదిగి మంచి పూలనిస్తుంది.
ప్యానీ: ప్రేమ, రొమాన్స్ లకు ఇది సంకేతం. బంధాలను గట్టిపడవేస్తుంది. మహిళా అందానికి ప్రతిరూపంగా చెపుతారు. ఈ మొక్కలను బెడ్ రూమ్ లేదా గార్డెన్ లో పెంచి ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఆ పూల రంగులు బాగా ఆకర్షిస్తాయి. విత్తనాలు నీటిలో 4 రోజులు నానపెట్టి కుండీలో పాతిపెట్టండి. 3 నెలలు ఈ కుండీని వేడిగా ఏదేని సంచీలు పైన కప్పి వుంచితే వాటిలో జీవం మొదలెడుతుంది. ఇక కుండీని కోల్డ్ స్టోరేజికి పంపి రిఫ్రిజిరేట్ చేయండి. ఇక ఆ విత్తనాలను ఎండ తగిలే ప్రదేశంలో పాతిపెట్టండి. అధిక తేమ లేదా పొడి రెండూ వుండరాదు.
లోటస్: ఫెంగ్ షూయి మేరకు ఈ పూవు పవిత్రత, ఖచ్చితత్వాలను సూచిస్తుంది. ఇంటిలో లోటస్ వుంటే అనురాగం పెరుగుతుందంటారు. ఈ మొక్కలను ఇంటిలోపలా, బయటా కూడా పెంచవచ్చు.
ఆర్చిడ్ పూలు: ఇది చాలా ఆకర్షణీయమైప పూలనిస్తుంది. ఫెర్టిలిటీకి సంకేతం. ఈ మొక్క ఇంటిలో వుంటే జీవితంలో అన్ని రంగాలలోను అభివృద్ధి చెందుతారంటారు. సమృద్ధి, పవిత్రత, అందం, ఆద్యాత్మికతలను కలిగిస్తుంది. మొక్కలు పెంచటం కష్టం అనుకుంటే, ఇంటిలో కనీసం బయటనుండి పూలు తెచ్చి అయినా సరే వుంచండి.
మనిషికి జీవితంలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించే ఫెంగ్ షూయి పూలను ఇంటిలోనే పెంచండి. అయితే, ఎండిన ఆకులను మాత్రం ఎప్పటికపుడు తొలగించడం మరచిపోకండి.



Click it and Unblock the Notifications
