Latest Updates
-
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ
ఇంటి గార్డెన్ కు ఫెంగ్ షూయి మొక్కల ఎంపిక!

ఫెంగ్ షూయి మొక్కలలో ప్రధానంగా అయిదు రకాల ఎనర్జీ పంచ భూతాలనుండి వస్తుంది.
1. వుడ్: సంపద కొరకు
2. నీరు: నిర్ణయాత్మకతకు, ఏకాగ్రతకు
3. ఎర్త్: స్ధిరత్వం కొరకు
4. ఫైర్: ఆనందానికి, సంతోషానికి
5. మెటల్: ధృఢత్వానికి - సంకేతంగా చెపుతారు.
అందుకనే నేటి రోజుల్లో అందరూ అదృష్టాన్నిచ్చే వెదురు మొక్కలను ఇంట్లో పెంచుతున్నారు. అది ఎదుగుదల కొరకు నీరు, దానికి కట్టబడే ఎర్రని రిబ్బన్ ఫైర్ కు సంకేతంగాను, దాని మూలంలో వున్న ఎర్త్, అది పెట్టబడిన గ్లాస్ కంటైనర్ నుండి మెటల్...ఇలా అన్నీ దాని పెంపకంలో మన ఇంట్లో వున్నట్లే. చైనా దేశస్ధుల ఫెంగ్ షూయిలో, ప్రతి మొక్క ఒకరకమైన ఎనర్జీకి సంకేతమే. ఏ రకమైన మొక్క ఏ విధమైన ఎనర్జీని ఇస్తుందో గమనించండి.
1. మనీప్లాంట్ లోని మెటల్: సంపదను ఇస్తుంది కనుక దీనిని అదృష్టం తెచ్చే మొక్క అంటారు. ఇది సంకేతంగా చూపేది ఫెంగ్ షూయి లో మెటల్ కాని మనీ కాదు. నాణేలవలే వుండే ఆకులు మెటల్ ఎలిమెంట్ గా మంచిది. మనీ ప్లాంట్ సాధారణంగా నీటిలో పెరుగుతుంది కనుక నీరు ఇచ్చే ఎనర్జీని అందిస్తుంది.
2. ఫెంగ్ షూయిలో వుడ్ అనేది ఆస్తికి ఐశ్వర్యానికి సంకేతం. జాస్మిన్ స్నేహాన్ని ప్రతిబింబిస్తుంది. మీ గార్డెన్ లో వుడ్ మూలకంగా గల మొక్కలన్ని మీరు మీ జీవితంలో ఆస్తులను పోగేసుకోటానికి సహకరిస్తాయి. జాస్మిన్ చెట్లు పెద్దవిగా ఎదుగుతాయి. పెద్దవైతే వాటికి మీ పోషణ కూడా అవసరం లేదు. మంచి సువాసన కూడాను.
3. వాటర్ లిల్లీస్ లోని వాటర్ ఎలిమెంట్: వాటర్ లిల్లీ పువ్వును దేముడి పువ్వు అని అంటారు. పురాణాలలో ఇది శుభ్రతలకు పాశ్చాత్య నాగరికతలలో కన్యత్వానికి సంకేతంగా చెపుతారు. ప్రాచీన కాలంనుండి వివాహమయ్యే కన్య ఈ పువ్వును అలంకరించుకొని వెళ్ళటం సాంప్రదాయం. ఈ పువ్వు చైనీయుల మేరకు, ఒక మార్గదర్శకతను చూపుతుందంటారు. నీరు ఎపుడూ ఒక దిక్కుగా దాని లక్ష్యం మేరకు ప్రవహిస్తుంది. ఎటుపడితే అటు ప్రవహించదు.
4. డెల్ఫినియంలోని ఎర్త్: ఎర్త్ అనేది స్ధిరత్వానికి సంకేతం. మీ ఇంటికి కావలసిన స్ధిరత్వాన్ని ఇది ఇస్తుంది.
5. సన్ ఫ్లవర్ లో వుండే ఫైర్: ఈ ఎలిమెంట్ లేదా మూలకం జీవితంలో నవ్వుకు, అందానికి సంకేతం. సన్ ఫ్లవర్ పూవు విశ్వంలో అతి పెద్దదిగా ఎర్రగా ఆకర్షణీయంగా వుండే సూర్యగోళానికి సంకేతమంటారు.
పైన తెలిపిన వివరాలు ఫెంగ్ షూయి ఆధారిత గార్డెన్ తయారుకు ఉపయోగిస్తాయి



Click it and Unblock the Notifications