Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఇంటిలో ఆనందం కరువైందా?

ఇంటి ఆవరణ - మీ ఇంటి ఆవరణ ఎంత చిన్నదైనా కానీయండి. అందులో ఒక మూల చిన్న నర్సరీ లేదా గార్డెన్ పెట్టేందుకు ప్రయత్నించండి. చిన్న పిల్లలనుండి, ఇంటిలోని ముసలి వారి వరకు ఈ గార్డెన్ ఆనందం పొందవచ్చు. మీరు బిజీగా వుండే వారైతే, వారానికోసారి హాబీగా దాని బాగోగులు కూడా చూడవచ్చు. లేదా ప్రతిరోజూ నీరు పెట్టటం వంటి పనులు చేసి చక్కని రిక్రియేషన్ పొందవచ్చు. ఏదైనప్పటికి కంటికి ఇంపైన పచ్చదనంతో పాటు మానసిక భావనలు కూడా మారతాయి.
పెరటి కూరగాయలు - గార్డెన్ నిర్వహణ ప్రకృతితో సంబంధం కలిగించి ఆహ్లాద పరచి, విశ్రమించేలా చేస్తుంది. స్ధలం అధికంగా వుంటే పూల మొక్కలతో పాటు, కూరగాయల మొక్కలు కూడా పెట్టండి. గార్డెన్ కొరకు శ్రమిస్తే, మంచి రుచికల ఇంటి పెంపక కూరలతో ఆహారం తినవచ్చు, రాత్రులందు చక్కగా నిద్రించవచ్చు. మీ ఇంటి లోపలి లేదా బయటి ఆవరణలో కల ప్రదేశాన్ని బట్టి మీకు అనువైన చక్కటి గార్డెన్ ఏర్పాటు చేసి ఆనందించండి.



Click it and Unblock the Notifications