Latest Updates
-
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్
కలుపు తీస్తే...తోట అందం అధ్భుతం!

కలుపు మొక్కలను వేళ్ళతో సహా పీకండి. కలుపు మొక్కలు పెరగకుండా వుండాలంటే, తోటలో ఖాళీ ప్రదేశాలను చెక్క ముక్కలతో నింపండి. కలుపు మొక్కలు పెరగకుండా వుండాలంటే అందుబాటులోవున్న ఆర్గానిక్ ఎరువులు స్ప్రే చేయండి. చిన్నగా వున్న మొక్కలను ఎప్పటికపుడు తొలగిస్తే అవి మళ్ళీ పెరగకుండా వుంటాయి. మొక్కలు పెకలించే ముందు నేల బాగా తడపండి. తడినేలలో కలుపు తీయటం తేలిక. మొక్కల వేళ్ళు బాగా లోతుగా వుంటే, ఒక కత్తి తీసుకుని మట్టిని బాగా పెకలించి వేళ్ళతో సహా లాగేయండి. మొక్కలకు దూరంగా వుండి పగుళ్ళలో పెరిగే కలుపు మొక్కలకు వేడి నీరు పోస్తే చచ్చిపోతాయి. వి - ఆకారంలో వున్న పరికరం ఒకటి తీసుకొని కొద్ది ఒత్తిడితో మొక్కను పైకి లేపితే తేలికగా వచ్చేస్తుంది. కొత్త కలుపు మొక్కలు ఎపుడు చూసినా వాటిని వేళ్ళతో సహా పెకలించివేయండి.
ముందు జాగ్రత్తలు
కలుపుమొక్కలు ముదిరి విస్తరించకముందు, లేదా విత్తనం వేయకముందే పీకాలి. పై భాగాలే కాకుండా వేళ్ళతో సహా మొక్కలను పీకేయాలి. పీకిన కలుపుమొక్కలు గార్డెన్ లోనే పడవేయకుండా, వాటిని సమూలంగా నాశనం చేయండి. కలుపు మొక్క విత్తనాలను చేరవేసే పురుగులను నాశనం చేయటానికి గాను పెస్టిసైడ్స్ వాడండి. కలుపు మొక్క లేని గార్డెన్ మంచి పచ్చని పూల మొక్కలతో ఆనందం కలిగించేదిగా వుంటుంది.



Click it and Unblock the Notifications
