ఈ ఇండోర్ మొక్కలతో ఇంటికి అందం.. మనస్సుకు ఆహ్లాదం...

మనలో చాలా మంది చాలా సులభమైన పనులు చేయడానికి ఇష్టపడుతుంటారు. శరీరానికి కష్టం తలగకుండా ఉన్న చోటనే పనులను చక్కబెట్టుకుంటారు. అది వారి హాబీ కూడా.. అయితే వాటితో ప్రయోజనం అంతంత మాత్రమే ఉంటుంది. మనిషి రిలాక్స్ అవ్వాలంటే కొన్ని కష్టమైన పనులను కూడా అప్పుడప్పుడూ చేస్తుండాలి. ఇంట్లో ఉండే వారికి మరీ బోర్ కొట్టకుండా ఉండాలంటే...మొక్క పెంచడంతో వారి మనస్సుకు ప్రశాంతతతో పాటు, శరీరానికి వ్యాయమం, ఇంటికి అందం చేకూరుతుంది.

గార్డెన్ లో పెంచే మొక్కలను పెంచడం కొంచెం కష్టమైన పనే అయినా, ఇంటిలోపల పెంచుకొనే మొక్కలు మెయింటెనెన్స్ సులభమే. అంతే కాదు ఇంటి అందం. ఇంట్లో వారికి ఆరోగ్యకరం. ఇంట్లో కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. కొంత మందికి మొక్కలు పెంచుకోవాలనే ఆసక్తి ఉన్నా కూడా, సమయం లేక గార్డెనింగ్ మొక్కల జోలికి పోకుండానే గడుపేస్తుంటారు. అయితే ఎక్కడైన అందమైన మొక్కలు చూసినప్పుడు మన ఇంట్లో కూడా అలాంటి మొక్కలుంటే ఎంత బాగుండు అనుకుంటారు. అలాంటి వారి కోసం..కొన్నిసులభంగా పెంచుకొనే ఇండోర్ మొక్కలు..

స్నేక్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్

ఈ మొక్క గాలిలో వున్న విషవాయువులను పీలుస్తుందని చెపుతారు. మంచితేమను కలిగి వుండి దాని పరిసరాలలో సహజమైన తేమను ఏర్పరుస్తుంది. ఇది లక్ మాత్రమే కాక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఈ మొక్కల సూర్మ రశ్మిలోనూ, నీడలో కూడా పెరుగుతాయి. వీటికి నీటి రెగ్యులర్ గా పోయాల్సిన అవసరం ఉండదు. ఈ మొక్క ఆకులు చాలా చిన్నగా ఉంటాయి. అందులోనూ చాలా వెరైటీలు గల మొక్కలు అందుబాటులో ఉన్నాయి.

అలోయి

అలోయి

అలోయి ప్లాంట్స్ ఇంట్లో పెంచుకోవడం వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. ఇది చర్మ సమస్యలకు చాలా మంచి చేస్తుంది. అంతే కాదు మెడిసినల్స్ బెనిఫిట్స్ కూడా అధికమే. కాబట్టి ఇంట్లో పెంచుకొనే ఇతర మొక్కలతో పాటు ఈ అలోయి ప్లాంట్ ను కూడా చేర్చండి. దీని నిర్వాహణ బాధ్యత కూడా తక్కువగానే ఉంటుంది. ఈ మొక్కలను ఇంటి ఆవరణంలోని గార్డెన్ లోనో లేదా బాల్కనీలో పెంచుకోవాచ్చు. దీనికి ఎక్కువ నీరు పోయడం వల్ల మొక్క త్వరగా చనిపోతుంది. కాబట్టి అవసరం మేరకు మాత్రమే నీరు పోయాలి.

స్పైడర్ ప్లాంట్

స్పైడర్ ప్లాంట్

ఇది కూడా అతి వేగంగా పెరిగే మొక్కే. ఇలాంటి మొక్కలను మనం సాధారణంగా అనేక ఇళ్ళల్లో గమనించే ఉంటాం. ఈ మొక్కలను ఇంటిలోపాల, లేదా ఇంటి బయట కూడా పెంచుకోవచ్చు. స్పైడర్ ప్లాంట్ మట్టిలోనే పెరుగుతాయి. వీటిని ప్రతి రోజూ నీటినందిస్తూ, మూడు నుండి నాలుగు గంటల సేపు సూర్యరశ్మి తగిలేవిధంగా చూసుకోవాలి. ఇది ముఖ్యంగా కుంపట్లో పెరిగే మొక్క.

రబ్బర్ ట్రీ

రబ్బర్ ట్రీ

రబ్బర్ ట్రీ ని ఒక మంచి ఇండోర్ మొక్క అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చూడటానికి అందంగా ఆకులు పెద్దగా పొడవుగా ఉంటాయి. చాలా మంది ఇల్లల్లో ఈ మొక్కను విరివిగా పెంచుకొంటారు. ఈ మొక్క కాండాన్ని పూర్తిగా పాట్ లో పాతి గ్రీన్ గా ఉన్న మొక్కగా భాగాన్ని మాత్రం పైకి కనబడేలా నాటాలి. ఈ మొక్క సూర్యరశ్మిలోనూ పెట్టుకోవచ్చు లేదా బాల్కనీలోనూ పెట్టుకోవచ్చు. ఈ మొక్కకు రెగ్యులర్ గా నీటిని పోయాల్సి ఉంటుంది. ఈ మొక్క ఇంట్లో పెట్టడం ద్వారా ఒక అందమైన అర్నమెంట్ గా తెలుస్తుంది.

క్రోటన్

క్రోటన్

క్రోటన్ మొక్కలను అవుట్ డోర్ లో పెంచుకోవడం చాలా మంచిది. క్రోటన్ మొక్కల్లో చాలా రకాల కలర్స్ ఉంటాయి. కాబట్టి ఇంటికి మరింత అందాన్ని అందించే ఈ మొక్కలు అవుట్ డోర్ పెంచుకోవడమే మంచిది. ఈ మొక్కలు గ్రీన్, ఎరుపు, పసుపు ఇంకా ఇతర కలర్స్ లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సూర్య రశ్మి ఈ మొక్కల మీద పడగానే ఈ మొక్కలు మరింత అందంగా మెరుస్తుంటాయి. ఈ మొక్కలకు తక్కువ నీరు పట్టడం మంచిది. మరియు మొయింటెనెన్స్ కూడా సులభం.

జడె ప్లాంట్

జడె ప్లాంట్

అతి తక్కువ నీటిని పీల్చే మొక్కలు పెంచుకోవాలనుకొన్నప్పుడు ఈ మొక్కలను ఎంపిక చేసుకోవడం చాలా మంచిది. ఈ మొక్కలు చాలా తక్కువ నీటిని పీల్చుకొంటాయి. ఈ మొక్కల యొక్క ఆకులు చాలా చిన్నగా ఉండి, తేమగా కనబడుతుంటాయి. ఈ మొక్కలను కూడా ఇండోర్ మొక్కలుగా ఇంటిలోపలే పెంచుకోవచ్చు. ఎంటువంటి సమస్య ఉండదు. ఈ ఇండోర్ మొక్కలను పెంచుకొని మీ ఇంటి అందాన్ని మరింత పెంపొందికోండి..

Story first published: Tuesday, October 16, 2012, 15:43 [IST]
Desktop Bottom Promotion